దుమ్ము రేపుతున్న చిన్న మూవీ.. అప్పుడే సెంచరీ క్లబ్‌లోకి.. | Munjya Box Office Collection: Comedy Horror Film Crosses Rs 100 Crore | Sakshi
Sakshi News home page

పెద్ద సినిమాలను వెనక్కి నెట్టి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన చిన్న సినిమా

Published Mon, Jun 24 2024 4:27 PM | Last Updated on Mon, Jun 24 2024 5:33 PM

Munjya Movie Crosses Rs 100 Cr

చిన్న సినిమా  బాక్సాఫీస్‌ దగ్గర అదరగొడుతోంది. బాలీవుడ్‌ బడా సినిమాల పోటీని తట్టుకుని నిలబడింది. హారర్‌ సినిమా ముంజా తాజాగా వంద కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్‌ అధికారిక పోస్టర్‌ ద్వారా వెల్లడించింది. ఆదిత్య సపోట్‌దర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మోనా సింగ్‌, అభయ్‌ వర్మ, శార్వరి వాగ్‌ ప్రధాన పాత్రలు పోషించారు.

జూన్‌ 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ ఈ మూవీకి ఓటేస్తున్నారు. అలా ఈ చిత్రం 17 రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. అయితే ఈ వసూళ్ల దూకుడికి గురువారం (జూన్‌ 27) అడ్డుకట్ట పడే అవకాశముంది. 

ఆ రోజు ప్రభాస్‌ కల్కి 2898 ఏడీ సినిమా రిలీజవుతుండటంతో ముంజా రేసులో వెనకబడే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ముంజా.. మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి, చందు ఛాంపియన్‌ వంటి భారీ చిత్రాలను వెనక్కు నెట్టి సెంచరీ సాధించడం గొప్ప విషయమనే చెప్పాలి!

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement