లండన్ : ప్రపంచ దేశాల ప్రజలను ఇప్పటికీ భయాందోళనలకు గురిచేస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు నేడు ప్రజలందరికి మాస్కులు తప్పనిసరి అయిన విషయం తెల్సిందే. ఈ మాస్కులు మరో విధంగా మనకు ముప్పును తీసుకొస్తున్నాయి. ఉతికి ఆరేసుకునే గుడ్డ మాస్కులు కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎక్కువగా ఏ రోజుకు ఆ రోజు వాడి పారేసే ప్లాస్టిక్‌తో కూడిన మాస్కులనే ఉపయోగిస్తున్నారు.
ఒక్క బ్రిటన్‌లోనే పౌరులు ప్లాస్టిక్‌తో కూడిన మాస్కులు వాడుతూ ఏ రోజుకు ఆ రోజు వాటిని పారేస్తున్నారని భావిస్తే ఓ ఏడాదికి అంచనాల ప్రకారం 66 వేల టన్నుల కలుషిత వ్యర్థాలు, 57 వేల ప్లాస్టిక్ వ్యర్థాలు మహా కూడుతాయి. అంతేకాకుండా వైరస్ అంటుకున్న మాస్కుల వ్యర్థాల వల్ల మానవ మనుగడకు ప్రమాదం పొంచి ఉంది. ఆ వైరస్ మట్టిలోకి కూరుకు పోవడం, జల మార్గాల్లో, భూగర్భ జలాల్లో కలిసి పోవడం వల్ల ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉంటది. ప్లాస్టిక్ వాడ కూడదనే ప్రచారం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నా ప్లాస్టిక్ మాస్కులనే ఎక్కువగా వాడుతున్నారు. గ్లౌజులు కూడా ప్లాస్టిక్‌వే ఎక్కువగా వాడేవి.
ప్రపంచవ్యాప్తంగా మాస్కులను ఎక్కువగా తయారు చేస్తోన్న దేశం ఇప్పటికీ చైనానే. గత ఫిబ్రవరి నెల నాటికి చైనా కంపెనీలు రోజుకు 11.60 కోట్ల యూనిట్ల మాస్కులను ఉత్పత్తి చేస్తూ వచ్చాయి. ఆ కంపెనీల రోజు వారి ఉత్పత్తి సామర్థ్యం ఇంకా పెరిగిందట. మాస్కుల్లో ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి. గుడ్డతో చేసినవి, సర్జికల్, ఎన్–95 మాస్కులు. గుడ్డతో చేసినవి మళ్లీ మళ్లీ ఉపయోగించవచ్చు. వీటికంటే ఎన్–95 మాస్కులు అత్యంత శ్రేయస్కరమైనవి. 95 శాతం ఇవి గాలిద్వారా వచ్చే వైరస్‌లను నియంత్రించగలవు. వీటిలో ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. క్లినికల్ మాస్కులు అంతంత మాత్రంగానే ఉపయోగపడతాయి. ఈ రెండు రకాల మాస్కులను ఏ రోజుకారోజు పారేయాల్సి ఉంటుంది.
ఎన్–95 మాస్కుల స్ట్రాప్‌ను పోలిసొప్రేన్, స్టాపిల్స్‌ను స్టీల్‌తో, ముక్కు వద్ద పోలియురెథేన్, ముక్కు వద్ద క్లిప్‌ను అల్యూమినియం, ఫిల్టర్‌ను పోలిప్రొఫిలిన్‌లతో తయారు చేస్తారు. ముక్కు, మూతి పూర్తిగా మూసుకుపోయే మాస్కులను వాడితే తప్పా గుడ్డ మాస్కుల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. కానీ ప్లాస్టిక్ మాస్కుల వల్ల పలు విధాల ప్రమాదం పొంచి ఉంది. రోజువారిగా ఉపయోగించే మాస్కులను మట్టిలో కలిసిపోయే పదార్థాలతోనే తయారు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. (చదవండి: వ్యాక్సిన్ ముందుగా ఎవరెవరికి..)
Comments
Please login to add a commentAdd a comment