
కూతురు ఆరాధ్యతో ఐశ్వర్యరాయ్ (ఫైల్ ఫోటో)
సాక్షి, ముంబై : బయటి ప్రపంచానికి తానొక టాప్ హీరోయిన్ అయినా.. తన బిడ్డ దగ్గర ఒక సాధారణ తల్లి మాత్రమే.. వృత్తి విషయంలో ఎంత బిజీగా ఉన్నా తన బిడ్డకు
కావాల్సిన ఆనందాలను ఎక్కడా దూరం చేయడంలేదు. అందరి అమ్మల్లాగే పార్కులకు, షాపింగ్‌లకు, స్కూల్‌కు తీసుకెళుతున్నారు. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యరాయ్.
తాజాగా ఓ ప్రముఖ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్య్వూలో తన కూతురు ఆరాధ్య గురించి చెబుతూ తెగ సంబరపడిపోయారు ఐశ్వర్య. ఆరాధ్య ఇంకా చిన్న పిల్లేనని, తన పని ఒత్తిడి ఆరాధ్యపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నానని తెలిపారు. ప్రస్తుతం షూటింగ్లు తగ్గించుకొని కూతురితోనే ఎక్కువగా సమయం గడిపేందుకు ఇష్టపడతానని చెప్పారు. ఆరాధ్యపై ఎక్కువగా మీడియా ఫోకస్ పడకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రస్తుతం రాకేశ్ ఓంప్రకాశ్ దర్శకత్వంలో ‘ఫ్యానీ ఖాన్’ సినిమాలో నటిస్తున్న ఐష్, రోహన్ సిప్పీ దర్శకత్వంలో ఓ బోల్డ్ థ్రిల్లర్ చేసేందుకు అంగీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment