
నాగచైతన్య(Naga Chaitanya), సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’(Thandel). చందు మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదలైంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించిందని చిత్రబృందం ప్రకటించింది. ‘‘ఈ సినిమా కోసం నాగచైతన్య కంప్లీట్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు.
విడుదలైన తొలి రోజే ఆన్‌లైన్‌లో పైరసీ వెర్షన్ రిలీజ్ కావడం, ఫిబ్రవరి వంటి ఆఫ్–సీజన్ రిలీజ్ కావడం వంటి అవాంతరాలను దాటుకుని కూడా ‘తండేల్’ మూవీ రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. ఓవర్‌సీస్‌లోనూ వన్ మిలియన్ మార్క్‌ను చేరుకుంది. గీతా ఆర్ట్స్‌లో వన్నాఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలవడం సంతోషంగా ఉంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఇక నాగచైతన్య కెరీర్‌లో రూ. వంద కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించిన తొలి చిత్రంగా ‘తండేల్’ నిలిచింది.