Saba Qamar: Pakistan Court Issues Arrest Warrants of Hindi Medium Star Saba Qamar - Sakshi
Sakshi News home page

Saba Qama: మసీదులో నటి డ్యాన్స్‌ వీడియో.. షాకిచ్చిన కోర్టు, అరెస్టు వారెంట్‌ జారీ

Published Thu, Sep 9 2021 11:41 AM | Last Updated on Thu, Sep 9 2021 3:02 PM

Pakistan Court Issues Arrest Warrants of Hindi Medium Star Saba Qamar - Sakshi

Arrest Warrants Of 'Hindi Medium' Star Saba Qamar: పాకిస్తాన్‌ నటి సబా ఖమర్‌ చిక్కుల్లో పడింది. మసీదు పవిత్రతకు భంగం కలిగించిందని పాకిస్తాన్‌ కోర్టు ఆమెకు అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. వివరాల ప్రకారం..'హిందీ మీడియం' స్టార్ సబా ఖమర్‌ లాహోర్‌లోని ఓ పురాతన మసీదులో పాకిస్తానీ సింగర్‌ బిలాల్‌ సయూద్‌తో కలిసి ఓ డ్యాన్స్‌ వీడియోలో నటించింది. ఇది ప్రజల ఆగ్రహానికి కారణమైంది.

మసీదు పవిత్రతకు భంగం కలిగించారంటూ వీరిద్దరిపై పాకిస్తాన్ శిక్షాస్మృతిలోని సెక్షన్ 295 కింద లాహోర్ పోలీసులు గతేడాది ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.  దీనికి సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపినా వారిద్దరూ  ఏవో కారణాలు చెప్పి తప్పించుకొని తిరిగూ వచ్చారు. తాజాగా కేసును విచారించిన లాహోర్‌ మెజిస్టీరియల్ కోర్టు సభాతో పాటు బిలాల్‌కు బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ను జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 6కు వాయిదా వేసింది.

కాగా ఈ డ్యాన్స్‌ వీడియో విషయమై సోషల్‌ మీడియాలో చంపేస్తామనే బెదిరింపులు రావడంతో ఆ వీడియో విషయమై వారిద్దరూ క్షమాపణలు తెలిపారు. నటి సభా మాట్లాడుతూ.. ఆ వీడియోలో కేవలం పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు చిత్రికరించినట్లు తెలిపింది. కాగా హిందీ మీడియం వంటి పలు బాలీవుడ్‌ మూవీస్‌లో నటించిన ఆమె నటనకు మంచి స్పందన వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement