
ఆపరేషన్ ద్వారా ప్లాస్టిక్‌ను తొలగిస్తున్న వైద్యులు
సాక్షి, ఆదిలాబాద్(నిర్మల్): ప్లాస్టిక్ కవర్లు పశువులకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. యథేచ్ఛగా వినియోగిస్తూ.. ఎక్కడ పడితే అక్కడ పడేస్తుండడంతో ఆహారంగా భావించి తింటున్న పశువులు అనారోగ్యం బారిన పడుతున్నారు. మామడ మండలం కొరిటికల్ గ్రామంలో లింగన్నకు చెందిన గేదె ప్లాస్టిక్ తినడం వల్ల అనారోగ్యానికి గురైంది. మేత మేయకపోవడం, కడుపు ఉబ్బరంగా ఉండడం, పాలు ఇవ్వకపోవడం వంటి లక్షణాలను గుర్తించిన పోషకుడు పశువైద్యులు ఓంప్రకాష్, శ్రీకర్‌రాజులకు సమాచారం అందించాడు.
గురువారం గేదెను పరీక్షించిన పశువైద్యాధికారులు ప్లాస్టిక్ ఆహారంగా తీసుకోవడం ద్వారా అనారోగ్యానికి గురైందని గుర్తించారు. ఆపరేషన్ ద్వారా గేదె కడుపులోపల ఉన్న ఐదు కిలోలకు పైగా ప్లాస్టిక్‌ను తొలగించారు. పశుపోషకులు పశువుల మేత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. (చదవండి: తెలంగాణలో అత్యంత విలువైన కంపెనీలు ఇవే..)
Comments
Please login to add a commentAdd a comment