ఆరాధ్యకు రెండేళ్లు.. ఘనంగా పుట్టినరోజు వేడుకలు | Aaradhya Bachchan turns two years | Sakshi
Sakshi News home page

ఆరాధ్యకు రెండేళ్లు.. ఘనంగా పుట్టినరోజు వేడుకలు

Published Mon, Nov 18 2013 4:23 PM | Last Updated on Sat, Sep 2 2017 12:44 AM

ఆరాధ్యకు రెండేళ్లు.. ఘనంగా పుట్టినరోజు వేడుకలు

ఆరాధ్యకు రెండేళ్లు.. ఘనంగా పుట్టినరోజు వేడుకలు

బాలీవుడ్ బుజ్జాయి ఆరాధ్యకు రెండేళ్లు నిండాయి. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ బచ్చన్ల ముద్దుల కుమార్తె, అమితాబ్ బచ్చన్ మనవరాలు అయిన ఆరాధ్య పుట్టినప్పుడు ప్రపంచవ్యాప్తంగా అదో పెద్ద సంచలనాత్మక వార్త అయ్యింది. ఈనెల 16వతేదీ శనివారం నాడు ఆ బుల్లి ఆరాధ్య రెండో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ రోజు ఆరాధ్యకు అభినందనలు అందించినందుకు, బహుమతులు పంపినందుకు అందరికీ కృతజ్ఞతలు చెబుతూ అభిషేక్ బచ్చన్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.

శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాల కుమారుడు.. ఆరాధ్య స్నేహితుడు అయిన వియాన్ రాజ్ కుంద్రాను కూడా ఈ పుట్టిన రోజు వేడుకలకు ఆహ్వానించారు. ''హేపీ బర్త్డే ఆరాధ్యా.. నన్ను పిలిచినందుకు థాంక్యూ. చాలా సరదాగా అనిపించింది. నేను మొట్టమొదటి చాక్లెట్ కూడా ఈరోజు తినేశాను. ష్.... అమ్మకు చెప్పద్దు'' అని వియాన్ రాజ్ కుంద్రా అన్నట్లుగా అతడి తరఫున తల్లిదండ్రులు ట్వీట్ చేశారు. ఆరాధ్య తొలిసారిగా కాన్స్ చిత్రోత్సవంలో తన తల్లితో పాటు కలిసి ఈ సంవత్సరం పాల్గొన్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement