ట్రైలర్ చూసే కాపీ అంటారా..? : రబ్తా టీం | The makers of Raabta have rubbished plagiarism allegation | Sakshi
Sakshi News home page

ట్రైలర్ చూసే కాపీ అంటారా..? : రబ్తా టీం

Published Fri, May 26 2017 10:33 AM | Last Updated on Tue, Sep 5 2017 12:03 PM

ట్రైలర్ చూసే కాపీ అంటారా..? : రబ్తా టీం

ట్రైలర్ చూసే కాపీ అంటారా..? : రబ్తా టీం

త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న బాలీవుడ్ మూవీ రబ్లా యూనిట్, కాపీ సినిమా అంటూ వస్తున్న ఆరోపణలపై స్పందించింది. రామ్ చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీర సినిమాకు రబ్లా కాపీ అంటూ నిర్మాత అల్లు అరవింద్ కోర్టును ఆశ్రయించడంతో వివాదం ముదిరింది. కేవలం 2 నిమిషాల 14 సెకన్ల ట్రైలర్ చూసి సినిమా కాపీ అంటూ ఎలా నిర్ణయిస్తారని రబ్లా యూనిట్ ఫైర్ అయ్యింది.

ఎలాంటి ఆదారాలు లేకుండా కాపీ అని ప్రచారం చేయటం క్రియేటివిటీని అవమానించటమే అన్నారు రబ్తా టీం. చాలా సినిమాల్లోని సన్నివేశాలు ఇతర చిత్రాల నుంచి స్ఫూర్తిని పొంది రూపొందిస్తున్నారని అంత మాత్రానికే కాపీ అంటూ ఆరోపణలు చేయటం తగదంటున్నారు. అల్లు అరవింద్ తమ సినిమాపై కోర్టును ఆశ్రయించినందుకు బదులుగా రబ్తా చిత్ర నిర్మాతలు ప్రతికా ప్రకటన ద్వారా తమ సమాధానం ఇచ్చారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement