ప్రపంచంలో చిట్టచివరి గ్రామం ఏదో తెలుసా? అది ఎక్కడుందో తెలుసా? గ్రీన్ ల్యాండ్ వాయవ్య ప్రాంతంలోని నుసువాక్ ద్వీపకల్పానికి ఉత్తరతీరంలో ఉందీ గ్రామం. దాని పేరు నియాకోర్నాట్. ఇక్కడ సముద్రం.. కొండలా గడ్డ కడుతుంది. నెలల తరబడి చీకటి చుట్టుముడుతుంది. పెద్ద పెద్ద మంచుపెళ్లలు కనుచూపుమేరలో నీటమునుగుతుంటాయి. ఇక్కడ భయంకరమైన ఉష్ణోగ్రతలు ఒకసారి, తట్టుకోలేనంత చలిగాలులు ఒకసారి వణికిస్తాయి.
ఎటు చూసినా తరగని ప్రకృతి అందాలు ఆకట్టుకుంటాయి. ఈ గ్రామానికి ఏకైక ఆదాయమార్గం చేపల కర్మాగారం. అది మూతబడిన తర్వాత చాలామంది జీవనాధారం కోసం మకాం మార్చేశారు. నిజానికి ఇలాంటి ప్రమాదకరమైన ప్రదేశాల్లో 50 కంటే తక్కువ జనాభా ఉంటే బలవంతంగా గ్రామవాసులను పరిసర పట్టణాల్లోకి తరలించడం సర్వసాధారణం. అయితే 2011లో 52 మంది జనాభాతో ఈ గ్రామం ఉనికి నిలుపుకోగలిగింది.
కానీ 2020 జనాభా లెక్కల ప్రకారం గ్రామస్థుల సంఖ్య 34కి తగ్గిపోయింది. ప్రస్తుతం ఈ గ్రామం గురించి ఎలాంటి తాజా సమాచారం అందుబాటులో లేదు. అయితే ఇక్కడ ధ్రువపు ఎలుగుబంట్లు, పెద్దపెద్ద తిమింగలాలు తరచుగా కనిపిస్తూ ఉంటాయని ‘సారా గావ్రొన్’ అనే దర్శకురాలు 2013లో తీసిన ‘విలేజ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్’ అనే డాక్యుమెంటరీలో వివరించారు.
(చదవండి: పాములు కాటేసే ముందు హెచ్చరిస్తాయా? ఆ ఒక్క పాము మినహా..)
Comments
Please login to add a commentAdd a comment