సైంటిస్టులను కలవరపెడుతున్న ప్లాస్టిక్ శిలలు. ఇప్పటికే ఐదు ఖండాలలో విస్తరించి ఉన్నాయి. ఇవి గనుకు వేగంగా ఏర్పడటం మొదలైతే ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇవి పర్యావరణం, మానువుని ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం చూపిస్తాయని చెబుతున్నారు. ఇంతకీ ఏంటీ ప్లాస్టిక్ శిలలు?. ఎలా ఏర్పడతాయంటే..
ఇప్పటి వరకు ఐదు ఖండాల్లో ఈ ప్లాస్టిక్ శిలలు ఆవిర్భవించి విస్తరిస్తున్నట్లు నివేదికల్లో వెల్లడయ్యింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో కనిపించే ఈ శిలలు విచిత్రమైన రూపాలను కలిగి ఉంటాయి. ఇవి కంప్రెస్డ్ రాక్ మాదిరిగా ప్లాస్టిక్ పాలిమర్‌లతో కూడి ఉంటాయి. సుమారు 11 దేశాలలోని తీరప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలలో కనిపించాయి.
వీటిని ఏమని పిలుస్తారంటే..
ఈ ప్లాస్టిక్ ఇన్ఫ్యూజ్డ్ శిలలను పిలవడంపై శాస్త్రవేత్తల్లో ఇప్పటికీ చర్చ కొనసాగుతోంది. అయితే ఆయా ప్రదేశాల్లో వీటిని ప్లాస్టిక్‌స్టోన్, ప్లాస్టిక్‌రస్ట్, ప్లాస్టిగోమెరేట్, ప్లాస్టిటార్, ఆంత్రోపోక్వినాస్, ప్లాస్టిసాండ్‌స్టోన్‌లు అని పిలుస్తారు. ఆ పేర్లన్నీ అలా ఏర్పడటానికి దారితీసిన ప్రక్రియలను వివరిస్తున్నాయి.
ఎలా కనుగొన్నారంటే..
జియాలజిస్ట్ ప్యాట్రిసియా కోర్కోరాన్ దాదాపు ఒక దశాబ్దం క్రితం హవాయిలో మొదటిసారిగా ఈ ప్లాస్టిక్ రాక్‌ను కనుగొన్నారు. అప్పుడే దీని గురించి చర్చ మొదలైంది. ఆ టైంలోనే ప్లాస్టిక్ గొమెరైట్ అనే పదం వెలుగులోకి వచ్చింది. అయితే ఇటీవల సింఘువా విశ్వవిద్యాలయం పర్యావరణ అసోసీయేట్ ప్రొఫెసర్ దేయీహౌ అతని బృందం ప్లాస్టిక్, రాక్ మధ్య రసాయన బంధంపై చేసిన పరిశోధనల్లో లోతట్టు ప్రాంతాల్లో కనుగొన్న తొలి ప్లాస్టిక్ శిలను కనుగొన్నారు. ఆ తర్వాత వారి విస్తృతమైన పరిశోధనల్లో ఐదు ఖండాలు, 11 దేశాల్లో వీటి ఉనికిని గుర్తించారు.
ఎలా ఏర్పడ్డాయంటే..
ఇవి ఏర్పడ్డ విభిన్న పద్ధతులపై అధ్యయనం చేయగా మంటలు లేదా వ్యర్థాలను కాల్చడం వంటి కార్యకలాపాలాల్లో ప్లాస్టిక్ శిథిలాలు కరిగిపోవడం, చలబడి ఖనిజ మాతృకలో మిళితం అవ్వడంతో ఏర్పడతున్నట్లు తెలుసుకున్నారు. ఇందుకు సముద్రపుప అలల పాత్ర కూడా ఉన్నట్లు గుర్తించారు. పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ కలిగి ఉన్న చమురు సముద్రంలోకి లీక్ అయితే అది అలల కారణం బీచ్‌లకు చేరుకుంటుంది. అక్కడ రాళ్లకు ప్లాస్టిక్ చమురు తట్టు అతుక్కుని పాక్షికంగా బాష్పీభవనం చెంది ఘనీభవించడం జరుగుతుంది. అలాగే సూర్యకాంతి కారణంగా ఈ ప్లాస్టిక్ ఆక్సీకరణ చెంది రసాయన బైండింగ్ జరిగి ఈ ప్లాస్టిక్‌స్టోన్ ఉత్పత్తికి దారీతీస్తోంది.
ఎక్కడెక్కడ ఉన్నాయంటే..
బ్రెజిల్, బంగ్లాదేశ్, హవాయి, చైనా, జపాన్, ఇండియా, ఇటలీ, పోర్చుగల్, పెరూ, యునైటెడ్ కింగ్‌డమ్, స్పానిష్ ద్వీపాలలో ఈ ప్లాస్టిక్ రాళ్లు కనపడ్డాయి. ఇది ఒకరకంగా ప్లాస్టిక్ కాలుష్యానికి అద్దం పడుతుందనే చెప్పాలి. ఈ విచిత్రమైన రాతి నిర్మాణాల ఏర్పాటుకు దారితీస్తున్న క్లిష్టమైన ప్రక్రియలే అందుకు నిదర్శనం.
కలిగే పర్యావరణ ప్రభావాలు..
ఈ ప్లాస్టిక్ శిలలు సమీపంలోని నేలలో సూక్ష్మజీవులు పెరిగేందుకు కారణమవుతుంది. స్థానిక పర్వావరణ వ్యవస్థలన్నీ దీనికి ప్రభావితం అవుతుంది. ఇప్పటికే చాలా వరకు జంతువులు, మనుషులు శరీరాలపై దారుణమైన ప్రభావం చూపిస్తోంది. మానవులు కారణంగా ఈ భూమిపై ప్లాస్టిక్ ద్రవ్యరాశి సుమారు 22 నుంచి 28 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉన్నట్లు అంచనా వేశారు.
దీనికీ తోడు ఆవిర్భవిస్తున్న ఈ ప్లాస్టిక్ రాక్‌లు మరింత కాలుష్యానికి, ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ వీటికారణంగా సూక్ష్మజీవులు అభివృద్ధి చెందితే మైక్రోప్లాస్టిక్‌లు బెడద ఎక్కువ అవుతుందని అంటున్నారు. ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ కాలుష్యాని తగ్గించే తక్షణ చర్యలకు పూనుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన నొక్కి చెబుతోందని శాస్త్రవేత్తలు అన్నారు.
(చదవండి: కాన్ఫిడెన్స్‌ని దెబ్బతీసే రౌడీబేబీని ఎదుర్కొండి ఇలా! ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండిలా..!)
Comments
Please login to add a commentAdd a comment