ఆమె బికినీ యాడ్స్ పై స్వదేశంలోనే నిషేధం! | hot Bar Refaeli bikini ad has been banned for being too sexy | Sakshi
Sakshi News home page

ఆమె బికినీ యాడ్స్ పై స్వదేశంలోనే నిషేధం!

Published Sat, May 7 2016 9:50 AM | Last Updated on Sun, Sep 3 2017 11:37 PM

ఆమె బికినీ యాడ్స్ పై స్వదేశంలోనే నిషేధం!

ఆమె బికినీ యాడ్స్ పై స్వదేశంలోనే నిషేధం!

ఆమె ఎక్కడ వెళితే అక్కడ ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. యువకుల రక్తం ఉప్పొంగుతుంది. తన హాట్ హాట్ అందాలతో ఫ్యాషన్ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సూపర్ మోడల్ బార్ రెఫెయిలీ ఇప్పుడు సొంత దేశంలోనే చిక్కులు ఎదుర్కొంటున్నది. ఆమె తాజాగా ఓ బికినీ యాడ్ లో కనిపించింది.అయితే ఈ వాణిజ్య ప్రకటనలు మరీ సెక్సీగా ఉన్నాయంటూ ఇజ్రాయెల్ వీటిని తమ దేశ టీవీ చానెళ్లలో ప్రదర్శించకుండా నిషేధం విధించింది.

ఫ్యాషన్ దుస్తుల బ్రాండ్ హుడీస్ తరఫున ఈ వాణిజ్య ప్రకటనలో రెండు బికినీల్లో కనిపించి ఈ భామ హాట్ హాట్ గా కనిపించింది. బార్ ఫర్ హుడీస్ పేరిట రూపొందిన ఈ యాడ్ కు ఇజ్రాయెల్ జాతీయ టెలివిజన్ అథారిటీ కత్తెరలు వేసింది. క్లోజ్ అప్ లో వెనుకవైపు నుంచి నగ్నంగా కనిపించే దృశ్యాన్ని తొలగిస్తేనే టీవీ చానెళ్లలో ప్రసారానికి అనుమతిస్తామని, లేదంటే రాత్రి 10 గంటల తర్వాతనే దీనిని ప్రసారం చేసుకోవాల్సి ఉంటుందని ఇజ్రాయెల్ తేల్చిచెప్పింది. 45 సెకండ్లు ఉన్న  ఈ యాడ్ (బార్ ఫర్ హుడీస్) ప్రస్తుతం యుట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement