లెజెండరీ ఫిల్మ్ మేకర్ మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన హిస్టారికల్ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. ప్రముఖ తమిళ రచయిత కల్కి రాసిన నవల ఆధారంగా, చోళుల కథతో ఈ సినిమా తెరకెక్కింది. చియాన్ విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మి, ప్రకాష్‌రాజ్, శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాళ, కీలక పాత్రల్లో నటించారు. భారీ అంచన సెప్టెంబర్ 30న విడుదలైన ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో మిశ్రమ స్పందన లభించగా, తమిళనాట మాత్రం హిట్ టాక్ వచ్చింది. దీంతో అక్కడ ఈ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతూ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరేందుకు పరుగులు పెడుతోంది.
విడుదలైన రెండు రోజులకే ఒక్క తమిళనాడులోనే రూ.47 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రం రూ.9 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. కేరళలో రూ.6 కోట్లు, ఓవర్సీస్‌లో దాదాపు 60 కోట్ల పైగా వసూళ్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో ఈ చిత్రం దాదాపు రూ.147 కోట్ల గ్రాస్, రూ.75 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ.130 కోట్ల ప్రిరిలీజ్ బిజినెస్ జరిగింది. తమిళనాడుతో పాటు ఓవర్సీస్‌లో కూడా మంచి టాక్ సంపాదించుకోవడంతో ఈజీగా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment