ముగిసిన బ్యాడ్మింటన్ పోటీలు
ముగిసిన బ్యాడ్మింటన్ పోటీలు
Published Sun, Sep 11 2016 5:46 PM | Last Updated on Mon, Sep 4 2017 1:06 PM
ఏఎన్‌యూ: యూనివర్సిటీ ఫార్మశీ కళాశాల ఆధ్వర్యంలో రెండు రోజులపాటు యూనివర్సిటీ స్థాయి అంతర్ కళాశాలల బ్యాడ్మింటన్ పురుషుల, మహిళలపోటీలు శనివారంతో ముగిశాయి. మహిళల విభాగంలో 12 జట్లు, బాలుర విభాగంలో 20 జట్లు పాల్గొన్నాయి. మహిళల విభాగంలో ఏఎన్‌యూ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ సైన్సెస్, ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల (గుంటూరు) జట్లు సంయుక్తంగా మొదటి స్థానం సాధించాయి. రెండో బహుమతిని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (ఏఎన్‌యూ), మూడో బహుమతిని ఎంఏఎం కాలేజ్ ఆఫ్ ఫార్మశీ సాధించాయి. పురుషుల విభాగంలో బీఏ అండ్ కేఆర్ (ఒంగోలు) జట్టు మొదటి బహుమతిని, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (ఏఎన్‌యూ) రెండో బహుమతి, ఎస్‌ఎస్‌అండ్ ఎన్‌కాలేజ్ (నరసరావుపేట) మూడో బహుమతిని కైవశం చేసుకున్నాయి. సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమానికి వీసీ ఆచార్య ఎ.రాజేంద్రప్రసా ద్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందించారు. ఏఎన్‌యూ పార్మశీ కళాశాల ప్రిన్సిపాల్ ఎ.ప్రమీలారాణి, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్‌స్పోర్ట్స్ అండ్ సైన్సెస్ కళాశాల ప్రిన్సిపాల్ జాన్సన్, ఏఎన్‌యూ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వై.కిషోర్, సాయ్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) ప్రతినిధి టీవ్, వెయిట్ లిఫ్టింగ్ అండ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ బడేటి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement