
ఈ ఏడాది పఠాన్, జవాన్ లాంటి వెయ్యి కోట్ల సినిమాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ ఫుల్లు దూకుడు మీదుంది. వీటి మధ్య లో వచ్చిన గదర్ 2 కూడా 500 కోట్లకు పైగానే రాబట్టింది.ఇక కోలీవుడ్ కూడా ముందు జైలర్ తో,ఇప్పుడు లియోతో రెండు సార్లు 500 కోట్ల వసూళ్లను చూసింది. కానీ టాలీవుడ్ మాత్రం ఈ ఏడాదిలో ఇంకా ఈ స్థాయిలో విజయాలను చూడలేదు. సంక్రాంతికి రిలీజైన వాల్తేరు వీరయ్య మూవీ ఒకటే 225 కోట్లు రాబ్టటింది.ఇప్పటికీ టాలీవుడ్స్ ఇయర్స్ బిగ్గెస్ట్ హిట్ గా కొనసాగుతోంది. ఇక ప్రభాస్ నటించిన ఆదిపురుష్ 400 కోట్లకు పైగా రాబట్టినా,ఆది బాలీవుడ్ ఖాతాలోకే వెళ్లిపోయింది.
(చదవండి: హీరోయిన్‌తో రహస్యంగా లవ్..? సిగ్గుపడిపోయిన యంగ్ హీరో!)
ఆశలన్నీ సలార్‌పైనే
డిసెంబర్‌లో రిలీజ్ కాబోతున్న సలార్ మూవీపై టాలీవుడ్ కూడా భారీ అంచనాలు పెట్టుకుంది. ఈ చిత్రం కచ్చితంగా రూ. 1000 కోట్లు వసూలు చేస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకు కారణాలు కూడా చెబుతున్నారు. ఈ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజీయఫ్ 2తో ఇప్పటికే రూ.1200కోట్ల వసూళ్లను చూశాడు. అలాగే ప్రభాస్ ఫ్లాప్ సినిమాకు కూడా రూ. 400 కోట్ల వరకు కలెక్షన్స్ వస్తున్నాయి. ఒకవేళ హిట్ పడితే మాత్రం రూ.1000 కోట్ల కలెక్షన్స్ ఓ లెక్కనే కాదు.
(చదవండి: ‘మార్టిన్ లూథర్ కింగ్’ మూవీ రివ్యూ )
భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్
సలార్ చిత్రానికి భారీగా ప్రీరిలీజ్ బిజినెస్ అయినట్లు తెలుస్తోంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ.175 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. అదే నిజమైతే మాత్రం టాలీవుడ్ నుంచే ఈ చిత్రం రూ. 300 కోట్ల వరకు రాబట్టాల్సి ఉంఉటంది. ఒక తెలుగు రాష్ట్రాల నుంచే రూ.300 కోట్లు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఆ లెక్కలు ఈజీగా రూ. 1000 కోట్లు దాటుతాయి. మరి ఈ సినిమా ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో డిసెంబర్ 22 తర్వాత తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment