ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పబ్లిసిటీ పిచ్చి పట్టుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కోర్టు నోటీసులను కూడా చంద్రబాబు పబ్లిసిటీకి వాడుకుంటున్నారని తెలిపారు. రాయలసీమలో దుర్భిక్షం ఉంటే.. చంద్రబాబు మాత్రం శ్రీశైలంకు వచ్చి జలసిరి హారతి అంటూ కట్టుకథలు చెబుతున్నారని మండిపడ్డారు.