court notice
-
పవన్ కళ్యాణ్ తిక్క కుదిరింది తిరుమల లడ్డుపై కోర్టు నోటీసులు..
-
యానిమల్ ఓటీటీ రిలీజ్ కు కష్టాలు...సమన్లు జారీ చేసిన కోర్టు..
-
వివాదంలో మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’, కోర్టు నోటీసులు
ప్రముఖ దర్శకుడు మణిరత్నం అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘పొన్నియన్ సెల్వన్: పార్ట్ 1’. పదో శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనల సమాహారంగా ఈ చిత్రం రూపొందుతుంది. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. సెప్టెంబర్ 30న ఈ మూవీ ఐదు(తెలుగు,తమిళం, మలయాళం, హిందీ, కన్నడ) భాషల్లో విడుదల కానుంది. నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా ఫస్ట్‌లుక్, టీజర్లను వరుసగా రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఇక రీసెంట్గా విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. చదవండి: Nayanthara: నయనతార షాకింగ్ రెమ్యూనరేషన్.. ఒకేసారి అన్ని కోట్లా..? ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం వివాదంలో నిలిచినట్లు తెలుస్తోంది. ఈ టీజర్‌లోని పలు సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మణిరత్నం, హీరో విక్రమ్‌కు కోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ చిత్రంలో చోళులను, చోళ రాజవంశం గురించి తప్పుగా చూపించారని సెల్వం అనే న్యాయవాది ఆరోపిస్తు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీజర్లో ఆదిత్య కరికాలన్(విక్రమ్ పోషించిన పాత్ర) నుదిటిపై తిలకం లేదని ఎత్తి చూపారు. కానీ, విక్రమ్‌కు సంబంధించిన పోస్టర్లో మాత్రం తిలకం ఉన్నట్లుగా చూపించారు. ఈ సినిమాలో చోళులను తప్పుగా చూపించారని ఆయన ఆరోపించారు. Welcome the Chola Crown Prince! The Fierce Warrior. The Wild Tiger. Aditya Karikalan! #PS1 🗡@madrastalkies_ #ManiRatnam pic.twitter.com/UGXEuT21D0 — Lyca Productions (@LycaProductions) July 4, 2022 చారిత్రక వాస్తవాలను చూపించడంలో దర్శక-నిర్మాతలు విఫలయ్యారేమోనని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక దీనిపై స్పష్టత రావాలంటే సినిమాను విడుదలకు ముందే ప్రత్యేకంగా ప్రదర్శించాలని లాయన్ సెల్వం తన పటిషన్లో డిమాండ్ చేశారు. ఈ కోర్టు నోటీసులపై దర్శకుడు మరణిరత్నం కానీ, విక్రమ్ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. కాగా ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి 1955లో రాసిన నవల ఆధారంగా పొన్నియన్ సెల్వెన్‌ను రూపొందింది. ఈ చిత్రంలో విక్రమ్, కార్తీ ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్, ప్రభు, శోభితా ధూలిపాల, ఐశ్వర్య లక్ష్మిలు కీ రోల్లో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎఆర్ రెహమాన్ సంగీతం అందించారు. -
పుల్లారెడ్డి స్వీట్స్: పుల్లారెడ్డి కొడుకు, మనవడికి కోర్టు నోటీసులు
దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత జి. పుల్లారెడ్డి కుటుంబ వివాదం చివరకు కోర్టుకు చేరింది. పుల్లారెడ్డి మనవడు ఏక్నాథ్ రెడ్డిపై ఆయన భార్య ప్రజ్ఞారెడ్డి పంజాగుట్ట పోలీసు స్టేషన్లో గృహ హింస చట్టం కేసు పెట్టిన విషయం తెలిసిందే. కాగా, ప్రజ్ఞారెడ్డి బుధవారం హైదరాబాద్ మొబైల్ కోర్టును ఆశ్రయించారు. తనను ఇంట్లోనే నిర్బంధించి వేధింపులకు గురిచేశారని ప్రజ్ఞారెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా ఇంటిలో తనను ఎలాంటి హింసకు గురి చేస్తున్నారన్న వైనాన్ని తెలిపే ఫొటో కాపీలను ఆమె కోర్టులో సమర్పించారు. దీంతో, ఆమె పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బాధితురాలు ప్రజ్ఞారెడ్డికి భద్రత కల్పించాలని పంజాగుట్ట పోలీసులను ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేసింది. అనంతరం, పుల్లారెడ్డి కొడుకు రాఘవరెడ్డితో పాటు ఆయన భార్య, కుమారుడు ఏక్నాథ్ రెడ్డికి కోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే, గత కొంతకాలంగా ఏక్నాథ్ రెడ్డి ఆయన భార్య ప్రజ్ఞా రెడ్డి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ రోజు ఏక్నాథ్ రెడ్డి.. భార్యను ఇంట్లో నుంచి బయటకు రాకుండా రాత్రికి రాత్రే ఆమె ఉంటున్న గదికి అడ్డుగా గోడను నిర్మించి అనంతరం ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. ఈ ఘటన అనంతరం ప్రజ్ఞా రెడ్డి.. పోలీసులు ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఇది కూడా చదవండి: టీవీ నటి, టిక్‌టాక్ స్టార్ కన్నుమూత -
శిల్పాశెట్టి, ఆమె సోదరి షమిత శెట్టిలకు కోర్టు నోటీసులు
బాలీవుడ్ నటి శిల్పాశెట్టిని వివాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే భర్త రాజ్‌కుంద్రా అశ్లీల వీడియో కేసుతో ఆమె కఠిన పరిస్థితులను చూస్తున్న తరుణంలో కోర్టు కేసులు, చీటింగ్ ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో తాజాగా శిల్పా శెట్టికి కోర్టు సమన్లు జారీ చేసింది. తాజాగా శిల్పాశెట్టి, ఆమె తల్లి సునంద, సోదరి షమితా శెట్టికి కోర్టు నోటీసులు ఇచ్చింది. తీసుకున్న అప్పు చెల్లించలేదని ఆరోపిస్తూ ఓ ఆటోమొబైల్ ఏజెన్సీ యజమాని ముంబైలోని అంధేరీ కోర్టును ఆశ్రయించాడు. దీంతో అతడి ఫిర్యాదు మేరకు ఈ నెల 28న కోర్టులో హాజరు కావాలంటూ శిల్పాశెట్టితో పాటు ఆమె సోదరి షమితాశెట్టి, తల్లి సునందశెట్టిని కోర్టు ఆదేశించింది. చదవండి: నేను ఆ టైప్ కాదు, నటినని నా బాయ్‌ఫ్రెండ్ వదిలేశాడు: హీరోయిన్ కేసు వివరాల్లోకి వెళితే.. శిల్పాశెట్టి తండ్రి సురేంద్ర శెట్టి ఓ ఆటోమొబైల్ ఏజెన్సీ యజమాని నుంచి 2015లో రూ.21 లక్షల రుణం తీసుకున్నారు. రుణం తిరిగి 2017 జనవరి నాటికి చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నారు. అయితే, సురేంద్ర శెట్టి 2016, అక్టోబర్ 11న మృతి చెందారు. ఈ విషయం శిల్పాశెట్టితో పాటు ఆమె తల్లికి తెలుసని, అయినా డబ్బు తిరిగి ఇచ్చేందుకు నిరాకరించారని ముంబైకి చెందిన వ్యాపారవేత్త పర్హద్ అమ్రా ఆరోపించారు. ఈ మేరకు గత శుక్రవారం జుహూ పోలీస్ స్టేషన్లో శిల్పా కుటుంబంపై ఫిర్యాదు చేయగా.. శిల్పాశెట్టితో పాటు ఆమె సోదరి షమితాశెట్టి, తల్లిపై కేసు నమోదు చేశారు. దీంతో ఈ నెల 28న కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ అయ్యాయి. -
కోర్టుకెక్కిన శింబు.. విశాల్‌కు నోటీసులు
పెరంబూరు: నటుడు శింబు కోర్టుకెక్కి నటుడు విశాల్‌కు షాక్ ఇచ్చాడు. చర్చనీయాంశ నటుడిగా ముద్ర వేసుకున్న శింబు ఈసారి వార్తల్లోకి కాదు కాదు కోర్టుకెక్కారు. శింబు హీరోగా మైకెల్‌రాయప్పన్ 2017లో అన్భానవన్ అడంగాదవన్ అసరాదవన్ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఆధిక్. రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ కారణంగా శింబుకు నిర్మాత మైకెల్ రాయప్పన్‌కు మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీంతో చిత్ర నిర్మాత శింబు సరిగా షూటింగ్‌కు రానందువల్ల, తను కథలో జోక్యం కారణంగానే చిత్రం ఫ్లాప్ కావడంతో పాటు తనకు భారీ నష్టాన్ని మిగిల్చిందని, కాబట్టి తనకు నష్ట పరిహారం చెల్లించేలా ఆదేశించాలంటూ నిర్మాతల మండలిని ఆశ్రయించారు. దీనిపై వివరణ కోరుతూ నిర్మాతల మండలి శింబుకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఆ నోటీసులకు శింబు బదులివ్వలేదని, దీంతో ఆయనపై రెడ్ కార్డు విధించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే శింబు మాత్రం కొత్త చిత్రాల్లో నటిస్తూనే ఉన్నాడు. తాజాగా ఆయన నటించిన వందా రాజావాదాన్ వరువేన్ చిత్రానికి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నటుడు శింబు నిర్మాతల మండలి అ«ధ్యక్షుడు విశాల్, అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్ర నిర్మాత మైకెల్ రాయప్పన్‌లపై చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అందులో తాను నటించిన అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రానికి రూ.8 కోట్లు పారితోషికం ఒప్పందం చేసుకున్నా, ఆ చిత్ర నిర్మాత రూ.5 కోట్లే చెల్లించాడని, అంతేగాకుండా తన గురించి అసత్య ప్రచారం చేస్తున్నాడని పేర్కొన్నాడు. అదే విధంగా నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ కట్ట పంచాయితీ చేస్తున్నాడని ఆరోపించాడు. తనపై అసత్య ప్రచారం చేసిన నిర్మాత మైకెల్ రాయప్పన్‌పై పరువు నష్టం దావా కింద కోటి రూపాయలను చెల్లించేలా ఆదేశించాలని, అదే విధంగా తన కొత్త చిత్రాల విషయంలో నిర్మాతల మండలి గానీ, నటీనటుల సంఘం కానీ జోక్యం చేసుకోరాదని ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌పై మంగళవారం న్యాయమూర్తి కల్యాణసుందరం సమక్షంలో కోర్టులో విచారణ జరిగింది. శింబు తరఫు వాదనలను విన్న న్యాయమూర్తి బదులు పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా నిర్మాత మైకెల్‌రాయప్పన్, విశాల్‌కు నోటీసులు జారీ చేయాల్సిందిగా ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 18 తేదీకి వాయిదా వేశారు. -
‘హీరో శివాజీకి ముందే ఎలా తెలుసు?’
సాక్షి, అమరావతి: తెలంగాణ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే టీడీపీ పార్టీ నోటీసుల డ్రామా ఆడుతోందని ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. సోమవారం మీడియాతో ఆయన చిట్‌చాట్ నిర్వహించారు. ఐదు వందలతో పోయే కేసును పట్టుకొని ఎదో జరిగిపోయినట్లు టీడీపీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారని, ఇటువంటి ప్రచారం వలన ఎటువంటి సానుభూతి రాదని పేర్కొన్నారు. ఇదివరకు నోటీసులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో అందుకున్నట్లు సమాచారం ఉందని తెలిపారు. అదే నోటీసులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి వస్తే మాత్రం కోర్టులపై గౌరవం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడేవారని ఎద్దేవ చేశారు. చంద్రబాబుకు కోర్టు నుంచి నోటీసులు వస్తే ప్రధాని నరేంద్ర మోదీ చేయించారనడం హాస్యాస్పదమన్నారు. స్టేలు తెచ్చుకోవడం కొత్తేంకాదు హీరో శివాజీతో డ్రామా ఆడించింది టీడీపీ నాయకులేనని, ఈ డ్రామాలు ప్రజలకు తెలియదనుకోవడం వారి మూర్ఖత్వమని మండిపడ్డారు. అరెస్టు వారెంట్ విషయం వారం రోజుల ముందు శివాజీకి ఎలా తెలసని ప్రశ్నించారు. టీడీపీ ప్రజల చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, వారి మాటలను నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరని వివరించారు. కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకోవడం చంద్రబాబుకు కొత్తేం కాదని విష్ణుకుమార్ రాజు ఎద్దేవ చేశారు. -
చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి పట్టుకుంది
-
‘నోటీసులను చంద్రబాబు పబ్లిసిటీకి వాడుకుంటున్నారు’
సాక్షి, హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పబ్లిసిటీ పిచ్చి పట్టుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కోర్టు నోటీసులను కూడా చంద్రబాబు పబ్లిసిటీకి వాడుకుంటున్నారని తెలిపారు. రాయలసీమలో దుర్భిక్షం ఉంటే.. చంద్రబాబు మాత్రం శ్రీశైలంకు వచ్చి జలసిరి హారతి అంటూ కట్టుకథలు చెబుతున్నారని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ధర్నాలు చేసిన మంత్రి దేవినేని ఉమా నేడు సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. సొంత జిల్లా చిత్తూరుతో పాటు రాష్ట్రంలోని ఏ జిల్లా రైతులతోనైనా రైతు బాంధవుడని అనిపించుకునే ధైర్యం ఉందా అని చంద్రబాబుకు సవాలు విసిరారు. సినిమా నటులతో ఆపరేషన్ గరుడ అని కట్టుకథలు చెప్పించి జనాలను నమ్మించాలని చూస్తున్నారని తెలిపారు. అది ఆపరేషన్ గరుడ కాదని.. ఆపరేషన్ పెరుగు, వడ, అప్పడం అని అన్నారు. కోర్టు నోటీసులు వస్తే ఇంత భయం ఎందుకని ప్రశ్నించారు. 22 సార్లు నోటీసులిస్తే కోర్టుకు హాజరవ్వకుండా ఇప్పుడు హడావిడి చేస్తున్నారని పేర్కొన్నారు. మహారాష్ట్ర గవర్నమెంట్ కేసు పెడితే.. ఆ ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక మంత్రి భార్యను టీటీడీ బోర్డు నుంచి ఎందుకు సస్పెండ్ చేయడం లేదని ప్రశ్నించారు. -
రుణమాఫీ మాయ
డ్వాక్రా మహిళలకు కోర్టు నోటీసులు లోక్ అదాలత్ ద్వారా బకాయిల వసూలుకు చర్యలు కళ్యాణదుర్గం : చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన రుణమాఫీ హామీ మహిళల పాలిట శాపంగా మారింది. రుణమాఫీ అవుతుందని అప్పు చెల్లించని డ్వాక్రా మహిళలకు బ్యాంకుల ద్వారా నోటీసులు అందడంతో కోర్టు మెట్లెక్కాల్సి వస్తోంది. కళ్యాణదుర్గం పట్టణంలోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) బ్రాంచ్‌లో రుణం పొందిన దాదాపు 75 మహిళా సంఘాల సభ్యుల నుంచి వన్‌టైం సెటిల్మెంట్ కింద రూ.38 లక్షల బకాయిల రికవరీ కోసం అధికారులు జాతీయ లోక్‌అదాలత్‌ను ఆశ్రయించారు. జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో శనివారం జరిగిన జాతీయ లోక్‌అదాలత్‌కు బాధిత మహిళా సంఘాల సభ్యులు హాజరయ్యారు. లోక్‌అదాలత్‌లో ఇన్చార్జ్ జడ్జి అప్పలస్వామి, బ్యాంక్ మేనేజర్ నాగేశ్వరరావు, బాధిత మహిళా సంఘాల సభ్యులు రాజీ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రుణమాఫీ హామీ నమ్మి మోసపోయామని, ఎస్బీఐలో మహిళా సంఘం రుణానికి అధిక వడ్డీ వసూలు చేస్తున్నారని సంఘం సభ్యులు వాపోయారు. బకాయిల వసూలు కోసమే.. మహిళా సంఘాల సభ్యులు బ్యాంకులో తీసుకున్న రుణాలు పూర్తిస్థాయిలో చెల్లించలేదు. లోక్‌అదాలత్‌లో రాజీ మార్గం ద్వారా బకాయిల సమస్యల పరిష్కారం కోసమే ప్రయత్నిస్తున్నాం. అంతకు మించి మహిళలను కోర్టుకు పిలిపించాలనేది మా అభిమతం కాదు. అధిక వడ్డీలు వసూలు చేశామని చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. – నాగేశ్వరరావు, ఎస్బీఐ మేనేజర్, కళ్యాణదుర్గం -
‘రబ్తా’ చిత్ర నిర్మాతకు నోటీసులు జారీ
హైదరాబాద్ : హిందీ చిత్రం ’రబ్తా’ నిర్మాతకు కోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది. మగధీర చిత్రాన్ని కాపీ కొట్టారంటూ ఆ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ నిన్న హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. రాబ్తా విడుదలను నిలిపివేయాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు. దీనిపై జూన్ 1లోగా రబ్తా నిర్మాత సమాధానం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, కృతి సనన్ (‘వన్ నేనొక్కడినే’ ఫేమ్) జంటగా నటించిన రాబ్తా చిత్రం వచ్చే నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రబ్తా సినిమా ట్రైలర్ రిలీజ్ అవగానే ‘మగధీర’కు, దీనికి ఏదో కనెక్షన్ ఉన్నట్టుంది!’’ అంటూ సోషల్ మీడియాలో సెటైర్స్ పేలాయి. ‘రాబ్తా’ ట్రైలర్లో, స్టిల్స్‌లో ‘మగధీర’ ఛాయలు కనిపిస్తున్నాయనే కామెంట్స్ వినిపించాయి కూడా. -
హీరో మహేశ్ కు కోర్టు నోటీసు
హైదరాబాద్: మహేశ్ బాబు సినిమా ‘శ్రీమంతుడు’పై వివాదం ముదురుతోంది. హీరో మహేశ్ బాబు, దర్శకుడు కొరటాల శివ, నిర్మాత ఎర్నేని నవీన్ లకు కోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. మార్చి 3న తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. తాను రాసిన ‘చచ్చేంత ప్రేమ’ నవలను కాపీ కొట్టి శ్రీమంతుడు సినిమా తీశారని శరత్ చంద్ర అనే నవలాకారుడు ఫస్ట్ అడిషనల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించాడు. దీనిపై స్పందించిన కోర్టు చిత్ర నిర్మాణ బృందంలో కొందరికి ఇప్పటికే సమన్లు జారీ చేసింది. ఎంబీ క్రియేషన్, మైత్రిమూవీస్ పతాకంపై తెరకెక్కిన ‘శ్రీమంతుడు’ మహేశ్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. కలెక్షన్లతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘శ్రీమంతుడు’ స్ఫూర్తితో పలువురు ప్రముఖులు గ్రామాలను దత్తత తీసుకున్నారు. మహేశ్ కూడా రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు. -
గూగుల్ కి షాకిచ్చిన కోర్టు
అలహాబాద్: గ్లోబల్ సెర్చి ఇంజీన్ కంపెనీ గూగుల్ సీఈవో, భారత్ లోని గూగుల్ ఇతర ప్రధాన అధికారులు ఇబ్బందుల్లో పడ్డారు. మంగళవారం అలహాబాద్ స్థానిక కోర్టు వారికి నోటీసులు జారీ చేసింది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేరును టాప్ టెన్ క్రిమినల్స్ లిస్టులో చేర్చడంపై దాఖలైన పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. సీఈవో సహా ఇతర భారత్ కు చెందిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా ఆదేశించింది. న్యాయవాది సుశీల్ కుమార్ మిశ్రా ఫిర్యాదుపై విచారించిన కోర్టు తదుపరి విచారణను ఆగస్టు 31 కి వాయిదా వేసింది. గత ఏడాది గూగుల్ ప్రకటించిన ప్రపంచంలోని టాప్ టెన్ నేరస్థుల జాబితాలో మోదీ ఫోటో ప్రత్యక్షంకావడంతో వివాదం రేగింది. దావూద్, అబ్బాస్ నఖ్వీ లాంటి కరడుకట్టిన క్రిమినల్స్ పక్కన ప్రధాని నరేంద్ర మోదీ పేరు జతచేరడంపై న్యాయవాది సుశీల్ కుమార్ మిశ్రా 2015 నవంబరులో చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు ఫిర్యాదు చేశారు. అయితే ఇది క్రిమినల్ కేసు కిందికి వస్తుందని దీన్ని సీజెఎం తిరస్కరించారు. దీన్ని సవాల్ చేస్తూ సుశీల్ కమార్ రివిజన్ పిటిషన్ దాఖలుచేశారు. దీంతో తాజా ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా టాప్ టెన్ క్రిమినల్ లిస్ట్ లో మోదీ పోటోపై గూగుల్ క్షమాపణ చెప్పింది. ఎక్కడో పొరపాటు జరిగిందని వివరణ యిచ్చిన సంగతి తెలిసిందే. -
డ్వాక్రా మహిళలకు కోర్టు నోటీసులు
-
అద్దె చెల్లించలేదని నటుడికి నోటీసులు
బెంగళూరు : ఇంటి అద్దె చెల్లించకపోవటంతో కన్నడ నటుడుకు కోర్టు నోటీసులు ఇచ్చింది. వివరాల్లోకి వెళితే కన్నడ యువ నటుడు యశ్ నాలుగేళ్లుగా తన ఇంట్లో అద్దెకు ఉంటూ... అద్దె ఇచ్చేందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ ఇంటి యజమాని డాక్టర్ మునిప్రసాద్ కోర్టును ఆశ్రయించారు. కత్రిగుప్పెలో ఉంటున్న తన ఇంటిలో కొంతభాగాన్ని నటుడు యశ్ కు నాలుగేళ్ల క్రితం అద్దెకు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే 2013 నుంచి యశ్ అద్దె ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని, అంతేకాకుండా ఇల్లు ఖాళీ చేయడం లేదంటూ మునిప్రసాద్ సోమవారం కోర్టును ఆశ్రయించారు. రూ.21.37 లక్షల బకాయిలు ఉన్నట్లు తెలిపారు. దాంతో కోర్టు నోటీసులు జారీ చేసి యశ్ కుటుంబం శనివారం న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. కాగా అద్దె బకాయిలపై మునిప్రసాద్ తంలోనే గిరినగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. యశ్ వివరణ: ఓ ఏడాది నుంచి ఇంటి అద్దె చెల్లించడం లేదని, యశ్‌తో పాటు అతని తల్లి పుష్ప అంగీకరించారు. ఇంటి యజమాని కన్నడిగులకే అవమానం చేశారని, అందుకే తాము అద్దె చెల్లించడం నిలిపివేశామన్నారు. మునిప్రసాద్ ఇతర భాషలో తమను తిడుతున్నారని తెలిపారు. అయితే అద్దె చెల్లించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే అద్దె తీసుకునేందుకు మునిప్రసాద్ నిరాకరిస్తున్నారని, ఇప్పటికూ ఇంటికి వచ్చి అద్దె తీసుకు వెళ్లవచ్చని యశ్ తల్లి పుష్ప తెలిపారు.