అమ్మ అంత అందంగా... | Aaradhya Bachchan's airport outing with mom Aishwarya rai | Sakshi
Sakshi News home page

అమ్మ అంత అందంగా...

Published Mon, Nov 25 2013 11:11 PM | Last Updated on Sat, Sep 2 2017 12:58 AM

అమ్మ అంత అందంగా...

అమ్మ అంత అందంగా...

 ‘ఆ భగవంతుడు మాకిచ్చిన వరం మా కూతురు ఆరాధ్య’ అని ఓ సందర్భంలో ఐశ్వర్యరాయ్ ఎంతో మురిపెంగా చెప్పారు. ఈ నెల 16న ఆరాధ్య పుట్టినరోజు వేడుకను సన్నిహితుల మధ్య ఘనంగా జరిపారు అభిషేక్, ఐశ్వర్య. పాపకు రెండేళ్లు పూర్తయ్యాయి కాబట్టి.. ఇక నటిగా ఐష్ రీ-ఎంట్రీకి సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఐష్ కూడా ఆ సన్నాహాల్లోనే ఉన్నారట. మరోవైపు ఇటీవల తన తల్లిదండ్రులు వృందారాయ్, కృష్ణరాజ్, సోదరుడు ఆదిత్య, అతని భార్యతో కలిసి కూతుర్ని తీసుకుని ఐష్ దుబాయ్ వెళ్లారట.
 
‘హ్యాపీ న్యూ ఇయర్’ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్న అభిషేక్‌బచ్చన్ మాత్రం ఈ ట్రిప్‌ని మిస్ అయ్యారు. పుట్టింటివాళ్లతో హాయిగా గడిపి ఐష్ ముంబయ్ వచ్చారు. మామూలుగా ఈ అందాల సుందరి పబ్లిక్‌లోకి వస్తే.. కొన్ని కెమెరాలు ఆమెను వెంటాడతాయి. పైగా, కూతుర్ని తీసుకొని బయటకు వచ్చారంటే, ఈ తల్లీకూతుళ్లను కెమెరాలో బంధించడానికి ఫొటోగ్రాఫర్లు తాపత్రయపడతారు. ఈ క్రమంలో ఇటీవల దుబాయ్ ట్రిప్ ముగించుకుని ఐష్ ముంబయ్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వస్తున్న సమయంలో కొంతమంది ఫొటోలు తీశారు. ఆ ఫొటోల్లో క్యూట్‌గా ఉన్న రెండేళ్ల ఆరాధ్యని చూస్తే.. అచ్చం అమ్మలా మంచి అందగత్తె అవుతుందని అందరూ అనుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement