కంటెంట్ ఈజ్ కింగ్.. ఇప్పుడు ఇండియన్ చిత్ర పరిశ్రమలో వినిపిస్తున్న మాట ఇది. ఒకప్పుడు హీరోహీరోయిన్లను చూసి ప్రేక్షకులు సినిమా థియేటర్‌కి వెళ్లేవారు..కానీ ఇప్పుడు కథను నమ్మి వెళ్తున్నారు. కథ నచ్చితే హీరోహీరోయిన్లు ఎవరనేది పట్టించుకోకుండా సినిమాను హిట్ చేస్తున్నారు. స్త్రీ 2 చిత్రం ఆ కోవలోకి చెందినదే. బడా హీరోలెవరు ఈ చిత్రంలో లేరు. కానీ ఆ హీరోల సినిమాలకు మించిన కలెక్షన్స్‌ని రాబడుతోంది. కేవలం రూ.50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. రూ. 500 కోట్లకు పైగా వసూళ్లను సాధించి హిస్టరీ క్రియేట్ చేస్తోంది.
ఊహించని విజయం
శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన స్త్రీ 2 చిత్రం ఆగస్ట్ 15న విడుదలైంది. రిలీజ్‌కి ముందు వరకు ఈ సినిమాపై పెద్దగా అంచనాల్లేవు. ట్రైలర్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ..ఈ స్థాయి విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. తొలి రోజు ఈచిత్రానికి రూ. 51 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఓ చిన్న చిత్రానికి ఈ మధ్యకాలంలో ఈ స్థాయి ఓపెనింగ్స్ రాలేదు. రిలీజ్ రోజే హిట్ టాక్ రావడంతో సినిమా కలెక్షన్స్ అమాంతం పెరిగిపోయాయి. మూడో వారంలోనూ ఈ చిత్రం మంచి వసూళ్లను సాధించింది. మొత్తంగా ఇప్పటి వరకు రూ. 509 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది.
స్త్రీ 2 కథేంటంటే..
2018 లో రిలీజై భారీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన హారర్ థ్రిల్లర్ స్త్రీ చిత్రానికి సీక్వెల్ ఇది. పార్ట్ 1లో స్త్రీ పీడా విరిగిపోయిందని చండేరీ ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. అయితే అప్పుడే సర్ ఖటా అనే విచిత్రమైన దెయ్యం ఒకటి ఊర్లోని అమ్మాయిలను మాయం చేయడం ప్రారంభిస్తుంది. అలా ఓ సారి విక్కీ (రాజ్ కుమార్ రావు) స్నేహితుడి ప్రియురాలిని సర్ ఖటా మాయం చేస్తుంది. దీంతో నలుగురు స్నేహితులు(రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపర్ శక్తి ఖురానా) కలిసి స్త్రీ(శ్రద్ధా కపూర్) సహాయం కోరతారు. విచిత్రమైన దెయ్యం సర్ ఖటా నుంచి చండేరీ ప్రజలను ‘స్త్రీ’ గ్యాంగ్ ఎలా రక్షించింది అనేది ఈ సినిమా స్టోరీ.
#Stree2 is rock-steady at the #BO, firmly holding its ground on a working day [third Mon]... Mass circuits - particularly non-national chains + single screens at Tier-2 and Tier-3 centres - are driving its biz... Expected to enjoy a smooth, uninterrupted run right till #Dussehra.… pic.twitter.com/AdUGp3v4Ff
— taran adarsh (@taran_adarsh) September 3, 2024
Comments
Please login to add a commentAdd a comment