
మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి వందకు పైగా సినిమాల్లో నటించాడు. దేశవిదేశాలు తిరుగుతూ స్టేజీ షోలు చేస్తూ నటీనటులను, రాజకీయ నాయకుల గొంతును ఇమిటేట్ చేస్తూ ప్రజలను ఎంటర్‌టైన్ చేసేవాడు. ఎంతో గొప్ప టాలెంట్ ఉన్న శివారెడ్డి ఈ మధ్య పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. కానీ ఒకానొక సమయంలో అటు సినిమాలతో ఇటు స్టేజీ షోలతో రెండు చేతులా సంపాదిస్తూ సుమారు రూ.70 లక్షల దాకా కూడబెట్టాడీ కమెడియన్. సంవత్సరాల తరబడి కష్టపడి సంపాదించిన ఈ డబ్బుతో హైదరాబాద్‌లో ఒక ఇల్లు లేదా భూమి.. ఏదైనా ఒకటి కొనాలని ఎన్నో కలలు కన్నాడు. కానీ అతడి కలలను చిన్నాభిన్నం చేస్తూ శివారెడ్డి ఫ్రెండ్ ఆ డబ్బు తీసుకుని ఉన్నదంతా వాడేశాడు. ఈ విషయాన్ని కమెడియన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
'ఫ్రెండ్స్ అంటే నాకు పిచ్చి. వాళ్లకోసం ఏదైనా చేస్తాను. హైదరాబాద్ వచ్చాక ఇక్కడ కూడా కొందరు ఫ్రెండ్స్ అయ్యారు. అందులో ఒక ఫ్రెండ్, అతడి కుటుంబం నన్ను మోసం చేశారు. నేను కూడబెట్టిన డబ్బుతో మొట్టమొదటిసారిగా ఏదైనా ఇల్లు లేదా కొన్ని ఎకరాల భూమి కొనుక్కుందామని సిటీలో తిరిగాను. అప్పుడు ఏ ఇల్లు చూసినా, ల్యాండ్ చూసినా ఇది బాలేదులే, వద్దులే అంటూ నన్ను మభ్యపెట్టాడో ఫ్రెండ్. ఇలా మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్న సమయంలో అమెరికాలో నాకు ప్రోగ్రాం ఆఫర్ వచ్చింది. ఒక నెలన్నర వరకు అక్కడే ఉండాల్సిన పరిస్థితి. అప్పటికి నేను బ్యాచ్‌లర్‌ను కావడంతో నా డబ్బును తీసుకుని వాళ్లింట్లో పెట్టుకున్నారు. తీరా నేను వెళ్లిపోయాక వాళ్ల అవసరాల కోసం ఉన్నదంతా వాడుకున్నారు. ఈ విషయం తెలియక నేను అమెరికా నుంచి రాగానే మళ్లీ ఇళ్లు చూడటం మొదలుపెట్టాను. డబ్బులు తీసుకుని వస్తే అక్కడికక్కడే డీల్ మాట్లాడుకోవచ్చని చెప్పి నా బ్యాగ్ తీసుకురమ్మన్నాను. అప్పుడు అతడు చిన్న సమస్య రావడంతో నీ డబ్బు వాడేసుకున్నామని అసలు విషయం బయటపెట్టాడు. ఐదారు రోజుల్లో తిరిగి ఇచ్చేస్తామన్నారు, కానీ ఈరోజు వరకు కూడా ఇవ్వలేదు. ఆ డబ్బులుండుంటే మణికొండలో నాకు రెండుమూడు ఎకరాలైనా ఉండేవి' అని చెప్తూ బాధపడ్డాడు శివారెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment