Aishwarya daughter
-
చుట్కీ నడక చూడండి.. 'సెలబ్రిటీ కిడ్' వీడియో వైరల్
సినీ సెలబ్రిటీలు ఏం చేసిన నెటిజన్స్ ఓ కంట కనిపెడుతూ ఉంటారు. వారు ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఏం తింటున్నారు? అంటూ వెతుకుతారు. వారిని ఎంకరేజ్ చేయడానికి అన్నట్లుగా సోషల్ మీడియా ఎలాగు ఉంది. సామాజిక మాధ్యమాల్లో సెలబ్రిటీల ప్రవర్తన, విధానం, వేషధారణ కొంచెం భిన్నంగా కనిపించిన తమదైనా రీతిలో ఆడేసుకుంటున్నారు. సెలబ్రిటీలే కాకుండా వారి పిల్లలపై కూడా ఇలాగే స్పందిస్తారు నెటిజన్లు. తాజాగా బాలీవుడ్ దివా ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ కుమార్తె ఆరాధ్య నడకపై నెటిజన్స్ తమదైన శైలిలో ట్రోలింగ్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) ఇటీవల అభిషేక్, ఐశ్వర్య బచ్చన్ దంపతుల కుమార్తె ఆరాధ్య 10వ పుట్టినరోజును మాల్దీవుల్లో సెలబ్రేట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన కూతురుతో కలిసి ముంబైకి తరిగివచ్చారు. వారు తిరిగివచ్చిన తర్వాత కొన్ని రోజులకు తన తల్లితో కలిసి నడుస్తున్న చిన్నారి ఆరాధ్య వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. అంతే, నెటిజన్ల దృష్టి చిన్నారి నడకపై పడ్డాయి. ఆరాధ్య క్యాట్ వాక్‌పై ఓ నెటిజన్ 'చుట్కీ నడక చూడండి' అని నవ్వుతున్న ఎమోజీస్ పెట్టింది. 'ఆమె నడకకు ఏమైంది??' అని మరొకరు కామెంట్ పెట్టారు. ఇదిలా ఉంటే మరోవైపు, 'తనకు 10 ఏళ్లు మాత్రమే. కొంచెం దయచూపండి' అని ఒక యూజర్ స్పందించారు. 'ఆమెను ఎగతాళి చేయడంతో మనం ఎంత దిగజారిపోయామో తెలుస్తోంది' అని ఇంకొకరు ఆరాధ్యవైపు నిలబడ్డారు. చదవండి: ఆరాధ్య పదో బర్త్‌డే.. మాల్దీవుల్లో బచ్చన్ ఫ్యామిలీ చిల్లింగ్ -
ఐష్ కుమార్తె మరో హీరోను తండ్రి అనుకుని..
బాలీవుడ్ అందాలతార ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్ల ముద్దుల తనయ ఆరాధ్య.. షూటింగ్ సెట్లో పొరపాటు పడిందట. మరో హీరో రణవీర్ కపూర్‌ను తన తండ్రి అభిషేక్‌గా భావించిన ఆరాధ్య అతని దగ్గరకు వెళ్లి కౌగిలించుకుంది. ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య ఈ విషయాన్ని చెప్పింది. ఐశ్వర్య, రణవీర్ జంటగా ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌కు ఐశ్వర్య తన కూతురును తీసుకెళ్లింది. సెట్లో కూర్చున్న రణవీర్‌ను చూసిన ఆరాధ్య తన తండ్రి అనుకుని అతని దగ్గరకు వెళ్లింది. అభిషేక్ తరచూ క్యాప్ పెట్టుకుని జాకెట్ వేసుకుంటాడు. ఆ రోజు రణవీర్ కూడా అచ్చం అభిషేక్ మాదిరిగా క్యాప్ పెట్టుకుని, జాకెట్ ధరించాడు. దీంతో ఆరాధ్య పొరపాటు పడిందని, రణవీర్‌ను అభిషేక్‌లా భావించిందని ఐశ్వర్య చెప్పింది. ఆరాధ్యకు రణవీర్ అంటే ఇష్టమని, అతనితో ఎక్కువసేపు గడిపేదని తెలిపింది. కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ఏ దిల్ హై ముష్కిల్ కష్టాల్లో పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పాకిస్థాన్ నటుడు నటించినందున విడుదల చేయబోమని థియేటర్ల యజమానులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో నాలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదలపై అనిశ్చిత ఏర్పడింది. కరణ్ జోహార్ ఇటీవల కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్‌ను కలసి సాయం కోరాడు. అంతకుముందు ప్రెస్‌మీట్ పెట్టి వివరణ ఇచ్చాడు. ఈ సినిమాలో రణవీర్, ఐశ్వర్య హాట్ హాట్ సన్నివేశాల్లో నటించారు. విడుదల చేసిన ఈ సినిమా స్టిల్స్‌లో ఐష్ హాట్‌గా కనిపించింది.