decompose
-
పడవలో కుళ్లిన 30 మృతదేహాలు.. సెనెగల్‌లో కలకలం
డాకర్ (సెనెగల్): పశ్చిమ ఆఫ్రికాలోని సెనెగల్‌లో ఒళ్లు జలదరించే దృశ్యం కనిపించింది. సెనెగల్ సాగర తీరంలో తేలియాడుతున్న పడవలో 30 కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాలు లభ్యమయ్యాయి. రాజధాని డాకర్కు 70 కిలోమీటర్ల దూరంలో ఈ పడవ కనిపించింది. నేవీ సిబ్బంది ఈ చెక్క పడవను ఓడరేవుకు చేర్చారు.మృతదేహాలు కుళ్లిపోవడంతో వాటి గుర్తింపు కష్టంగా ఉందని స్థానిక అధికారులు తెలిపారు. అయితే ఇవి ఎవరివనేది గుర్తించేందుకు ఉన్న మార్గాల గురించి అధికారులు అన్వేషిస్తున్నారు. ఇటీవలికాలంలో సెనెగల్ నుండి స్పెయిన్ కానరీ దీవులకు వలసలు భారీగా పెరిగాయి. అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా 1,500 కిలోమీటర్లకు మించిన దూరాన్ని దాటి వలస సాగిస్తున్నారు.ప్రాథమికంగా ఈ మృతదేహాలు వలసదారులవై ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. చాలా రోజులుగా అట్లాంటిక్ మహాసముద్రంలో ఈ పడవ ఉండివుంటుందని అధికారులు చెబుతున్నారు. గత ఆగస్ట్‌లో డొమినికన్ రిపబ్లిక్ తీరంలో ఒక పడవలో 14 మృతదేహాలు లభ్యంకాగా, అవి సెనెగల్ జాతీయులవై ఉంటాయని మత్స్యకారులు చెబుతున్నారు. కాగా అక్రమ వలసలను అరికట్టడానికి సెనెగల్ 10 సంవత్సరాల ప్రణాళికను ప్రకటించింది. నిరుద్యోగం, పేదరికం, అంతర్గత సంఘర్షణలతో విసిగిపోయిన యువకులు అట్లాంటిక్ మహాసముద్రంలో ఎదురయ్యే ముప్పును ఎదుర్కొంటూ కానరీ దీవులకు వలస వెళుతున్నారు. ఇది కూడా చదవండి: యూపీలో ఎన్కౌంటర్.. రూ. లక్ష రివార్డు నిందితుని హతం -
ప్లాస్టిక్‌ను తింటది ఈ ఎంజైమ్..!
చావుని తింటది కాలం.. కాలాన్ని తింటది కాళి.. అన్నాడో కవి ఇటీవలి ఒక పాటలో! దీనికి కొనసా గింపు గా ప్లాస్టిక్‌ను తింటది ఈ ఎంజైమ్... అంటున్నారు సైంటిస్టులు. భూకాలుష్యానికి కారణమైన ప్లాస్టిక్ నియంత్రణలో ముందడుగు పడిందంటున్నారు. జీవజాతుల మనుగడకు పెనుముప్పుగా పరిణమిస్తున్న ప్లాస్టిక్ వేస్ట్ నియంత్రణ మనిషికి పెనుసవాలుగా మారుతోంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా భూమిపై ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇతర వ్యర్థాలతో పోలిస్తే ప్లాస్టిక్ డీకంపోజ్ (క్షీణించడం) అవడానికి చాలా కాలం పడుతుంది. ఒక అంచనా ప్రకారం ప్లాస్టిక్ సంపూర్ణంగా డీకంపోజ్ కావడానికి సుమారు 500– 1000 సంవత్సరాలు పడుతుంది. ఇంతటి కలుషితాన్ని ఎలా కట్టడి చేయాలా? అని మనిషి మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ తరుణంలోనే మోంటానా, పోర్ట్స్మౌత్ యూనివర్సిటీలకు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు ఒక గుడ్‌న్యూస్ వినిపిస్తున్నారు. ప్లాస్టిక్‌ను గుట్టుచప్పుడుకాకుండా కనుమరుగు చేసే ఒక ఎంజైమ్‌ను వీరు గుర్తించారు. వీరి పరిశోధనా వివరాలు పీఎన్ఏఎస్ (ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్)లో ప్రచురించారు. పీఈటీ (పాలీ ఇథిలీన్ టెలిఫ్తాలేట్) ప్లాస్టిక్‌లో ఉండే టీపీఏ (టెరిఫ్తాలేట్)ను డీకంపోజ్ చేసే శక్తి ఈ ఎంజైమ్‌కు ఉందన్నారు. పీఈటీ ప్లాస్టిక్‌ను డిస్పోజబుల్ సీసాలు, బట్టలు, కార్పెట్ల తయారీలో ఉపయోగిస్తారు. 2018లోనే ప్రొఫెసర్ జెన్ డుబోయిస్, ప్రొఫెసర్ జాన్ మెక్గెహాన్లు ఈ ఎంజైమ్ తయారీపై పరిశోధనలు ఆరంభించారు. తాజాగా దీని పూర్తి వివరాలను వెల్లడించారు. బ్యాక్టీరియాలో ఉత్పత్తి టీపీఏను డీకంపోజ్ చేయడం కష్టమని, చివరకు బ్యాక్టీరియా కూడా దీన్ని అరిగించుకోలేదని జెన్, జాన్ చెప్పారు. కానీ పీఈటీని తినే బ్యాక్టీరియాలో ఒక ఎంజైమ్ మాత్రం టీపీఏను గుర్తుపడుతుందని తెలిసిందన్నారు. టీపీఏడీఓ అని పిలిచే ఈ ఎంజైమ్‌పై మరిన్ని పరిశోధనలు చేయగా, ఇది టీపీఏను పూర్తిగా శి«థిలం (బ్రేక్‌డౌన్) చేస్తుందని గుర్తించామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 40 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తవుతున్నాయి. తాజాగా కనుగొన్న టీపీఏడీఓ ఎంజైమ్‌తో ఎటువంటి రసాయనాలు వాడకుండా జైవిక పద్ధతుల్లోనే ప్లాస్టిక్‌ను డిగ్రేడ్ చేయవచ్చు. పీఈటీ ప్లాస్టిక్‌లో అణువులను విచ్ఛిన్నం చేసే ఒక ఎంజైమ్‌ను గుర్తించడం కీలకమలుపని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ ఎంజైమ్ ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా కేవలం సదరు ప్లాస్టిక్‌ను డీకంపోజ్ చేయడమే కాకుండా పలు రకాల ఉపయోగకర రసాయనాలను కూడా ఉత్పత్తి చేస్తుందని సైంటిస్టులు వివరించారు. డైమండ్ లైట్ సోర్స్‌లో ఎక్స్ కిరణాలను ఉపయోగించి టీపీఏడీఓ ఎంజైమ్ 3డీ నిర్మితిని రూపకల్పన చేయడంలో విజయం సాధించినట్లు మెక్‌గెహాన్ చెప్పారు. దీనివల్ల ఈ ఎంజైమ్ ఎలా పనిచేస్తుందనే విషయాన్ని కూలంకషంగా అధ్యయనం చేయవచ్చన్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి. -
కొత్తతరహాలో పంట వ్యర్థాల డీకంపోజ్
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ సహా ఇరుగుపొరుగు రాష్ట్రాలైన హరియాణా, పంజాబ్, యూపీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో పంట కోత తర్వాత పొలంలో మిగిలిన పంట వ్యర్థాలను తగలబెట్టడంతో ఆయా రాష్ట్రాలు దట్టమైన కాలుష్యంతో నిండిపోయేవి. పూసా అగ్రికల్చర్ ఇనిస్టిట్యూట్ ఈ ఏడాది, మిగిలిన వ్యర్థాలను పొలాల్లోనే డీకొంపోజ్ చేయడానికి నూతన సాంకేతికతని అభివృద్ధిపరిచిందని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఈ ఐదు రాష్ట్రాల పర్యావరణ మంత్రులతో ఆయన సమావేశం నిర్వహించారు, ఈ సీజన్లో మిగిలిపోయిన పంటవ్యర్థాలను తగులబెడితే వచ్చే కాలుష్యాన్ని ఎదుర్కొనే సంసిద్ధత గురించి ఈ సమావేశంలో చర్చించారు. గత మూడు సంవత్సరాలుగా వ్యర్థాల దహనం తగ్గినప్పటికీ ఈ సమస్యను పరిష్కరించడానికి మున్ముందు మరిన్ని చర్యలు అవసరమని జవదేకర్ అన్నారు. ఈ వ్యర్థాల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రూ.1,700 కోట్లు కేటాయించింది.వీటిలో వ్యర్థాల అదుపు చేయడానికి ప్రస్తుతం, వ్యక్తులకు 50 శాతం, సహకార సంఘాలకు 80 శాతం ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. -
అమ్మో.. ఈ చికెన్ చూస్తే భయమేస్తోంది
నాన్‌వెజ్ వెరైటీ ఐటెమ్స్‌కు నెల్లూరు పెట్టింది పేరు. నగరంలో హోటల్స్‌లో చికెన్ ముక్క తిందామన్నా.. మటన్ పీస్ రుచి చూద్దామన్నా హడలి పోతున్నారు. కాకా హోటల్ నుంచి స్టార్ హోటళ్ల వరకు నోరూరేటట్లు ఎన్నో వెరైటీ రుచులు చూపించారు. ఎవరైనా ఇతర రాష్ట్ర, జిల్లాల నుంచి నెల్లూరుకు వస్తే కచ్చితంగా సింహపురి భోజనం రుచి చూసి వెళ్లాలని ఆశపడుతుంటారు. ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు చూసి, తెలిసీ అమ్మో నాన్ వెజ్ అంటూ భయపడే పరిస్థితి ఏర్పడింది. మూడు వారాలుగా నెల్లూరు నగరపాలక సంస్థ, ఫుడ్ కంట్రోల్ శాఖల అధికారులు సంయుక్తంగా చేస్తున్న దాడుల్లో ప్రధాన హోటళ్లలో భారీగా నిల్వ ఉంచిన మాంసం బయట పడుతోంది. తాజాగా ఓ చికెన్ స్టాల్లోనే రోజుల తరబడి నిల్వ ఉంచిన మాంసం బయట పడడంతో అధికారులే అవాక్కయ్యారు. సాక్షి, నెల్లూరు సిటీ : నిన్నా.. మొన్నటి వరకు హోటళ్లలో మాంసం నిల్వలను గుర్తించిన అధికారులు, తాజాగా ఓ చికెన్ స్టాల్లోనూ నిల్వ మాంసం గుర్తించి నివ్వెరపోయారు. నగరంలోని చిల్డ్రన్స్ పార్క్‌కు వెళ్లే రహదారిలో ఓ చికెన్ స్టాల్ నిర్వహిస్తున్నారు. కార్పొరేషన్ కమిషనర్ పీవీవీఎస్ మూర్తి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ శనివారం ఉదయం దాడులు చేపట్టారు. చికెన్ స్టాల్ లోనికి వెళ్లి చూడగా రెండు ఫ్రిజ్‌లు ఏర్పాటు చేసి ఉన్నారు. వాటిల్లో దాదాపు 30 కిలోల చికెన్ లెగ్ పీస్‌లు, లివర్, కట్ చేసిన చికెన్ రోజుల తరబడి నిల్వ ఉంచడాన్ని గుర్తించారు. భారీ మొత్తంలో నిల్వ మాంసాహారం ఉంచడంపై కమిషనర్ దుకాణ యజమానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చికెన్ స్టాల్స్‌లో ఫ్రిజ్‌లు ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. కుక్కలకు వేసేందుకు అంటూ సమాధానం చెప్పడంతో చెడిపోయిన ఆహారాన్ని కుక్కలకు వేస్తారా అంటూ యజమానిపై మూర్తి మండి పడ్డారు. రూ.50 వేలు జరిమానా చికెన్ స్టాల్‌లోని రెండు ఫ్రిజ్‌లను సీజ్ చేసి కార్పొరేషన్ కార్యాలయానికి తరలించారు. నిల్వ మాంసాన్ని చెత్త వాహనాలు ద్వారా బోడిగోడి తోట డంపింగ్ యార్డ్‌కు తరలించి ఖననం చేయించారు. చికెన్ స్టాల్ యజమానికి రూ.50 వేలు జరిమానా విధించారు. అనంతరం నిప్పో సెంటర్ వద్ద రెండు రెస్టారెంట్‌ల్లో దాడులు చేయగా నిల్వ ఉంచిన శాఖాహారం, మాంసాహారం గుర్తించారు. అయ్యప్పగుడి సెంటర్ వద్ద ఓ బార్ అండ్ రెస్టాంట్‌లో దాడులు నిర్వహించగా నిల్వ మాంసం గుర్తించారు. నిల్వ ఆహార పదార్థాలను ఉంచిన హోటల్స్‌కు మొత్తం రూ.1.50 లక్షలు జరిమానా విధించారు. మూడు వారాల్లో రూ.15 లక్షల జరిమానా నగర పాలక సంస్థ పరిధిలో ఈ నెల మొదటి వారం నుంచి కార్పొరేషన్, ఫుడ్ కంట్రోల్ శాఖ అధికారులు సంయక్తంగా దాడులు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశాల మేరకు దాడులు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాన హోటల్స్, బార్ అండ్ రెస్టారెంట్లలో భారీగా నిల్వ ఉన్న మాంసాన్ని గుర్తించిన విషయం తెలిసిందే. పండ్ల రసాల జ్యూస్‌ల్లో సైతం నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో భారీగా జరిమానాలు విధించారు. మూడు వారాల్లో దాదాపు రూ.15 లక్షలు జరిమానాలు విధించారు. -
సగం కుళ్లిపోయినా ఆమె బతికే ఉంది
వాషింగ్టన్ : దాదాపు పాడుబడిపోయి కంపుకొడుతున్న ఓ ఇంట్లో అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఓ మహిళను అమెరికా అగ్నిమాపకశాఖ పోలీసులు గుర్తించారు. ఓ వ్యాధి కారణంగా బాగా లావెక్కి కదలలేకుండా మంచాన పడిపోయి ఉన్న ఆమెను చూసి దుఃఖితులయ్యారు. పైగా ఆమె కాళ్లకు పురుగులు పట్టి దాదాపు సగం వరకు కుళ్లిన స్థితిలోకి చేరడంతో ఆమె చనిపోయిందనే తొలుత భావించిన పోలీసులు ఆ తర్వాత ఆమె బతికి ఉండటాన్ని చూసి శర వేగంగా ఆస్పత్రికి తరలించారు. తమ జీవితంలో ఇలాంటి కేసు చూడలేదంటూ వర్ణించారు. వివరాల్లోకి వెళితే.. నార్తర్న్ జార్జియాలోని ఓ ఇంట్లో ట్రాసీ సారెల్స్ (50) అనే మహిళ చాలా రోజులుగా మంచంలో కదలేని స్థితిలో పడి ఉంది. ఆమెకు టెర్రి సారెల్స్ (54) అనే భర్తతోపాటు, క్రిస్టియాన్ (18) అనే కుమారుడు ఉన్నాడు. ఆమె మంచానికి పరిమితం కావడంతో ఆమెను పూర్తిగా వారు నిర్లక్ష్యం చేశారు. ఎంతలా అంటే ఆమె పడి ఉన్న మంచంపై కనీసం బెడ్‌షీట్ లేదు. పైగా ఆ గది మొత్తం దుర్గందంతో నిండిపోయింది. ఆమె భర్త ఉపయోగించుకునే గది కంప్యూటర్ వద్ద తప్ప మరెక్కడా కూడా శుభ్రత అంటూ లేదు. ఓ చెత్త కర్మాగారంగా ఆ ఇల్లు మారిపోయింది. వంటగదిలో సీలింగ్ వరకు చెత్త పేరుకుపోయింది. ఆమె ముఖంపై ప్లాస్లిక్ పేపర్లు, తదితర ఇతర వస్తువులు వేసి ఉంచారు. ఏ ఒక్కరు కూడా కనీసం ఆమెను చూసేందుకు వెళ్లనట్లు కనిపించింది. అగ్నిమాపక సిబ్బంది ఆ దృశ్యం చూసి షాక్ అయ్యారు. ఇంత నిర్లక్ష్యం ప్రదర్శించిన భర్తపై కేసులు నమోదు చేశారు. అయితే, ఆమె కుమారుడు స్పందిస్తూ తమ వద్ద అసలు డబ్బులు లేవని, ఏ ఒక్కరికీ ఉద్యోగం లేకపోవడంతోనే ఎలాంటి సపర్యలు చేయలేకపోయామంటూ వివరించాడు. కాగా, ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు గాలింపులు చేపట్టిన పోలీసులు ట్రాసీని గుర్తించారు. -
ప్లాస్టిక్‌ను తినేసే బాక్టీరియా గుర్తింపు!
వాషింగ్టన్: పాస్టిక్ వ్యర్థాలను నిర్వీర్యం చేయడం తలకుమించిన భారంగా పరిణమించిన నేపథ్యంలో శాస్త్రవేత్తలు తీపికబురు అందించారు. జపాన్‌లోని క్యోటో యూనివర్సిటీ పరిశోధన బృందం ఇడియోనెల్లా సాకైన్సిస్ అనే బాక్టీరియాను కనుగొన్నారు. కేవలం రెండు ఎంజైమ్‌ల సహాయంతో ఈ బాక్టీరియా పాలీఇథిలిన్ టెరిప్తలేట్(పీఈటీ)ను సమర్థవంతంగా విచ్ఛిన్నం చేస్తుందని వారు గుర్తించారు. పీఈటీని బాటిల్స్, వస్త్ర పరిశ్రమలో విరివిగా ఉపయోగిస్తారు. ఒక్క 2013లోనే ప్రపంచవ్యాప్తంగా 56 మిలియన్ టన్నుల పీఈటీ ఉత్పత్తి జరిగిందంటే పర్యావరణానికి ఇదెంత హానికారో తెలుస్తుంది. ఈ బ్యాక్టీరియా గుర్తింపుతో ప్లాస్టిక్‌ను నిర్వీర్యం చేసే సూక్ష్మ జీవులను గుర్తించడం కోసం ఐదేళ్లుగా చేస్తున్న కృషి విజయవంతమైందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్లాస్టిక్‌ను విచ్ఛిన్నం చేసే శిలింద్రాలను గతంలోనే పరిశోధకులు గుర్తించారు. అయితే ఈ తరహా బాక్టీరియాను గుర్తించడం మాత్రం ప్రపంచంలో ఇదే మొదటిసారని సైన్స్ జర్నల్‌లో వెల్లడించారు. 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఈ బాక్టీరియా సమర్థవంతంగా పీఈపీని నిర్వీర్యం చేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తిచారు. ప్లాస్టిక్ డీకంపోజింగ్ ఎంజైమ్‌ల తయారీ కోసం ఇడియోనెల్లా సాకైన్సిస్ డీఎన్ఏపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు.