
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సీతారామం’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఆగస్ట్ 5న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రూ.75 కోట్ల కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. ఈ ప్రేమ కావ్యానికి అమరికాలో కూడా మంచి ఆదరణ లభించింది. అక్కడ ఇప్పటివరకు 1.3 మిలియన్ డాలర్స్ వసూళ్లు సాధించింది.
సాధారణ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా సీతారామంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలు సీతారామం చిత్రాన్ని ప్రశంసిస్తూ ట్వీట్స్ చేశారు. తాజాగా ఆ లిస్ట్‌లో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరారు. రీసెంట్ ఈ సినిమా వీక్షించిన చిరు.. ట్వీటర్ వేదికగా చిత్రబృందాన్ని పొగడ్తలతో ముంచెత్తారు.
(చదవండి: వాట్ ఏ ట్రాన్స్‌ఫర్మేమషన్.. ఈ హీరోయిన్స్ ఎంతలా మారిపోయారో)
‘సీతారామం’చూశాను. ఒక చక్కటి ప్రేమకావ్యం చూసిన అనుభూతి. ముఖ్యంగా ఎంతో విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో ఈ ప్రేమ కథని ఆవిష్కరించిన విధానం ఎంతగానో నచ్చింది. మనసులో చెరగని ముద్ర వేసే ఇలాంటి చిత్రాన్ని ఎంతో ఉన్నతమైన నిర్మాణ విలువలతో నిర్మించిన అశ్వినీదత్ గారికి, స్వప్నాదత్, ప్రియాంక దత్‌లకు, ఒక ప్యాషన్‌తో చిత్రీకరించిన దర్శకుడు హను రాఘవపూడికి, కలకాలం నిలిచే సంగీతాన్ని అందించిన విశాల్ చంద్రశేఖర్‌కి, అన్నిటికన్నా ముఖ్యంగా సీతా-రామ్‌లుగా ఆ ప్రేమకథకి ప్రాణం పోసిన మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్‌లకు, సూత్రధారి పాత్రని పోషించిన రష్మిక మందన్నకి మొత్తం టీం అందరికీ నా శుభాకాంక్షలు! ప్రేక్షకుల మనసులు దోచిన ఈ చిత్రం మరెన్నో అవార్డులను, రివార్డులను జాతీయ స్థాయిలో గెలవాలని మనస్పూర్తిగా అభిలాషిస్తున్నాను’అని చిరంజీవి ట్వీట్ చేశారు.
Kudos Team #SitaRamam 💐@VyjayanthiFilms @AshwiniDuttCh @SwapnaDuttCh #PriyankaDutt @dulQuer @mrunal0801 @iamRashmika @hanurpudi @iSumanth @Composer_Vishal #PSVinod pic.twitter.com/BEAlXhWPa3
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 27, 2022
Comments
Please login to add a commentAdd a comment