శిల్పాశెట్టి, ఆమె సోదరి షమిత శెట్టిలకు కోర్టు నోటీసులు | Mumbai Andheri Court Send Notice To Shilpa Shetty And Sister Shamita Shetty | Sakshi
Sakshi News home page

Shilpa Shetty: మరో వివాదంలో శిల్పాశెట్టి, సోదరి షమిత, తల్లి సునంద శెట్టి

Published Sun, Feb 13 2022 8:19 PM | Last Updated on Sun, Feb 13 2022 8:19 PM

Mumbai Andheri Court Send Notice To Shilpa Shetty And Sister Shamita Shetty - Sakshi

బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టిని వివాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే భర్త రాజ్‌కుంద్రా అశ్లీల వీడియో కేసుతో ఆమె కఠిన పరిస్థితులను చూస్తున్న తరుణంలో కోర్టు కేసులు, చీటింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో తాజాగా శిల్పా శెట్టికి కోర్టు సమన్లు జారీ చేసింది. తాజాగా శిల్పాశెట్టి, ఆమె తల్లి సునంద, సోదరి షమితా శెట్టికి కోర్టు నోటీసులు ఇచ్చింది. తీసుకున్న అప్పు చెల్లించలేదని ఆరోపిస్తూ ఓ ఆటోమొబైల్ ఏజెన్సీ యజమాని ముంబైలోని అంధేరీ కోర్టును ఆశ్రయించాడు. దీంతో అతడి ఫిర్యాదు మేరకు ఈ నెల 28న కోర్టులో హాజరు కావాలంటూ శిల్పాశెట్టితో పాటు ఆమె సోదరి షమితాశెట్టి, తల్లి సునందశెట్టిని కోర్టు ఆదేశించింది.

చదవండి: నేను ఆ టైప్‌ కాదు, నటినని నా బాయ్‌ఫ్రెండ్‌ వదిలేశాడు: హీరోయిన్‌

కేసు వివరాల్లోకి వెళితే.. శిల్పాశెట్టి తండ్రి సురేంద్ర శెట్టి ఓ ఆటోమొబైల్ ఏజెన్సీ యజమాని నుంచి 2015లో రూ.21 లక్షల రుణం తీసుకున్నారు.  రుణం తిరిగి 2017 జనవరి నాటికి చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నారు. అయితే, సురేంద్ర శెట్టి 2016, అక్టోబర్‌ 11న మృతి చెందారు. ఈ విషయం శిల్పాశెట్టితో పాటు ఆమె తల్లికి తెలుసని, అయినా డబ్బు తిరిగి ఇచ్చేందుకు నిరాకరించారని ముంబైకి చెందిన వ్యాపారవేత్త పర్హద్‌ అమ్రా ఆరోపించారు. ఈ మేరకు గత శుక్రవారం జుహూ పోలీస్‌ స్టేషన్‌లో శిల్పా కుటుంబంపై ఫిర్యాదు చేయగా.. శిల్పాశెట్టితో పాటు ఆమె సోదరి షమితాశెట్టి, తల్లిపై కేసు నమోదు చేశారు. దీంతో ఈ నెల 28న కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ అయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement