Priyamani Reacts On Her Divorce Rumours With Mustafa Raj, Deets Inside - Sakshi
Sakshi News home page

Priyamani Divorce Rumours: అందుకే ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్నావంటూ ట్రోల్‌ చేశారు

Published Thu, Jun 29 2023 2:49 PM | Last Updated on Thu, Jun 29 2023 3:05 PM

Priyamani Response On Her Divorce Rumours - Sakshi

కథానాయకిగా నటి ప్రియమణికి మంచి పేరు ఉంది. బెంగళూరుకు చెందిన ఈ బ్యూటీ కన్నడ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటించి పాపులర్‌ అయ్యారు. ముఖ్యంగా తమిళంలో పరుత్తివీరన చిత్రంలో నటనకుగాను జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. అదేవిధంగా తెలుగులో నాగార్జున, జూనియర్‌ ఎన్టీఆర్, జగపతిబాబు వంటి స్టార్‌ హీరోల సరసన నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ మధ్య నటించిన ఫ్యామిలీమెన్‌ వెబ్‌సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.

అయితే వివాహానంతరం నటనకు చిన్న గ్యాప్‌ ఇచ్చి మళ్లీ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా రీఎంట్రీ అయ్యారు. ప్రియమణి ముస్తఫారాజా అనే వ్యాపారవేత్తను 2017లో ప్రేమవివాహం చేసుకున్నారు. బెంగళూరులో రిజిస్టర్‌ పెళ్లి జరిగింది. ప్రస్తుతం సినిమాలో, టీవీ కార్యక్రమాలతో బిజీగా వున్న ప్రియమణి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను వివాహానంతరం పలు విమర్శలను ఎదుర్కొన్నానని చెప్పారు.

ముఖ్యంగా పెళ్లి విషయంలో పలువురు విమర్శించారని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి కోసం మతం మారారా, ముస్లిం వ్యక్తిని ఎందుకు పెళ్లిచేసుకున్నారు? మీది లవ్‌ జీహాద్‌ అని, మీ పిల్లలు జీహాదీయులుగా పుడతారా అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధించే వారన్నారు. అలాంటి వారందరికీ తాను చెప్పేది ఒకటేనన్నారు. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తప్పా? అని ప్రశ్నించారు. కొంచెం బుద్ధితో ఆలోచించాలని హితవు పలికారు. ఇకపోతే తాను, తన భర్త చాలా సంతోషంగా ఉన్నామంటూ విడాకులపై స్పష్టత ఇచ్చారు. కరోనా సమయంలో తాను బరువు తగ్గినా విమర్శిస్తున్నారని, అంతకుముందు లావుగా ఉన్న విమర్శించే వారని అందుకే తాను అలాంటి వాటిని పట్టించుకోవడం మానేసానని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement