‘రబ్తా’ చిత్ర నిర్మాతకు నోటీసులు జారీ | hyderabad civil court notice to raabta movie producer | Sakshi
Sakshi News home page

‘రబ్తా’ చిత్ర నిర్మాతకు నోటీసులు జారీ

Published Thu, May 25 2017 4:46 PM | Last Updated on Tue, Sep 5 2017 11:59 AM

hyderabad civil court notice to raabta movie producer

హైదరాబాద్‌ : హిందీ చిత్రం ’రబ్తా’  నిర్మాతకు కోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది. మగధీర చిత్రాన్ని కాపీ కొట్టారంటూ ఆ చిత్ర నిర్మాత అల్లు అరవింద్‌ నిన్న హైదరాబాద్‌లోని సిటీ సివిల్‌ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. రాబ్తా విడుదలను నిలిపివేయాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు. దీనిపై  జూన్‌ 1లోగా రబ్తా నిర్మాత సమాధానం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది.

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్, కృతి సనన్‌ (‘వన్‌ నేనొక్కడినే’ ఫేమ్‌) జంటగా నటించిన రాబ్తా చిత్రం వచ్చే నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రబ్తా సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ అవగానే ‘మగధీర’కు, దీనికి ఏదో కనెక్షన్‌ ఉన్నట్టుంది!’’ అంటూ సోషల్‌ మీడియాలో సెటైర్స్‌ పేలాయి. ‘రాబ్తా’ ట్రైలర్‌లో, స్టిల్స్‌లో ‘మగధీర’ ఛాయలు కనిపిస్తున్నాయనే కామెంట్స్‌ వినిపించాయి కూడా.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement