warrent
-
Israel-Hamas war: నెతన్యాహు, హమాస్ నాయకుల అరెస్టుకు ఆదేశాలు కోరతా
జెరూసలెం: అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుంచి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, హమాస్ అగ్రనేతలపై అరెస్టు వారెంట్లు కోరనున్నట్లు చీఫ్ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ సోమవారం వెల్లడించారు. గాజా, ఇజ్రాయెల్‌లో యుద్ధ నేరాలు, మానవాళిపై అకృత్యాలకు గాను నెతన్యాహు, ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్, హమాస్ నేతలు యోహియా సిన్వర్, మహ్మద్ దీఫ్, ఇస్మాయిల్ హనియేహ్‌లు బాధ్యులని ఆయన అన్నారు. ముగ్గురు జడ్జిల ప్యానెల్ అరెస్టు వారెంట్లు, కేసు కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనుంది. సాధారణంగా ఇలాంటి వాటిల్లో నిర్ణయానికి జడ్జిలు రెండు నెలల సమయం తీసుకుంటారు. వారెంట్లు జారీ అయినా నెతన్యాహు, గాలంట్లకు వచ్చే ఇబ్బందేమీ లేదు. కానీ నెతన్యాహు, గాలంట్‌లు విదేశీ పర్యటనలకు వెళ్లడం కష్టమవుతుంది. వారెంట్లు కోరడాన్ని యూదు వ్యతిరేక చర్యగా నెతన్యాహు అభివర్ణించారు. -
మసీదులో డ్యాన్స్ వీడియో.. చిక్కుల్లో పడ్డ నటి, అరెస్టు వారెంట్ జారీ
Arrest Warrants Of 'Hindi Medium' Star Saba Qamar: పాకిస్తాన్ నటి సబా ఖమర్ చిక్కుల్లో పడింది. మసీదు పవిత్రతకు భంగం కలిగించిందని పాకిస్తాన్ కోర్టు ఆమెకు అరెస్టు వారెంట్ జారీ చేసింది. వివరాల ప్రకారం..'హిందీ మీడియం' స్టార్ సబా ఖమర్ లాహోర్‌లోని ఓ పురాతన మసీదులో పాకిస్తానీ సింగర్ బిలాల్ సయూద్తో కలిసి ఓ డ్యాన్స్ వీడియోలో నటించింది. ఇది ప్రజల ఆగ్రహానికి కారణమైంది. మసీదు పవిత్రతకు భంగం కలిగించారంటూ వీరిద్దరిపై పాకిస్తాన్ శిక్షాస్మృతిలోని సెక్షన్ 295 కింద లాహోర్ పోలీసులు గతేడాది ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనికి సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపినా వారిద్దరూ ఏవో కారణాలు చెప్పి తప్పించుకొని తిరిగూ వచ్చారు. తాజాగా కేసును విచారించిన లాహోర్ మెజిస్టీరియల్ కోర్టు సభాతో పాటు బిలాల్‌కు బెయిలబుల్ అరెస్టు వారెంట్‌ను జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 6కు వాయిదా వేసింది. కాగా ఈ డ్యాన్స్ వీడియో విషయమై సోషల్ మీడియాలో చంపేస్తామనే బెదిరింపులు రావడంతో ఆ వీడియో విషయమై వారిద్దరూ క్షమాపణలు తెలిపారు. నటి సభా మాట్లాడుతూ.. ఆ వీడియోలో కేవలం పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు చిత్రికరించినట్లు తెలిపింది. కాగా హిందీ మీడియం వంటి పలు బాలీవుడ్ మూవీస్‌లో నటించిన ఆమె నటనకు మంచి స్పందన వచ్చింది. -
బెల్లంకొండపై..అరెస్ట్ వారెంట్
సాక్షి, హైదరాబాద్: సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. తమకు చెల్లించాల్సిన రూ.3.5 కోట్లను తిరిగి ఇవ్వటంలో విఫలమయ్యారని ఓ ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కోర్టును ఆశ్రయించగా ఈ మేరకు అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. 2010లో యష్‌రాజ్ ఫిలింస్ నిర్మించిన ‘బాండ్ బాజా బరాత్’ సినిమా హిందీలో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో 2013 బెల్లకొండ సురేష్ సిద్ధార్థ్, సమంత హీరో హీరోయిన్లుగా జబర్దస్ అనే సినిమాను నిర్మించారు. అందులో 19 సీన్లు కాపీ చేశారని ఆరోపిస్తూ యష్‌రాజ్ ఫిలింస్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం సినిమా ప్రదర్శనను నిలిపేసింది. అయితే జబర్దస్త్ సినిమా నిర్మాణంలో ఉండగానే టెలివిజన్ శాటిలైట్ టెలీకాస్ట్ రైట్స్‌ను రూ.3.5 కోట్లకు ఓ ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ విక్రయించారు. యష్‌రాజ్ ఫిలింస్ ఫిర్యాదు మేరకు సినిమా ప్రదర్శన నిలిపేయటంతో పాటు టెలివిజన్‌లోనూ టెలికాస్ట్ చేయవద్దని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు సదరు టీవీ ఛానెల్‌కు ఆ మొత్తాన్ని బెల్లంకొండ సురేష్ తిరిగి చెల్లించాల్సి ఉన్నప్పటికి ఆరేళ్లుగా రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తుండటంతో ఛానెల్ యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. అయితే బెల్లంకొండ తీసుకున్న రూ.3.5 కోట్ల మొత్తం ప్రస్తుతం రూ.11.75 కోట్లకు చేరింది. ఈ మేరకు కోర్టు బెల్లంకొండపై అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. -
చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి పట్టుకుంది
-
కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోకు వారెంట్
కోల్‌కతా : కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోకు వారెంట్ జారీ అయింది. ఓ టీవీ చానల్ కార్యక్రమంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో ఆయన కోర్టుకు గైర్హాజరు కావడంతో ఈ వారెంట్ జారీ అయింది. కాగా కేంద్రమంత్రి అనుచిత వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ ఫిర్యాదుతో కోల్‌కోతా పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా జనవరిలో జరిగిన ఓ టీవీ చర్చా కార్యక్రమంలో మహిళల మనోభావాలను కించపరిచేలా బాబుల్ సుప్రియో వ్యాఖ్యలు చేశారంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మహువా మైత్రా ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా తనపట్ల కేంద్రమంత్రి అసభ్యంగా ప్రవర్తించారని ఆమె జనవరి 4వ తేదీన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేంద్రమంత్రిపై కేసు నమోదు చేసి అలిపోరీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అలాగే టీవీ చర్చ కార్యక్రమం ఫుటేజ్ కూడా కోర్టుకు సమర్పించారు. అయితే అంతకు ముందు దీనిపై కేంద్రమంత్రిని పోలీసులు మూడుసార్లు వివరణ కోరినా ఆయన నుంచి ఎలాంటి సమాధానం లేదని సమాచారం. మరోవైపు దీనిపై కేంద్రమంత్రి స్పందిస్తూ 'వాళ్లు ఏం చేసుకుంటారో అది చేసుకోనివ్వండి. దీనిపై నేను చెప్పేది ఏమీ లేదు' అని అన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి బెయిలబుల్ వారెంట్
హైదరాబాద్: తెలంగాణ వాలీబాల్ అసోసియేషన్ ఎన్నికల వివాదంపై చేసిన ఫిర్యాదులో భాగంగా వాంగ్మూలం ఇచ్చేందుకు కోర్టుకు హాజరుకాని మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డికి నాంపల్లి సీసీఎస్ కోర్టు సోమవారం బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జూలై 11న కోర్టుకు హాజరుకావాలని స్పష్టం చేస్తూ న్యాయమూర్తి డ్యానీరూథ్ విచారణ వాయిదా వేశారు. తెలంగాణ వాలీబాల్ అసోసియేషన్‌కు జరిగిన ఎన్నికల్లో అధ్యక్షునిగా ఇంద్రకరణ్‌రెడ్డి ఎన్నికయ్యారు. అయితే ఖమ్మం జిల్లాకు చెందిన హరినాథ్‌రెడ్డి తాను ఎన్నికైనట్లు ప్రకటించుకున్నారు. హరినాథ్‌రెడ్డిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇంద్రకిరణ్‌రెడ్డి సీసీఎస్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసును విచారణకు చేపట్టిన కోర్టు...ఫిర్యాదుదారుగా ఉన్న ఇంద్రకరణ్‌రెడ్డికి వాంగ్మూలం ఇవ్వాలంటూ కోర్టు సమన్లు జారీచేసింది. సమన్లను సీసీఎస్ అధికారులు ఇంద్రకరణ్‌రెడ్డికి అందించారు. ఈ మేరకు కోర్టుకు నివేదిక సమర్పించారు. అయినా ఇంద్రకరణ్‌రెడ్డి కోర్టుకు హాజరుకాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి బెయిలబుల్ వారెంట్ జారీచేశారు.