
సాక్షి, హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పబ్లిసిటీ పిచ్చి పట్టుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కోర్టు నోటీసులను కూడా చంద్రబాబు పబ్లిసిటీకి వాడుకుంటున్నారని తెలిపారు. రాయలసీమలో దుర్భిక్షం ఉంటే.. చంద్రబాబు మాత్రం శ్రీశైలంకు వచ్చి జలసిరి హారతి అంటూ కట్టుకథలు చెబుతున్నారని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ధర్నాలు చేసిన మంత్రి దేవినేని ఉమా నేడు సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. సొంత జిల్లా చిత్తూరుతో పాటు రాష్ట్రంలోని ఏ జిల్లా రైతులతోనైనా రైతు బాంధవుడని అనిపించుకునే ధైర్యం ఉందా అని చంద్రబాబుకు సవాలు విసిరారు.
సినిమా నటులతో ఆపరేషన్ గరుడ అని కట్టుకథలు చెప్పించి జనాలను నమ్మించాలని చూస్తున్నారని తెలిపారు. అది ఆపరేషన్ గరుడ కాదని.. ఆపరేషన్ పెరుగు, వడ, అప్పడం అని అన్నారు. కోర్టు నోటీసులు వస్తే ఇంత భయం ఎందుకని ప్రశ్నించారు. 22 సార్లు నోటీసులిస్తే కోర్టుకు హాజరవ్వకుండా ఇప్పుడు హడావిడి చేస్తున్నారని పేర్కొన్నారు. మహారాష్ట్ర గవర్నమెంట్ కేసు పెడితే.. ఆ ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక మంత్రి భార్యను టీటీడీ బోర్డు నుంచి ఎందుకు సస్పెండ్ చేయడం లేదని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment