Supermodel
-
ఆ ట్రీట్మెంట్ నా జీవితాన్నే నాశనం చేసింది: ప్రఖ్యాత మోడల్
లిండా ఎవాంజెలిస్టా దశాబ్దాలుగా ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన పేరు సంపాదించిన సూపర్ మోడల్. 80, 90లలో లిండా నవోమి కాంప్‌బెల్, కేట్ మోస్ వంటి ప్రఖ్యాత మోడల్‌లతో పాటు ర్యాంప్ వ్యాక్లో పాల్గొంది. దీంతో పాటు పలు ప్రఖ్యాత మ్యాగజైన్ కవర్లలో తన ఫోటోలు ప్రచురితమయ్యాయి. అంతటి పాపులర్ మోడల్ అయినప్పటికీ ఓ మోసపూరిత కాస్మెటిక్ ట్రీట్మెంట్ ఆమె జీవనోపాధిని నాశనం చేసిందని తాజాగా లిండా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. ఆ పోస్ట్‌లో.. ఐదు సంవత్సరాల క్రితం తాను చేసుకున్న కాస్మెటిక్ ట్రీట్మెంట్ వల్ల తాను శాశ్వతంగా వైకల్యం చెందినట్లు లిండా తెలిపింది. 56 ఏళ్ల ఈ మోడల్ ఓ సంస్థ సర్జరీ లేకండా ఫ్యాట్ కంటెంట్ తొలగిస్తామని నమ్మబలికి చివరికి ఆ వైద్యం దానికి విరుద్ధంగా జరిగిందని ఆరోపించింది. ఆ ట్రీట్మెంట్ సైడ్-ఎఫెక్ట్ తన జీవనాధారాన్ని పూర్తిగా నాశనం చేసిందని వివరిస్తూ.. ఇది నన్ను తీవ్ర నిరాశ, విచారం, నిరాశలోకి పంపిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియలో ఒంటరిగా మారిపోయానంటూ తన అవేదనను తెలిపింది. అయితే లిండా తనకు జరిగిన అన్యాయం పై చట్టపరంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఫ్యాషన్, వినోద ప్రపంచంలోని సభ్యుల నుంచి లిండాకు మద్దతు లభిస్తోంది. ఇప్పటికి ఈ విషయమై పలువురు ఫ్యాషన్ రంగంలో పలువురు ప్రముఖులు ఆమెకు మద్దతు తెలుపుతూ సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. లిండా ఎవాంజెలిస్టా మోడలింగ్ కెరీర్ 1984లో ప్రారంభమైంది. చదవండి: నటి పుట్టినరోజు వేడుకల్లో అపశ్రుతి... కొంచెమైతే ఏమయ్యేదో.. -
ఫ్యాషన్ డిజైనర్ నుంచి ఫస్ట్ లేడీ
అయిదు అడుగుల 11 అంగుళాల ఎత్తు, పట్టుకుచ్చులా మెరిసిపోయే జుట్టు, చురుగ్గా చూసే కళ్లు.. అందానికి అందంలా ఉండే పుత్తడి బొమ్మ మెలానియా ట్రంప్. ఇప్పుడు అమెరికా ప్రథమ మహిళ. శ్వేత సౌధానికి మహారాణి. ఒకప్పుడు ఫ్యాషన్ డిజైనర్, ఆ తర్వాత సూపర్ మోడల్. మోడలింగ్ చేస్తూ అతి పెద్ద ప్రపంచాన్ని చూశారు. ఆరు భాషల్లో మాట్లాడగలరు. స్లొవేనియన్, ఫ్రెంచ్, సెర్బియన్, జర్మన్, ఇటాలియన్, ఇంగ్లిష్ బాగా వచ్చు. కానీ ఇంగ్లిష్ మాతృభాష కాకపోవడంతో తన యాక్సెంట్‌ని ఎక్కడ వెటకారం చేస్తారన్న బెరుకో, సహజంగానే మితభాషి అవడమో కానీ నలుగురులోకి వచ్చి మాట్లాడరు. ఆమె ప్రపంచం ఆమెదే. తను, తన కొడుకు బారన్లే ఆమెకు లోకం. కమ్యూనిస్టు దేశానికి చెందిన ఫస్ట్ లేడీ స్లొవేనియాలో చిన్న పట్టణంలో ఒక మధ్య తరగతి కుటుంబంలో 1970 ఏప్రిల్ 26న మెలానియా జన్మించారు. తండ్రి విక్టర్ న్వాస్ కారు డీలర్. తల్లి అమలిజా పిల్లల బట్టల్ని డిజైన్ చేసేవారు. అలా ఆమెకి పుట్టుకతోనే ఫ్యాషన్ డిజైనింగ్‌పై మక్కువ ఏర్పడింది. 16వయేటే మోడలింగ్ రంగంలోకి వచ్చారు. ఇటలీలోని మిలాన్‌లో ఒక యాడ్ ఏజెన్సీకి మోడల్‌గా పని చేశారు. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చదువుతూ యూనివర్సిటీ చదువు మధ్యలో ఆపేశారు. మోడలింగ్ మీదనే మొత్తం దృష్టి కేంద్రీకరించారు. 22 ఏళ్లు వచ్చాక మెలానియాకు కెరీర్లో బ్రేక్ వ చ్చింది. స్లొవేనియా మ్యాగజీన్ ‘జానా’లో ‘లుక్ ఆఫ్ ది ఇయర్’ పోటీలో రన్నరప్‌గా నిలిచారు. ఆ తర్వాత ఆమె వెనక్కి చూసుకోలేదు. తాను వేసుకొనే డ్రెస్‌లను తానే డిజైన్ చేసుకునేవారు. 2000 ఏడాదిలో బ్రిటన్‌కు చెందిన ‘జీక్యూ’ మ్యాగజీన్ ఫొటోలకు నగ్నంగా పోజులిచ్చారు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక ఆ చిత్రాలు బయటికొచ్చి సంచలనమయ్యాయి. ట్రంప్‌తో డేటింగ్, పెళ్లి 1998లో అమెరికాకు వచ్చిన మెలానియాకు ట్రంప్‌తో ఒక పార్టీలో పరిచయమైంది. అప్పటికే రెండో భార్యతో విడాకులు తీసుకోవడానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నారు. కొన్నేళ్లు ట్రంప్‌తో డేటింగ్ చేశారు. 2005లో ట్రంప్‌తో వివాహమైంది. 2006లో మెలానియాకు కొడుకు బారన్ పుట్టాడు. ట్రంప్ తెంపరితనం, అమ్మాయిలు, వ్యవహారాలు, బహిరంగంగానే వారి పట్ల అసభ్య ప్రవర్తన ఇవన్నీ మెలానియాకు నచ్చినట్టు లేవు. అందుకే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని మెలానియా మధ్యలోనే వదిలేశారు. ట్రంప్ అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లోకి మకాం మార్చినపుడూ ఆమె వెంట వెళ్లలేదు. నాడు న్యూయార్క్‌లో కొడుకు చదు వు కోసం ఉండిపోయారట. 2017లో కొడుకుతో కలసి వైట్‌హౌస్‌కు మారారు. వైట్‌హౌస్‌లో వారిద్దరి పడక గదులు వేర్వేరు అంతస్తుల్లో ఉండటం వంటి బెన్నెట్ రాసిన ఫ్రీ మెలానియా పుస్తకంలో బయటకొచ్చి సంచలనమయ్యాయి. -
ఆమె బికినీ యాడ్స్ పై స్వదేశంలోనే నిషేధం!
ఆమె ఎక్కడ వెళితే అక్కడ ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. యువకుల రక్తం ఉప్పొంగుతుంది. తన హాట్ హాట్ అందాలతో ఫ్యాషన్ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సూపర్ మోడల్ బార్ రెఫెయిలీ ఇప్పుడు సొంత దేశంలోనే చిక్కులు ఎదుర్కొంటున్నది. ఆమె తాజాగా ఓ బికినీ యాడ్ లో కనిపించింది.అయితే ఈ వాణిజ్య ప్రకటనలు మరీ సెక్సీగా ఉన్నాయంటూ ఇజ్రాయెల్ వీటిని తమ దేశ టీవీ చానెళ్లలో ప్రదర్శించకుండా నిషేధం విధించింది. ఫ్యాషన్ దుస్తుల బ్రాండ్ హుడీస్ తరఫున ఈ వాణిజ్య ప్రకటనలో రెండు బికినీల్లో కనిపించి ఈ భామ హాట్ హాట్ గా కనిపించింది. బార్ ఫర్ హుడీస్ పేరిట రూపొందిన ఈ యాడ్ కు ఇజ్రాయెల్ జాతీయ టెలివిజన్ అథారిటీ కత్తెరలు వేసింది. క్లోజ్ అప్ లో వెనుకవైపు నుంచి నగ్నంగా కనిపించే దృశ్యాన్ని తొలగిస్తేనే టీవీ చానెళ్లలో ప్రసారానికి అనుమతిస్తామని, లేదంటే రాత్రి 10 గంటల తర్వాతనే దీనిని ప్రసారం చేసుకోవాల్సి ఉంటుందని ఇజ్రాయెల్ తేల్చిచెప్పింది. 45 సెకండ్లు ఉన్న ఈ యాడ్ (బార్ ఫర్ హుడీస్) ప్రస్తుతం యుట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది.