నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’ ట్రైలర్ విడుదలకు వేళయింది. ఈ నెల 28న ఈ మూవీ ట్రైలర్‌ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, నాగచైనత్య కొత్త లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. ‘లవ్ స్టోరీ’ (2021) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి జోడీగా నటిస్తున్న చిత్రం ‘తండేల్’. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది.
‘‘వాస్తవ ఘటనల స్ఫూర్తితో రూపొందిన చిత్రం ‘తండేల్’. లవ్ ఎలిమెంట్స్‌తోపాటు మంచి యాక్షన్ కూడా ఉంటుంది. తండేల్ రాజుపాత్రలో నాగచైతన్య అద్భుతమైన నటన చూస్తారు.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘బుజ్జి తల్లి, శివ శక్తి, హైలెస్సో హైలెస్సా...’పాటలు మ్యూజిక్ చార్టులలో అగ్రస్థానంలో, యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమేరా: శ్యామ్‌దత్..
Comments
Please login to add a commentAdd a comment