ending
-
ప్రపంచంలో చిట్టచివరి గ్రామం ఏదో తెలుసా!
ప్రపంచంలో చిట్టచివరి గ్రామం ఏదో తెలుసా? అది ఎక్కడుందో తెలుసా? గ్రీన్ ల్యాండ్ వాయవ్య ప్రాంతంలోని నుసువాక్ ద్వీపకల్పానికి ఉత్తరతీరంలో ఉందీ గ్రామం. దాని పేరు నియాకోర్నాట్. ఇక్కడ సముద్రం.. కొండలా గడ్డ కడుతుంది. నెలల తరబడి చీకటి చుట్టుముడుతుంది. పెద్ద పెద్ద మంచుపెళ్లలు కనుచూపుమేరలో నీటమునుగుతుంటాయి. ఇక్కడ భయంకరమైన ఉష్ణోగ్రతలు ఒకసారి, తట్టుకోలేనంత చలిగాలులు ఒకసారి వణికిస్తాయి. ఎటు చూసినా తరగని ప్రకృతి అందాలు ఆకట్టుకుంటాయి. ఈ గ్రామానికి ఏకైక ఆదాయమార్గం చేపల కర్మాగారం. అది మూతబడిన తర్వాత చాలామంది జీవనాధారం కోసం మకాం మార్చేశారు. నిజానికి ఇలాంటి ప్రమాదకరమైన ప్రదేశాల్లో 50 కంటే తక్కువ జనాభా ఉంటే బలవంతంగా గ్రామవాసులను పరిసర పట్టణాల్లోకి తరలించడం సర్వసాధారణం. అయితే 2011లో 52 మంది జనాభాతో ఈ గ్రామం ఉనికి నిలుపుకోగలిగింది. కానీ 2020 జనాభా లెక్కల ప్రకారం గ్రామస్థుల సంఖ్య 34కి తగ్గిపోయింది. ప్రస్తుతం ఈ గ్రామం గురించి ఎలాంటి తాజా సమాచారం అందుబాటులో లేదు. అయితే ఇక్కడ ధ్రువపు ఎలుగుబంట్లు, పెద్దపెద్ద తిమింగలాలు తరచుగా కనిపిస్తూ ఉంటాయని ‘సారా గావ్రొన్’ అనే దర్శకురాలు 2013లో తీసిన ‘విలేజ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్’ అనే డాక్యుమెంటరీలో వివరించారు. (చదవండి: పాములు కాటేసే ముందు హెచ్చరిస్తాయా? ఆ ఒక్క పాము మినహా..) -
కెనడాలో చోరీ, అఫ్రికాలో ప్రత్యక్ష్యం.. ఈ కార్లు ఎలా వస్తున్నాయబ్బా?
కెనడాలో చోరీ అయిన వాహనాలు చివరికి ఆఫ్రికాలో ప్రత్యక్షం అవుతున్నాయి. కెనడాలో చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు ఈ సమస్యను పట్టించుకోకపోవడమే దీనికి కారణమని ఆఫ్రికా దేశాల్లోని అధికారులు ఆరోపిస్తున్నారు. సీబీసీ మీడియా ఇటీవల జరిపిన పరిశోధనలో పశ్చిమ ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన ప్రాంతమైన ఘనాలో డజన్ల కొద్దీ చోరీకి గురయిన వాహనాలు అంటారియో, క్యూబెక్ లైసెన్స్ ప్లేట్లతో కనిపించాయి. ఈ వాహనాలలోని కొన్నింటికి కెనడియన్ రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయి. కొనుగోలుదారులు మార్కెట్ ధరకు దగ్గరగా వీటికి ధరను చెల్లిస్లున్నారని తేలింది. సోషల్ మీడియాతో సహా వివిధ ఆన్లైన్ ఛానళ్ల ద్వారా ఈ కార్ల విక్రయాలకు సంబంధించిన ప్రకటలు వెలువడుతున్నాయి. కెనడాలో 2022లో పెరిగిన కార్ల చోరీలు ‘తాము చోరీ అయిన వాహనాల విషయంలో ప్రపంచ దాతగా మారామని కెనడియన్ ఫైనాన్సింగ్ అండ్ లీజింగ్ అసోసియేషన్ ప్రతినిధి మైఖేల్ రోత్ సీబీసీకి చెప్పారు. కాగా బీమా పరిశ్రమ గ్రూప్ ఈక్విటీ అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం కెనడాలో వాహనాల దొంగతనాలు 2022లో పెరిగాయి. క్యూబెక్, అంటారియోలో దాదాపు 50 శాతం మేరకు కార్ల చోరీలు పెరిగాయి. అట్లాంటిక్ కెనడాలో కార్ల చోరీ 34 శాతానికిపైగా పెరిగింది. దీనివెనుక మాంట్రియల్‌లోని వ్యవస్థీకృత నేరగాళ్లు కారణమనే ఆరోపణలున్నాయి. చోరీ అయిన వాహనాలు మాంట్రియల్ పోర్ట్ నుంచి విదేశాలలోని గమ్యస్థానాలకు తరలిపోతున్నాయి. గ్రేటర్ టొరంటో ఏరియాలో వరుస చోరీలు ఈ సంవత్సరం ప్రారంభంలో పీల్ ప్రాంతీయ పోలీసులు కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ సంయుక్తంగా పోర్ట్ ఆఫ్ మాంట్రియల్ అండ్ ఎక్విట్ అసోసియేషన్ సహాయంతో 10 మిలియన్ డాలర్లకు మించి విలువచేసే వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గ్రేటర్ టొరంటో ఏరియాలో వరుస దొంగతనాల నేపధ్యంలో ప్రాజెక్ట్ ఆర్ అండ్ ఆర్ పేరుతో విచారణ మొదలయ్యింది. ఈ వాహనాలను షిప్పింగ్ కంటైనర్లలోకి ఎక్కించి, ట్రక్కులు లేదా రైళ్ల ద్వారా మాంట్రియల్ పోర్ట్‌కు తరలిస్తున్నట్లు విచారణతో తేలింది. 300 శాతం మేరకు పెరిగిన వాహన చోరీలు నెల రోజుల క్రితం హాల్టన్ పోలీసులు చోరీకి గురయిన 35 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి ఆరు నిమిషాలకు ఒక వాహనం చోరీకి గురవుతుండటంతో రికవరీలు సమస్యగా పరిణమిస్తున్నాయి. గత జూన్‌లో కెనడియన్ ఫైనాన్స్ అండ్ లీజింగ్ అసోసియేషన్ అందించిన వచ్చిన ఒక నివేదిక ప్రకారం టొరంటోలో 2015 నుండి 2022 వరకు వాహనాల దొంగతనాలు 300 శాతం మేరకు పెరిగాయి. ప్రతి సంవత్సరం ఈ సమస్య క్రమంగా పెరుగుతోంది. 2022లో ఒక్క టొరంటోలోనే 9,600 వాహనాలు చోరీ అయ్యాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి మరింత సమన్వయంతో జాతీయస్థాయిలో ప్రయత్నాలు జరగాలని నివేదిక పిలుపునిచ్చింది. వెహికల్ సేఫ్టీ రెగ్యులేషన్స్‌ను అప్డేట్ చేయాలి కెనడాలో వాహనాల దొంగతనాలు విపరీతంగా పెరుగుతున్నాయి. వ్యవస్థీకృత నేరాగాళ్లు చోరీ చేసిన వాహనాలతో తమ ఆదాయాన్ని పెంచుకోవడంలో మరింత ప్రవీణులుగా మారారు. దొంగతనాల నివారణకు తక్షణమే పబ్లిక్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లు నిర్వహించడం అవసరం అని సీఎఫ్ఎల్ఏ ప్రెసిడెంట్ మైఖేల్ రోతే అన్నారు. అలాగే ఈక్విట్ అసోసియేషన్ వంటి ఇతర సంస్థలు.. కెనడాలోని ఫెడరల్ మోటార్ వెహికల్ సేఫ్టీ రెగ్యులేషన్స్‌ను అప్డేట్ చేయాలని కెనగా ట్రాన్స్పోర్ట్ విభాగానికి పిలుపునిచ్చాయి. విచారణ కోసం ప్రాసిక్యూషన్ బృందాలు నేరస్తులు ఇప్పుడు పాత ప్రమాణాలను సద్వినియోగం చేసుకుంటున్నారని విచారణాధికారి బ్రయాన్ గాస్ట్ పేర్కొన్నారు. వారు వ్యవస్థలోని లోపాలను త్వరగా , సులభంగా ఉపయోగించుకుంటున్నారని, ఇది కెనడా అంతటా వాహనాల దొంగతనాల పెరుగుదలకు దారితీస్తున్నదన్నారు. అంటారియో ప్రభుత్వం వాహనాల దొంగతనాలను ఎదుర్కొనేందుకు రాబోయే మూడు సంవత్సరాల్లో 51 మిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. దీనిలో భాగంగా క్రిమినల్ సంస్థలపై దర్యాప్తు , విచారణ కోసం ప్రాసిక్యూషన్ బృందాలు ఏర్పాటు చేస్తామని తెలిపింది. చాలా తక్కువ మాత్రమే రికవరీ కెనడియన్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్‌కు చెందిన హువ్ విలియమ్స్ మాట్లాడుతూ కెనడాలో గృహాలు, డీలర్షిప్ షోరూమ్‌ల నుండి కార్లు చోరీకి గురవుతున్నాయని చెప్పారు. వీటిలో చాలా తక్కువ మాత్రమే రికవరీ అవుతున్నాయని తెలిపారు. యూఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ తమ పనిని సమర్థవంతంగా చేస్తోంది. కానీ కెనడాలో అలా జరడం లేదన్నారు. కాగా ఘనాకు చెందిన ఎకనామిక్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఆఫీస్ డిప్యూటీ డైరెక్టర్ అబ్దులై బషీరు దపిలా మాట్లాడుతూ వాహన దొంగతనాలకు సంబంధించి ఏ కెనడియన్ ఏజెన్సీ కూడా మమ్మల్ని నేరుగా సంప్రదించలేదని, నేరుగా అధికారిక ఫిర్యాదు చేయలేదని తెలిపారు. కార్లను వెదుక్కుంటున్న వాహనయజమానులు కొన్ని సందర్భాల్లో కెనడియన్లు చోరీకి గురయిన కారు కోసం తామే ప్రయత్నిస్తున్నారు. గత జూలైలో టొరంటోకు చెందిన ఒక వ్యక్తికి చెందిన రేంజ్ రోవర్ చోరీ జరిగాక అతను దానిని ట్రాక్ చేసి, మాంట్రియల్లో ఉందని, దానిని స్వాధీనం చేసుకునేందుకు అక్కడికి వెళ్లారు. 64 ఏళ్ల స్టీఫెన్ టౌబ్ రేడియో-ఫ్రీక్వెన్సీ ట్రాకింగ్ పరికరం సాయంతో తన కారు వాహనం టొరంటో తూర్పు చివరలో ఉందని తెలుసుకున్నారు. తరువాత పోర్ట్ ఆఫ్ మాంట్రియల్ వద్ద షిప్పింగ్ కంటైనర్‌లోకి చేరుకుందని తెలిపారు. ట్రాకింగ్ డివైజ్ ప్రొవైడర్ కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ కారు లొకేషన్‌ను షేర్ చేసిందని టౌబ్ కెనడియన్ ప్రెస్‌కు తెలిపారు. అయితే సిబ్బంది కొరత కారణంగా కంటైనర్‌ను తెరవడానికి నాలుగు నెలల సమయం పట్టవచ్చని, ఈలోపునే కంటైనర్‌ను రవాణా జరగవచ్చని టౌబ్ పేర్కొన్నాడు. ఈ నేపధ్యంలో టౌబ్ మాంట్రియల్‌లోని సంబంధింత కార్యాలయానికి వెళ్లి అక్కడి ఏజెన్సీని కలిశాడు. మరుసటి రోజు తన రేంజ్ రోవర్‌ను స్వాధీనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. తాను అక్కడికి వెళ్లకపోతే తన కారును తిరిగి పొందేవాడిని కాదని టౌబ్ మీడియాకు తెలిపారు. ఇది కూడా చదవండి: విటమిన్ టాబ్లెట్ అనుకుని ఎయిర్‌పాడ్ మింగేసింది.. తరువాత? -
ధోనికి జడేజాకు మధ్య విబేధాలు ఇంకా ప్రూఫ్స్ కావాలా ....!
-
రాహుల్ భారత్ జోడో యాత్ర విజయవంతమైనట్టేనా?
ఎస్.రాజమహేంద్రారెడ్డి: కాంగ్రెస్ పార్టీ గంపెడాశలు పెట్టుకున్న రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా సాగిన ఈ యాత్ర విజయవంతమైనట్టేనా? నూటా పాతికేళ్ల పై చిలుకు సుదీర్ఘ చరిత్రలోఎన్నడూ లేనంత నైరాశ్యంలో కూరుకుపోయి ఉన్న కాంగ్రెస్‌కు కాస్తయినా కొత్త ఊపిరులూదేనా...? వచ్చే ఎన్నికల్లో పార్టీకి ఆశించిన మేరకు ఓట్లను ‘జోడి’ంచేనా...? కాంగ్రెస్. గ్రాండ్ ఓల్డ్ పార్టీ. ఎంతో ఘనచరిత్ర ఉన్న పార్టీ. మహా మహా నాయకులెందరినో దేశానికి అందించిన పార్టీ. సుదీర్ఘకాలం పాటు దేశాన్ని ఏలిన జన సమ్మోహన పార్టీ. దేశాన్ని ఒక్కతాటిపై నడిపిన పార్టీ. కానీ కొన్నేళ్లుగా సొంత నేతలనే ఒక్కతాటిపై నడపలేక ఆపసోపాలు పడుతోంది. ఏదో చెయ్యాలి. మళ్లీ ఎలాగైనా పార్టీకి పునర్వైభవాన్ని తీసుకురావాలి. ఈ తపన, మథనం నుంచి పుట్టిన ‘భారత్ జోడో యాత్ర’ పార్టీని మళ్లీ పట్టాలెక్కిస్తుందా? లేదా లెక్క తప్పుతుందా? వేచి చూడాల్సిందే! దేశ ప్రజలను ఈ యాత్ర ద్వారా రాహుల్‌గాంధీ ఏ మేరకు ప్రభావితం చేయగలిగారన్నది కూడా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చే సీట్ల సంఖ్య ద్వారానే తేలుతుంది. చకచకా.. చలాకీగా... రాహుల్‌గాంధీ. కాంగ్రెస్‌కు చివరి ఆశాకిరణం. జోడో యాత్ర. రాహుల్‌గాంధీకి చివరి ఆశాకిరణం. ఈ యాత్రపై కాంగ్రెస్ గంపెడాశలు పెట్టుకుంది. అందుకు తగ్గట్టుగానే కన్యాకుమారిలో యాత్రను ప్రారంభించిన రాహుల్‌గాంధీ చలాకీగా నడుస్తూ, జనంతో మమేకమవుతూ చివరి మజిలీకి చేరుకున్నారు. భారత్ జోడో యాత్ర అనబడే 3,570 కిలోమీటర్ల రాహుల్ పాదయాత్ర జనవరి 30న జమ్మూ కశ్మీర్లో ముగుస్తుంది. దేశానికి ముగ్గురు ప్రధానులను ఇచ్చిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ రాజకీయ ప్రస్థానం మిగతా రాజకీయ నాయకులకు విభిన్నంగా ఉంటుంది. పట్టాభిషేకమే తరువాయి అనే యువరాజు హోదాలో రాజకీయాల్లోకి వచ్చిన ఆయనలో సహజసిద్ధమైన చొరవ, దూకుడు ఒకింత తక్కువేనని చెప్పుకోవాలి. రాజకీయాల్లోకి వచ్చాక కూడా చాలాకాలం పాటు అమ్మచాటు బిడ్డలానే కొనసాగడం, నాయకత్వం వహించాల్సిన అవసరం వచ్చినప్పుడల్లా వెనక్కు తగ్గడం ఆయన రాజకీయ శైలికి అద్దం పడుతుంది. ఇవాళ్టికీ కాంగ్రెస్‌కు అన్నీ ఆయనే. అయినప్పటికీ, ప్రతిపక్షాలకు మాత్రం ‘పప్పూ’గా మిగిలిపోయారు. ప్రతిపక్షాల అక్కసు ఎలా ఉన్నా, తనేమిటో నిరూపించుకోవడాదనికి జోడో యాత్ర రాహుల్‌కు మంచి అవకాశాన్నిచ్చింది. దాన్ని ఆయన హుందాగా సద్వినియోగం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. జనం నుంచి యాత్రకు మంచి స్పందనే వచ్చింది. చాలామంది ప్రముఖులు, మేధావులు రాహుల్‌తో కదం కలిపి సంఘీభావం తెలిపారు. ఆయన ఆత్మవిశ్వాసాన్ని ఓ మెట్టు పైకి లేపారు. అయితే కాంగ్రెస్ పునరుజ్జీవానికి ఈ యాత్ర ఒక్కటే దోహదపడుతుందా అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ ఆదరణ ఓటుగా మారుతుందా అన్నది మరో చిక్కు ప్రశ్న. వరుస ఓటములే నేపథ్యం... ప్రస్తుతం కేవలం మూడంటే మూడే రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి పుంజుకోవడం కష్టమే! మహా అయితే లోక్‌సభలో తమ సీట్ల సంఖ్యను కొద్దో గొప్పో పెంచుకోగలదు. అంతే. నిజానికి కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా అదే గొప్ప విజయంగా భావించవచ్చు. 2014 ఎన్నికల్లో కేవలం 44 సీట్లతో బొక్కబోర్లా పడ్డ కాంగ్రెస్ ఆ తర్వాత సంస్థాగత మార్పులపై కసరత్తు చేసి 2017లో యువరాజు రాహుల్‌గాంధీని అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టింది. అప్పటిదాకా అధ్యక్షురాలిగా కొనసాగిన తల్లి సోనియాగాంధీ నుంచి పార్టీ రాజదండం అందుకున్న రాహుల్ ఊహించినంతగా ప్రభావం చూపలేకపోయారు. ఆయనలో చొరవ, దూకుడు, సామాన్య కార్యకర్తలకు అందుబాటులో ఉండే కలుపుగోలుతనం లోపించాయనేది ఈ సమయంలోనే స్పష్టమైంది. పద్మవ్యూహంలాంటి రాజకీయ రణాంగణంలో మెతగ్గా, హుందాగా ఉంటే నడవదు. యుద్ధాన్ని ముందుండి నడిపించే సైన్యాధిపతిలా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థి ఊహకందని వ్యూహాలతో ముందుకురకాలి. ఆలోచిద్దాం, చేద్దాంలతో పని నడవదు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికలు రాహుల్‌గాంధీ పనితీరుకు అగ్నిపరీక్ష పెట్టాయి. కానీ ఈసారి కూడా కాంగ్రెస్ కేవలం 52 సీట్లతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా కుదేలైంది. అధ్యక్ష పదవి సోనియా నుంచి రాహుల్‌కు మారినా కాంగ్రెస్ పరిస్థితిలో ఎలాంటి మార్పూ రాలేదు. పరాజయానికి బాధ్యత వహిస్తూ రాహుల్ రాజీనామా చేసి కొన్నాళ్లపాటు నిస్తేజంగా ఉండిపోయారు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కాంగ్రెస్ పెద్దలంతా కూడా సుదీర్ఘ ఆలోచనల్లో మునిగిపోయారు. గత మేలో ఉదయ్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్ చింతన్ శిబిరంలో మేధోమథనం చేసి భారత్ జోడో యాత్రకు రూపకల్పన చేశారు. ఆదరణ ఓటుగా మారేనా? ‘జోడో యాత్ర’ ప్రస్తుతం జమ్మూ కశ్మీర్లో ఆగుతూ.. కదులుతూ... సాగుతోంది. వివాదాలకూ, వివాదాస్పద వ్యాఖ్యలకూ దూరంగా ఉంటూ, మనసులోని మాటను జనాలతో పంచుకుంటూ రాహుల్ యాత్రను కొనసాగిస్తున్నారు. సామాజిక సమస్యలు, మత సామరస్యం, ఆర్థిక అసమానతలు, రాజకీయ పెత్తందారీ పోకడల వంటి అంశాలే అజెండాగా ప్రజలతో మమేకమై చిట్టిపొట్టి విలేకరుల సమావేశాల్లో తన గళం వినిపిస్తూ వచ్చారు. ప్రధాన మీడియా చానళ్లు, పత్రికలకు సాధ్యమైనంత దూరంగా ఉన్నారు. యాత్ర సాగుతున్న తీరు, అభిమానుల ఆత్మీయ స్పర్శ, విలేకరుల సమావేశాలను తన హాండ్లర్ ద్వారా యూట్యూబ్‌లో అప్లోడ్ చేయడాన్ని యాత్ర తొలి రోజు నుంచి ఏనాడూ మిస్ కాలేదు. ప్రతిపక్షాలు రుద్దిన ‘పప్పూ’ ట్యాగ్ నుంచి బయట పడటానికి ఇది బాగా దోహదపడింది. యాత్ర మొదలైన సెప్టెంబర్ నుంచి ఇప్పటిదాకా ఈ యూట్యూబ్ చానల్‌కు లక్షల్లో కొత్త వీక్షకులు జతగూడారు. ప్రధాని మోదీ పనితీరు, బీజేపీ అధికార దర్పం పట్ల అసంతృప్తిగా ఉన్నవాళ్లను రాహుల్ తన కొత్త వ్యవహార శైలితో ఆకర్షించగలిగారు. గత జనవరితో పోలిస్తే ఆయనకు స్వల్పంగా జనాదరణ పెరిగిందని పలు చానళ్ల సర్వేలు చెబుతున్నాయి. అయితే ఈ ఆదరణ వచ్చే జనవరికి పెరుగుతుందో, తరుగుతుందో చూడాలి. ఈ యాత్ర కాంగ్రెస్‌లో కచ్చితంగా కొత్త ఆశలు రేపిందనడంలో సందేహం లేదు. అయితే ఇదొక్కటే చాలదు. అటు లోక్‌సభలోనూ, ఇటు ప్రజల్లోనూ నిర్మాణాత్మక విమర్శలు, చేతలతో ప్రజల విశ్వాసం చూరగొనడానికి కాంగ్రెస్ ప్రయత్నించాలి. సొంతింట్లోనే చిచ్చు రాజేసే క్యాంపు రాజకీయాలకు స్వస్తి పలకాలి. అధికారం లేనిచోట ఒక్కతాటిపై నిలిచే ప్రయత్నం చేయాలి. తాను మారిన మనిషినని ఈ పాదయాత్ర ద్వారా రాహుల్‌గాంధీ నిరూపించుకున్నట్టే యాత్ర ద్వారా చేకూరిన లబ్ధిని కాంగ్రెస్ సద్వినియోగం చేసుకోగలగాలి. లేదంటే రాహుల్ భారత్ జోడో యాత్ర ఓటు జోడో యాత్రగా మారకుండా సుదీర్ఘ ‘ఈవినింగ్ వాక్’గానే మిగిలిపోతుంది! -
రాత్రిబడికి రాంరాం
ఖమ్మంకల్చరల్ : గ్రామాల్లోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు కేంద్రప్రభుత్వం చేపట్టిన సాక్షరభారత్ పథకం (రాత్రి బడి)కి ఈనెల 31తో గడువు ముగుస్తుంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 1600 మంది సమన్వయకర్తలు పనిచేస్తున్నారు. పలు గ్రామాల్లో నిరక్షరాస్యులు రాత్రిబడికి రాకపోవడంతో కేంద్రాలను నెలల తరబడి తెరవని పరిస్థితి నెలకొంది. ఈనెల 31వ తేదీతో పథకం ముగియనుంది. ఇదే పేరుతో తిరిగి కొనసాగిస్తారా...? లేదా మూసివేస్తారా...? అనే అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. గ్రామ, మండల సమన్వయకర్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక భూమిక పోషిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 36 మండలాల్లో 631 గ్రామ పంచాయతీలు ఉండగా 36 మంది మండల సమన్వయకర్తలు, 1262 మంది గ్రామ సమన్వయకర్తలు పనిచేస్తున్నారు. ఖమ్మం జిల్లా పరిధిలో 427 గ్రామ పంచాయతీలు, భద్రాద్రి జిల్లాలో 204పంచాయతీలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో అక్షరాస్యులు 14,33,894 మంది, నిరక్షరాస్యులు 3,99,153 మంది, ఖమ్మం జిల్లాలో అక్షరాస్యులు 8,32,320, కొత్తగూడెం జిల్లాలో 6,01,574 మంది ఉన్నారు. ఇక నిరక్షరాస్యులు ఖమ్మంలో 2,19,108 మంది, కొత్తగూడెం జిల్లాలో 1,80,045 మంది ఉన్నారు. లక్ష్యం చేరకముందే ముగిసే.. ప్రతి వ్యక్తి తనకుతాను సంతకం చేయడం, పత్రికలు, పుస్తకాలు చదివేలా చేయాలన్నదే సాక్షరభారత్ లక్ష్యం. గ్రామాల్లో స్త్రీ, పురుషుల వివరాలు సేకరించాలి. వారిలో చదువురాని వారిని గుర్తించి కేంద్రాలకు తీసుకొచ్చేందుకు ప్రోత్సహించాలి. గ్రామీణ ప్రాంతాల్లో వంత శాతం అక్షరాస్యత సాధించాలి. ప్రతి గ్రామంలో సాక్షర భారత్ కేంద్రాల ద్వారా స్త్రీలకు చదువు నేర్పాలి. అభ్యాసకుడికి పుస్తకం, నోట్‌బుక్ ,పెన్సిల్ ఇవ్వాలి. అయితే..పూర్తిస్థాయిలో ఇది లక్ష్యం చేరలేదు. వేతనాలు, కేంద్రాల నిర్వహణ బాధ్యతలను సర్పంచ్‌లు చూడాలి. కానీ స్థానిక ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ కరువైంది. మూడు నెలలుగా వేతనాల్లేవ్.. ప్రతి గ్రామంలో ఇద్దరు గ్రామ సమన్వయకర్తలు ఉంటారు. ఒక్కొక్కరికీ రూ.రెండు వేలు, మండలానికి ఒక సమన్వయకర్త ఉండగా..రూ. 6 వేల చొప్పున వేతనాలు ఇవ్వాలి. మండల కోఆర్డినేటర్లకు టీఏ, డీఏలు నెలకు రూ. 500 అందిస్తారు. ఎంపీడీఓలు వీటిని మంజూరు చేస్తారు. అయితే గత మూడు నెలలు వీడి చెల్లింపులు నిలిచాయి. వేతనాలను అందజేయడంతో పాటు ఈ పథకం గడువు పెంచాలని వారు కోరుతున్నారు. పునరుద్ధరిస్తారనే నమ్మకముంది.. ఈనెల 31తో సాక్షరభారత్ గడువు ముగుస్తుంది. మరో సరికొత్త పేరు, ప్రణాళికతో ఈ పథకాన్ని కొనసాగిస్తారని భావిస్తున్నాం. ఇప్పుడు సాక్షరభారత్ కింద పనిచేస్తున్న సిబ్బందిని కొనసాగిస్తారా..? వేరే దేనికైనా బదాలయింపు చేస్తారా..? అనే విషయాలపై ఇంకా స్పష్టత లేదు. –ధనరాజ్, సాక్షరభారత్ డీడీ -
ముగిసిన బ్యాడ్మింటన్ పోటీలు
ఏఎన్‌యూ: యూనివర్సిటీ ఫార్మశీ కళాశాల ఆధ్వర్యంలో రెండు రోజులపాటు యూనివర్సిటీ స్థాయి అంతర్ కళాశాలల బ్యాడ్మింటన్ పురుషుల, మహిళలపోటీలు శనివారంతో ముగిశాయి. మహిళల విభాగంలో 12 జట్లు, బాలుర విభాగంలో 20 జట్లు పాల్గొన్నాయి. మహిళల విభాగంలో ఏఎన్‌యూ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ సైన్సెస్, ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల (గుంటూరు) జట్లు సంయుక్తంగా మొదటి స్థానం సాధించాయి. రెండో బహుమతిని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (ఏఎన్‌యూ), మూడో బహుమతిని ఎంఏఎం కాలేజ్ ఆఫ్ ఫార్మశీ సాధించాయి. పురుషుల విభాగంలో బీఏ అండ్ కేఆర్ (ఒంగోలు) జట్టు మొదటి బహుమతిని, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (ఏఎన్‌యూ) రెండో బహుమతి, ఎస్ఎస్అండ్ ఎన్కాలేజ్ (నరసరావుపేట) మూడో బహుమతిని కైవశం చేసుకున్నాయి. సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమానికి వీసీ ఆచార్య ఎ.రాజేంద్రప్రసా ద్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందించారు. ఏఎన్‌యూ పార్మశీ కళాశాల ప్రిన్సిపాల్ ఎ.ప్రమీలారాణి, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్స్పోర్ట్స్ అండ్ సైన్సెస్ కళాశాల ప్రిన్సిపాల్ జాన్సన్, ఏఎన్‌యూ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వై.కిషోర్, సాయ్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) ప్రతినిధి టీవ్, వెయిట్ లిఫ్టింగ్ అండ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ బడేటి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణమ్మా.. మళ్లీ వస్తాం..
-
పుష్కర వీడ్కోలు
-
కృష్ణా పుష్కరాలకు వీడ్కోలు
-
పుష్కర ముగింపున పుష్పాభిషేకం
– నేటి నుంచి దంపతుల రిజిస్ట్రేషన్ నమోదు – ఎస్ఎంఎస్ ద్వారా నమోదు చేసుకున్న వారికే అవకాశం – ఇప్పటి వరకు 5లక్షల మందికి పైగా పుష్కర స్నానాలు – జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ సాక్షి, కర్నూలు: పుష్కరాల ముగింపును పురస్కరించుకొని ఈనెల 23న స్వామి, అమ్మవార్లకు 10టన్నుల పూలతో అభిషేకం చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన శ్రీశైలంలోని మల్లికార్జున సదన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంతో ఈఓ నారాయణ భరత్‌గుప్తా, స్వామివార్ల ప్రధాన అర్చకులు మల్లికార్జునస్వామి, వేద పండితులు గంటి రాధాకష్ణ శర్మలతో కలిసి మాట్లాడారు. పుష్కరాల్లో భక్తిభావం ఉప్పొంగుతోందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 5లక్షలకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారన్నారు. ముగింపు రోజున నిర్వహించే పుష్పాభిషేకానికి 1,116 జంటలకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇందులో పాల్గొనాలనుకునే జంటలు 9985330026 నెంబర్‌కు ఎస్ఎంఎస్ ద్వారా పేరు, చిరునామా, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్లతో బుధవారం ఉదయం 10 నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ప్రాధాన్యత క్రమంలో అవకాశం కల్పిస్తామన్నారు. అదేవిధంగా ముగింపు రోజున స్వామి, అమ్మవార్లకు 20 నుంచి 30 మంది వేద పండితులతో పుష్పాభిషేకం చేపట్టిన అనంతరం.. సాయంప్రదాయ దుస్తుల్లోని 1,116 జంటలు కష్ణా జలాలతో సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తారన్నారు. ఆ తర్వాత జంటలకు స్వామి, అమ్మవార్ల శేషవస్త్రాలతో సన్మానించి లడ్డూ ప్రసాదాలను అందజేస్తామన్నారు. కార్యక్రమాన్ని రాష్ట్ర, దేశ ప్రజలు వీక్షించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.