ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ వెల్లడి
జెరూసలెం: అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుంచి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, హమాస్ అగ్రనేతలపై అరెస్టు వారెంట్లు కోరనున్నట్లు చీఫ్ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ సోమవారం వెల్లడించారు. గాజా, ఇజ్రాయెల్‌లో యుద్ధ నేరాలు, మానవాళిపై అకృత్యాలకు గాను నెతన్యాహు, ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్, హమాస్ నేతలు యోహియా సిన్వర్, మహ్మద్ దీఫ్, ఇస్మాయిల్ హనియేహ్‌లు బాధ్యులని ఆయన అన్నారు.
ముగ్గురు జడ్జిల ప్యానెల్ అరెస్టు వారెంట్లు, కేసు కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనుంది. సాధారణంగా ఇలాంటి వాటిల్లో నిర్ణయానికి జడ్జిలు రెండు నెలల సమయం తీసుకుంటారు. వారెంట్లు జారీ అయినా నెతన్యాహు, గాలంట్‌లకు వచ్చే ఇబ్బందేమీ లేదు. కానీ నెతన్యాహు, గాలంట్‌లు విదేశీ పర్యటనలకు వెళ్లడం కష్టమవుతుంది. వారెంట్లు కోరడాన్ని యూదు వ్యతిరేక చర్యగా నెతన్యాహు అభివర్ణించారు.
Comments
Please login to add a commentAdd a comment