సాక్షి, తిరుమల: తిరుమలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వడివడిగా అడుగులు వేస్తోంది. ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా టీటీడీ పలు నిర్ణయాలను అమలు చేస్తోంది. అందులో భాగంగా ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. లడ్డు, ఇతర ప్రసాదాలను అందించడానికి జ్యూట్ బ్యాగులు అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇక శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు బార్ కోడ్ విధానం ద్వారా లడ్డులు అందిస్తామని, దర్శనం చేసుకున్న వారికే లడ్డులు అందిస్తామని టీటీడీ అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి గతంలో పేర్కొన్నారు. దీనికి కొనసాగింపుగా లడ్డు కవర్లను నిషేధించారు. వాటికి ప్రత్యామ్నాయంగా పేపర్ బాక్స్‌లు ప్రవేశపెట్టారు. మరోవైపు వసతి గృహాల వద్ద వాటర్ కూలర్లు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment