
సమావేశంలో మాట్లాడుతున్న శివారెడ్డి ప్యానల్‌కు సంబంధించిన అధ్యక్షుడు బి.శివారెడ్డి
ప్రొద్దుటూరు కల్చరల్ : పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ప్రొద్దుటూరు తాలూకా పెన్షనర్స్ అసోసియేషన్ కార్యదర్శి బి.శివారెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఎన్జీఓ హోంలో మంగళవారం శివారెడ్డి ప్యానల్ తరఫున మెంబర్స్ ఎంపిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిటైర్డు ఉద్యోగులకు రుణాలు, లైఫ్ సర్టిఫికెట్, ఇన్‌కం ట్యాక్స్ సమస్యలను పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. తమ ప్యానల్‌ను గెలిపిస్తే ప్రతి ఏడాది వైద్య శిబిరం, పెన్షనర్లు చనిపోతే వారికి రావాల్సిన మొత్తం, బకాయిలను వెంటనే ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు.
అనంతరం పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయానికి కటాంజనాన్ని విరాళంగా ఇచ్చిన రిటైర్డు ఎంపీడీఓ నరసింహులు, పుట్టిన రోజు సందర్భంగా విశ్రాంత పీఈటీ రామాంజులరెడ్డిను సన్మానించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డు ఉద్యోగులు ప్రసాదరెడ్డి, వీరాస్వామి, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివారెడ్డి ప్యానల్‌కు సంబంధించి అధ్యక్షునిగా బి.శివారెడ్డి, కార్యదర్శిగా రామాంజులరెడ్డిను ఎన్నుకున్నారు.