'కామెంట్లపై వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్' | Actress Zarine Khan Powerful Post on Bodyshaming in her Instagram | Sakshi
Sakshi News home page

'కామెంట్లపై వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్'

Published Tue, Apr 5 2016 10:38 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

'కామెంట్లపై వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్' - Sakshi

'కామెంట్లపై వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్'

ముంబై: ఇకపై ఎవరైనా తనపై కామెంట్స్ చేసేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని విమర్శకులను హెచ్చరించింది బాలీవుడ్ హీరోయిన్ జరైన్ ఖాన్. తన బాధను వెల్లడించేందుకు ఇన్ స్టాగ్రామ్ ను మార్గంగా ఎంచుకుంది. తన స్కూలు డేస్, కాలేజీ రోజులలో ఎలా ఉండేదో తెలిపేందుకు ఫొటోలను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'నా శరీరం నా ఇష్టం. నేను ఎలా ఉండాలో చెప్పేందుకు మీరేవరు. ఎవరి సమస్యలు వారికి ఉంటాయి' అని ఆగ్రహం వ్యక్తం చేసింది. గత కొంతకాలం నుంచి ఆమె శరీరాకృతి గురించి చాలా రకాల విమర్శలొస్తున్నాయి. ఆమె బాడీ బికినీకి ఒప్పేలా ఉందడని, ఆమె చాలా లావుగా ఉంటుందని అందుకే అవకాశాలు ఇవ్వాలంటే దర్శకనిర్మాతలు బెదురుతారంటూ వచ్చిన కామెంట్లపై తీవ్ర స్థాయిలో మండిపడింది.

2010లో సల్మాన్ ఖాన్ సరసన 'వీర్' మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హౌస్ ఫుల్, హేట్ స్టోరీ 3 మూవీలలో నటించింది. బాలీవుడ్ లో జీరో సైజ్ భామలకే గిరాకీ ఎక్కువని, కానీ జరైన్ ఈ ఇండస్ట్రీకి సెట్ అవ్వదంటూ విమర్శల నేపథ్యంలోనూ కొన్నిసార్లు అవకాశాలు కోల్పోయింది. 'ఇప్పటికే చాలా కేజీలు తగ్గాను. అయినా సన్నబడాలని, మెరుపుతీగలా తయారవ్వాలంటే నా వల్ల కాదు. ఒకసారి నా ఫొటోలు చూస్తే మీకే అర్థమవుతోంది. వైట్ డ్రెస్ 9వ తరగతి, పింక్ డ్రెస్ ఇంటర్ చదువుతున్నప్పుడు దిగిన ఫొటోలు. అప్పటికి, ఇప్పటికీ నన్ను నేను ఎలా మలుచుకున్నానో ఆ బాధలు నాకు తెలుసు. ఇక ఎవరి వ్యాఖ్యలు నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు' అని బొద్దుగుమ్మ తీవ్రంగా విరుచుకుపడింది. చాలా మంది హీరోయిన్లు లావుగా ఉన్నప్పటికీ ఆమెను లక్ష్యంగా చేసుకుని కామెంట్లు రావడంతో మనస్తాపానికి లోనై ఈ విధంగా జరైన్ ఖాన్ తన బాధను వెల్లగక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement