
సాక్షి, మణికొండ: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును సినీ నటుడు శివారెడ్డి సత్కరించారు. ఆదివారం ఆమె నివాసానికి వెళ్లి వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించటం గర్వకారణమని అభినందించారు. రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలను సాధించాలని ఆకాంక్షించారు. ఆమె పతకం సాధించిన సందర్భంలోని ఫొటోను సింధుకు బహూకరించానని, తన కామెడీ ఎంతో బాగుంటుందని సింధుతో పాటు ఆమె కుటుంబ సభ్యులు తనను అభినందించారని శివారెడ్డి పేర్కొన్నారు.
కాగా టోక్యో-2020 ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్ విభాగంలో తెలుగుతేజం పీవీ సింధు కాంస్య పతకం సాధించి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన సంగతి తెలిసిందే.
2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన అనంతరం ఇప్పుడు మూడో స్థానంతో మరో పతకాన్ని సొంతం చేసుకొని వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ ఈ ఘట్టాన్ని ఆవిష్కరించిన రెండో భారత ప్లేయర్‌గా, తొలి మహిళగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment