Aaradhya Bachan's Cute Walk Video Goes Viral - Sakshi
Sakshi News home page

Aaradhya Bachchan Walking Video Viral: చుట్కీ నడక చూడండి.. 'సెలబ్రిటీ కిడ్‌' వీడియో వైరల్‌

Nov 24 2021 2:57 PM | Updated on Nov 24 2021 3:48 PM

Aaradhya Bachchan Walking Video Viral - Sakshi

సినీ సెలబ్రిటీలు ఏం చేసిన నెటిజన్స్‌ ఓ కంట కనిపెడుతూ ఉంటారు. వారు ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఏం తింటున్నారు? అంటూ వెతుకుతారు. వారిని ఎంకరేజ్‌ చేయడానికి అన్నట్లుగా సోషల్‌ మీడియా ఎలాగు ఉంది. సామాజిక మాధ్యమాల్లో సెలబ్రిటీల ప్రవర్తన, విధానం, వేషధారణ కొంచెం భిన్నంగా కనిపించిన తమదైనా రీతిలో ఆడేసుకుంటున్నారు. సెలబ్రిటీలే కాకుండా వారి పిల్లలపై కూడా ఇలాగే స్పందిస్తారు నెటిజన్లు. తాజాగా బాలీవుడ్‌ దివా ఐశ్వర్య రాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌ కుమార్తె ఆరాధ్య నడకపై నెటిజన్స్‌ తమదైన శైలిలో ట్రోలింగ్‌ చేస్తున్నారు. 

ఇటీవల అభిషేక్‌, ఐశ్వర్య బచ్చన్‌ దంపతుల కుమార్తె ఆరాధ్య 10వ పుట్టినరోజును మాల్దీవుల్లో సెలబ్రేట్‌ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఐశ్వర్య రాయ్‌ బచ‍్చన్‌ తన కూతురుతో కలిసి ముంబైకి తరిగివచ్చారు. వారు తిరిగివచ్చిన తర్వాత కొన్ని రోజులకు తన తల్లితో కలిసి నడుస్తున్న చిన్నారి ఆరాధ్య వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. అంతే, నెటిజన్ల దృష్టి చిన్నారి నడకపై పడ్డాయి. ఆరాధ్య క్యాట్‌ వాక్‌పై ఓ నెటిజన్‌ 'చుట్కీ నడక చూడండి' అని నవ్వుతున్న ఎమోజీస్‌ పెట్టింది. 'ఆమె నడకకు ఏమైంది??' అని మరొకరు కామెంట్ పెట్టారు. 


ఇదిలా  ఉంటే మరోవైపు, 'తనకు 10 ఏళ్లు మాత్రమే. కొంచెం దయచూపండి' అని ఒక యూజర్‌ స్పందించారు. 'ఆమెను ఎగతాళి చేయడంతో మనం ఎంత దిగజారిపోయామో తెలుస్తోంది' అని ఇంకొకరు ఆరాధ్యవైపు నిలబడ్డారు. 


చదవండి: ఆరాధ్య పదో బర్త్‌డే.. మాల్దీవుల్లో బచ్చన్‌ ఫ్యామిలీ చిల్లింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement