ప్రముఖ దర్శకుడు మణిరత్నం అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘పొన్నియన్ సెల్వన్: పార్ట్ 1’. పదో శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనల సమాహారంగా ఈ చిత్రం రూపొందుతుంది. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. సెప్టెంబర్ 30న ఈ మూవీ ఐదు(తెలుగు,తమిళం, మలయాళం, హిందీ, కన్నడ) భాషల్లో విడుదల కానుంది. నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా ఫస్ట్‌లుక్, టీజర్లను వరుసగా రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఇక రీసెంట్‌గా విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
చదవండి: Nayanthara: నయనతార షాకింగ్ రెమ్యూనరేషన్.. ఒకేసారి అన్ని కోట్లా..?
ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం వివాదంలో నిలిచినట్లు తెలుస్తోంది. ఈ టీజర్‌లోని పలు సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మణిరత్నం, హీరో విక్రమ్‌కు కోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ చిత్రంలో చోళులను, చోళ రాజవంశం గురించి తప్పుగా చూపించారని సెల్వం అనే న్యాయవాది ఆరోపిస్తు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీజర్‌లో ఆదిత్య కరికాలన్(విక్రమ్ పోషించిన పాత్ర) నుదిటిపై తిలకం లేదని ఎత్తి చూపారు. కానీ, విక్రమ్‌కు సంబంధించిన పోస్టర్లో మాత్రం తిలకం ఉన్నట్లుగా చూపించారు. ఈ సినిమాలో చోళులను తప్పుగా చూపించారని ఆయన ఆరోపించారు.
Welcome the Chola Crown Prince! The Fierce Warrior. The Wild Tiger. Aditya Karikalan! #PS1 🗡@madrastalkies_ #ManiRatnam pic.twitter.com/UGXEuT21D0
— Lyca Productions (@LycaProductions) July 4, 2022
చారిత్రక వాస్తవాలను చూపించడంలో దర్శక-నిర్మాతలు విఫలయ్యారేమోనని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక దీనిపై స్పష్టత రావాలంటే సినిమాను విడుదలకు ముందే ప్రత్యేకంగా ప్రదర్శించాలని లాయన్ సెల్వం తన పటిషన్‌లో డిమాండ్ చేశారు. ఈ కోర్టు నోటీసులపై దర్శకుడు మరణిరత్నం కానీ, విక్రమ్ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. కాగా ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి 1955లో రాసిన నవల ఆధారంగా పొన్నియన్ సెల్వెన్‌ను రూపొందింది. ఈ చిత్రంలో విక్రమ్, కార్తీ ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్, ప్రభు, శోభితా ధూలిపాల, ఐశ్వర్య లక్ష్మిలు కీ రోల్‌లో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment