సాక్షి, న్యూఢిల్లీ: పనికిరాని ప్లాస్టిక్ వ్యర్థాలతో కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష కిలోమీటర్ల రహదారిని పూర్తి చేసింది. రీసైక్లింగ్ కుదరని ప్లాస్టిక్‌ను ఇందుకోసం వాడింది. ఫలితంగా కొన్ని వందల కోట్ల రూపాయలు ఆదా చేసింది. దీంతో భారత ప్రభుత్వం మరో లక్ష కిలోమీటర్ల మేర దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ రోడ్లు వేయాలని నిర్ణయించుకుంది. (చైనా మొబైల్ కంపెనీ డీల్‌ను వదులుకున్న హీరో!)
ఒక కిలోమీటరు రహదారిని వేయడానికి తొమ్మిది టన్నుల తారు, ఒక టన్ను ప్లాస్టిక్ వ్యర్ధాలను వాడింది. మామూలు రోడ్లలో కిలోమీటరుకు పది టన్నుల తారును వాడతారు. ఒక టన్ను తారుకు సరాసరి 30 వేల రూపాయల వరకూ ఖర్చు అవుతుంది. కిలోమీటరుకు ఒక టన్ను ప్లాస్టిక్ వ్యర్ధాలను ఉపయోగించడం వల్ల, లక్ష కిలోమీటర్లకు వందల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. ప్లాస్టిక్ రోడ్లలో సహజంగా ఆరు నుంచి ఎనిమిది శాతం ప్లాస్టిక్, 92 నుంచి 94 శాతం తారు ఉంటాయి. (నాపెళ్లి ఆపండి.. ఓ అమ్మాయి ఫోన్!)
గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్ తొలిసారిగా 2018లో తారు రోడ్లలో ప్లాస్టిక్ వ్యర్ధాలను వాడటం మొదలుపెట్టంది. ప్రస్తుతం అక్కడ తారురోడ్లలో ప్లాస్టిక్‌ను వాడటం తప్పనిసరి.జమ్మూకాశ్మీర్ జాతీయ రహదారిలో 270 కిలోమీటర్ల దూరానికి ప్లాస్టిక్ వ్యర్ధాలు కలిపి రోడ్డు వేశారు. ఢిల్లీ–మీరట్ జాతీయ రహదారిలో కూడా 1.6 టన్నుల ప్లాస్టిక్ వేస్ట్‌ను వాడారు. ధౌలా కువాన్ నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వేసిన రోడ్డులోనూ ప్లాస్టిక్‌ను వాడారు.
భారత్‌లో రోజూ 25,940 టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలు తయారవుతున్నాయి. ఇది 4300 ఏనుగుల బరువుతో సమానం. ఇందులో 60 శాతంపైగా రీసైక్లింగ్ అవుతోంది. మిగిలిన దాని మూలంగా వాతావరణం కాలుష్యం అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment