Priyanka Chopra Reveals About Her Experience On Being Body Shamed In Bollywood - Sakshi
Sakshi News home page

Priyanka Chopra: నన్ను నల్లపిల్లితో పోల్చేవారు.. బాడీ షేమింగ్‌పై ప్రియాంక చోప్రా

Published Wed, Dec 7 2022 6:50 PM | Last Updated on Wed, Dec 7 2022 7:34 PM

Priyanka Chopra opens up on being body shamed in Bollywood - Sakshi

బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్ నటీమణుల్లో ఆమెది ప్రత్యేక స్థానం. పెళ్లి తర్వాత భర్తతో కలిసి లాస్‌ ఏంజెల్స్‌లో సెటిలైంది బాలీవుడ్ భామ. ఇటీవలే ఆమె దాదాపు మూడేళ్ల విరామం తర్వాత భారత్‌కు వచ్చారు. అయితే తాజాగా ఆమె కెరీర్‌లో జరిగిన కీలక సంఘటనలను మీడియాతో పంచుకున్నారు. కెరీర్‌ ప్రారంభంలో బాడీ షేమింగ్‌కు గురైనట్లు నటి వెల్లడించారు.

ఆమెను డస్కీ అని పిలిచేవారని వాపోయారు. తొలి రోజుల్లో సహ నటుల కోసం సెట్‌లో గంటల తరబడి వేచి ఉండేదాన్ని అని ప్రియాంక చోప్రా చెప్పింది. 'డస్కీ' అంటే ఏమిటో నాకు తెలియదు? నేను తగినంత అందంగా లేనని అప్పుడు అనిపించిందని  తెలిపింది. అంతేకాకుండా ఆమెను నల్లపిల్లి అని వెటకారంగా పిలిచేవారని బాలీవుడ్ నటి ఆనాటి అనుభవాలను వివరించింది. 

(ఇది చదవండి: మూడేళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన ప్రియాంక చోప్రా)

నేను చాలా కష్టపడి పని చేయాల్సిన ఉంటుందని నమ్మకంతో ఉండేదానిని అని వెల్లడించింది. అయినప్పటికీ  తోటి నటుల కంటే కాస్త ఎక్కువ ప్రతిభావంతురాలిగా భావించానని తెలిపింది. అయితే సహనటులు పొందిన వేతనంలో 10 శాతం కూడా తాను పొందలేదని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో సహనటుడి కోసం వేచి ఉండటం సరైందేనని భావించినట్లు ఆమె పేర్కొంది. ప్రియాంక చోప్రా ఫ్యాషన్‌లో జాతీయ అవార్డును అందుకుంది. ఆమె బర్ఫీ, 7 ఖూన్ మాఫ్, మేరీ కోమ్,  బాజీరావ్ మస్తానీ వంటి చిత్రాలలో నటనకు అవార్డులు గెలుచుకున్నారు.

2000 సంవత్సరంలో మిస్ ఇండియాగా నిలిచిన ప్రియాంక ఆ తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆమె 2002లో సన్నీ డియోల్‌తో ది హీరోతో అరంగేట్రం చేసింది. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన ప్రియాంక ‘బేవాచ్‌’తో 2017లో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అదే సమయంలో వయసులో తనకంటే పదేళ్లు చిన్నవాడైన ప్రముఖ పాప్‌ సింగర్‌ నిక్‌ జొనాస్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల డేటింగ్‌ అనంతరం 2018లో ఈ జంట పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు.  ప్రియాంక ప్రస్తుతం సిటాడెల్‌లో కనిపించనుంది. బాలీవుడ్‌లో, ఆమె ఫర్హాన్ అక్తర్‌ మూవీ  జీ లే జరాలో అలియా భట్,  కత్రినా కైఫ్‌తో కలిసి నటించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement