Aaradhya Birthday:ఆరాధ్య పదో బర్త్‌డే.. మాల్దీవుల్లో బచ్చన్‌ ఫ్యామిలీ చిల్లింగ్‌ | Aaradhya Birthday Celebrating In Maldives | Sakshi
Sakshi News home page

Aaradhya Birthday:ఆరాధ్య పదో బర్త్‌డే.. మాల్దీవుల్లో బచ్చన్‌ ఫ్యామిలీ చిల్లింగ్‌

Nov 14 2021 6:52 PM | Updated on Nov 15 2021 3:16 PM

Aaradhya Birthday Celebrating In Maldives - Sakshi

బాలీవుడ్‌ కపుల్‌ అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్య రాయ్‌ కుమార్తె ఆరాధ్య ముగ్గురు మాల్దీవుల్లో చిల్‌ అవుతున్నారు. నవంబర్‌ 13న ఈ ముగ్గురు ముంబై విమానాశ్రయంలో కెమెరాలకు చిక్కారు. అభిషేక్‌, ఐశ్వర్య నుదిటిపై తిలకంతో క్యాజువల్స్‌ వేర్స్‌లో కనిపించారు. బచ్చన్ వంశం కుటుంబ సెలవుల కోసం మాల్దీవులకు వెళ్లినట్లు తెలిసిందే. ఈ దంపతుల కుమార్తె ఆరాధ్య నవంబర్‌ 16న 10 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. అయితే కూతురు బర్త్‌డేను మాల్దీవుల్లో ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది.

ఐశ్వర్య రాయ్ మాల్దీవుల దీవుల‍్లో చిల్‌ అవుతున్న దృశ్యాన్ని ఇన్‌స్టా గ్రామ్‌లో పంచుకున్నారు. ఆ స్నాప్‌ను షేర్ చేసి, 'సన్ బ్రీజ్ అండ్ ప్యారడైజ్' అని క్యాప్షన్‌ ఇచ్చారు. అభిషేక్ కూడా దీవుల నుంచి ఒక చిత్రాన్ని షేర్‌ చేస్తూ 'మేల్కొల‍్పడానికి చెడు దృశ్యం కాదు' అంటూ రాసుకొచ్చారు. 

గత సంవత్సరం, 2020లో, ఐశ్వర్య సోషల్ మీడియాలో ఆరాధ్యతో ఉన్న ఒక అందమైన స్నాప్‌ను షేర్‌ చేశారు. అందులో, " నా జీవితపు సంపూర్ణ ప్రేమ, నా ప్రియమైన దేవదూత ఆరాధ్యా.. నేను నిన్ను ఎప్పటికీ, నిత్యం, అనంతంగా ప్రేమిస్తాను. నేను తీసుకుంటున్న ప్రతి శ్వాస నీకోసమే అయినందుకు దేవుడికి కృతజ్ఞతలు. గాడ్‌ బ్లెస్‌ యూ లవ్‌' అంటూ 9వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆరాధ్య నవంబర్ 16, 2011లో జన్మించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement