భారీగా పెరిగిన మోల్డ్‌టెక్‌ లాభం | Mold-Tek Pack Consolidated June 2021 Net Sales at Rs 133. 73 crore | Sakshi
Sakshi News home page

భారీగా పెరిగిన మోల్డ్‌టెక్‌ లాభం

Published Fri, Jul 30 2021 12:51 AM | Last Updated on Fri, Jul 30 2021 12:51 AM

Mold-Tek Pack Consolidated June 2021 Net Sales at Rs 133. 73 crore - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్లాస్టిక్‌ ప్యాకేజింగ్‌ సంస్థ మోల్డ్‌టెక్‌ ప్యాకేజింగ్‌ జూన్‌ త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే పదింతలకుపైగా ఎగసి రూ.18.5 కోట్లు నమోదు చేసింది. టర్నోవర్‌ రెండింతలకుపైగా అధికమై రూ.134 కోట్లు సాధించింది. ఎబిటా 176 శాతం పెరిగింది. ఉత్తరాది మార్కెట్‌ కోసం ఉత్తర ప్రదేశ్‌లో ప్లాంటు స్థాపించేందుకు కావాల్సిన స్థలాన్ని కొనుగోలు చేసినట్టు సంస్థ సీఎండీ లక్ష్మణ రావు వెల్లడించారు. అద్దె ప్రాతిపదికన కాన్పూర్‌లో తీసుకున్న ప్రాంగణంలో అక్టోబర్‌లో కార్యకలాపాలు మొదలవుతాయని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement