Aamir Khan Returns His Remuneration For Laal Singh Chaddha Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Aamir Khan: కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ డిజాస్టర్‌గా ‘లాల్‌సింగ్‌ చడ్డా’.. ఆమిర్‌ ఖాన్‌ కీలక నిర్ణయం

Published Thu, Sep 1 2022 1:02 PM | Last Updated on Thu, Sep 1 2022 1:44 PM

Aamir khan Returns His Remuneration For Laal Singh Chaddha - Sakshi

బాలీవుడ్‌ మిస్టర్ పర్‌ఫెక్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ హీరోగా నటించిన 'లాల్‌సింగ్‌ చడ్డా’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా బోల్తా పడింది. ఈ ఏడాది ఆగస్ట్‌ 11న విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజు నుంచి నెగెటివ్‌ టాక్‌ వచ్చింది. దీంతో రెండో రోజు నుంచే థియేటర్స్‌ అన్ని ఖాలీ అయిపోయాయి. దాదాపు రూ.180 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. ఇప్పటి వరకు రూ.70 కోట్ల కలెక్షన్స్‌ మాత్రమే రాబట్టి ఆమిర్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ డిజాస్టర్‌గా నిలిచింది.

ఈ చిత్రం మిగిల్చిన నష్టాన్ని పూడ్చడానికి తాజాగా ఆమిర్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం తాను తీసుకున్న రూ.50 కోట్ల రెమ్యునరేషన్‌ని తిరిగి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడట. తోటి నిర్మాతలకు ఇబ్బంది కలిగించొద్దనే ఆమిర్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఈ నిర్ణయంతో ఆమిర్‌కు మొత్తంగా రూ.100 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. 
(చదవండి: నాన్న రోడ్డుపై పరుగెత్తించి కొట్టారు.. నాగబాబు నలిగిపోయాడు: చిరంజీవి)

అద్వెత్‌ చందన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కరీనా కపూర్, అక్కినేని నాగ చైతన్య  కీలక పాత్రలు పోషించారు. వైయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చ‌ర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై  ఆమిర్ ఖాన్, కిర‌ణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement