Study: Omicron Stays On Human Body Skin Over 21 Hours, 8 Days On Plastic | How Long Does Omicron Stay In Your Skin - Sakshi
Sakshi News home page

Omicron: మనిషి చర్మం, ప్లాస్టిక్‌పై ఎన్ని గంటలు బతికుంటుందో తెలుసా?

Published Wed, Jan 26 2022 6:04 PM | Last Updated on Thu, Jan 27 2022 9:15 AM

Omicron Stays On Skin For Over 21 hours Says Study - Sakshi

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పంజా విసురుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు వెలుగుచూసిన వేరియంట్ల కంటే అత్యంత వేగంగా ఒమిక్రాన్‌ వ్యాపిస్తోంది. అయితే ఒమిక్రాన్‌ ఎందుకు ఇంత ఎక్కువగా వ్యాప్తి చెందుతోందనే కారణం తాజాగా బయటపడింది. మనిషి శరీరంపై 21 గంటలపాటు ఒమిక్రాన్‌ వేరియంట్‌ నిలిచి ఉంటుందని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. అంతేకాదు ప్లాస్టిక్‌పై ఈ వేరియంట్‌ 8 రోజులపాటు సజీవంగా ఉంటుంది తేలింది. జపాన్‌కు చెందిన క్యోటో ప్రిఫెక్చురల్‌ యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు.

వుహాన్‌లో ఉద్భవించిన సార్క్‌ సీఓవీ2 ఒరిజినల్‌ వేరియంట్‌తోపాటు ఇతర వేరియంట్లపై పరిశోధనలు చేసి ఈ నిర్ధారణకు వచ్చారు. ఆల్ఫా, బీటా, డెల్టా, ఒమిక్రాన్‌ వేరియంట్లు ఒరిజినల్‌తో పోలిస్తే మనిషి చర్మంపై, ప్లాస్టిక్‌పై రెండు రెట్లు అధికంగా జీవించి ఉన్నట్లు గుర్తించారు. ఒమిక్రాన్‌ ఇతర అన్నీ వేరియంట్ల కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్నందున డెలట​ఆ వేరియంట్‌ కంటే కూడా అధికంగా వ్యాప్తి చెందుతుందని పరిశోధకులు గుర్తించారు. 
చదవండి: ఒమిక్రాన్‌ చివరి వేరియెంట్‌ అనుకోలేం

ప్లాస్టిక్‌ సర్ఫేస్‌లపై ఒరిజనల్‌ వేరియంట్‌ 56 గంటలు, ఆల్ఫా వేరియంట్‌ 191.3 గంటలు, బీటా వేరియంట్‌ 156.6 గంటలు, గామా వేరియంట్‌ 59.3 గంటలు, డెల్టా వేరియంట్‌ 114 గంటలు సజీవంగా ఉంటుందని తేల్చి చెప్పారు. వీటన్నింటికి మించి ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్లాస్టిక్‌పై 193.5 గంటలపాటు సజీవంగా ఉండనున్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు.
చదవండి: కరోనా ఉధృతి: గడిచిన 24 గంటల్లో 2,85,914 కేసులు

అదే విధంగా చర్మం మీద ఒరిజినల్‌ వేరియంట్‌ 8.6 గంటలు, ఆల్ఫా వేరియంట్‌ 19.6 గంటలు, బీటా 19.1 గంటలు, డెల్టా 16.8 గంటలు, ఒమిక్రాన్‌ 21.1 గంటలు ఉంటుందని తెలిపారు. కాగా ఆల్ఫా, బీటా వేరియంట్‌ల మధ్య మనుగడ సామర్థ్యంలో గణనీయమైన తేడా లేదు. ఇవి ఇంతకముందు అధ్యయనాల ఫలితాలకు అనుగుణంగా ఉందని పరిశోధకులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement