Laal Singh Chaddha Becomes Highest Grossing Hindi Film Of 2022 In International Box Office - Sakshi
Sakshi News home page

Laal Singh Chaddha Collections: ఇక్కడ అట్టర్‌ ఫ్లాప్‌.. అక్కడ రికార్డు

Aug 24 2022 11:47 AM | Updated on Aug 24 2022 12:13 PM

Laal Singh Chaddha Is Now The Highest Grossing Hindi Film International Box Office - Sakshi

బాలీవుడ్‌ మిస్టర్ పర్‌ఫెక్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం 'లాల్‌సింగ్‌ చడ్డా’. ఆస్కార్‌ విన్నింగ్‌ ఫిల్మ్‌ ‘ఫారెస్ట్‌ గంప్‌’కు హిందీ  రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రంపై బాలీవుడ్‌ భారీ ఆశలు పెట్టుకుంది. వరుసగా డిజాస్టర్లతో సతమతమవుతున్న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌కు ఊపిరి అందిస్తుందని భావించారు. కానీ ఆగస్ట్‌ 11న విడుదలైన ఈచిత్రం భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఆమిర్ ఖాన్ ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. ఆ ఆశలన్నీ అడియాసలయ్యాయి.  ఇండియాలో దాదాపు రూ.60 కోట్లను మాత్రమే వసూలు చేసి ఆమిర్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ డిజాస్టర్‌గా నిలిచింది. 

(చదవండి: తారక్‌ వల్లే నా పెళ్లి జరిగింది: ప్రముఖ నిర్మాత కూతురు)

అయితే విదేశాల్లో మాత్రం ‘లాల్‌సింగ్‌’ రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది విదేశాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన హిందీ చిత్రంగా ‘లాల్‌సింగ్‌ చడ్డా’ నిలిచింది. ఓవర్సీస్‌లో 7.5 మిలియన్ల డాలర్స్‌ కలెక్ట్‌ చేసి గంగూబాయి కతియావాడి (7.47 మిలియన్స్‌ డాలర్స్‌), భూల్ భూలయ్య 2(5.88 మిలియన్స్‌ డాలర్స్‌) పేరిట ఉన్న రికార్డును చెరిపేసింది.  ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటి వరకు  రూ.126 కోట్లను వసూలు చేసింది. 

అద్వెత్‌ చందన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కరీనా కపూర్, అక్కినేని నాగ చైతన్య  కీలక పాత్రలు పోషించారు. వైయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చ‌ర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై  ఆమిర్ ఖాన్, కిర‌ణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement