బ్యాక్టీరియా, వైరస్‌లు మనం వాడే మందులకు అలవాటు పడిపోతున్న తరుణంలో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఒకటి కృత్రిమ యాంటీబయాటిక్‌తో వాటికి చెక్ పెట్టేశారు. మూడేళ్ల క్రితం శాస్త్రవేత్తలు టెక్సోబ్యాక్టిన్ అనే ఓ రసాయనాన్ని గుర్తించారు. యాంటీబయాటిక్ నిరోధకతకు ఇదో మేలి విరుగుడని శాస్త్రవేత్తలు అంచనా కట్టినా దాన్ని కృత్రిమంగా తయారు చేయడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఫలితంగా ఈ మందు కేవలం పరిశోధనలకు మాత్రమే పరిమితమైపోయింది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఆఫ్ లింకన్ శాస్త్రవేత్తలు ఈ అంశంపై పరిశోధనలు చేపట్టి విజయం సాధించారు. టెక్సోబ్యాక్టిన్ తయారీ సమయాన్ని కూడా గణనీయంగా తగ్గించగలిగారు.
ఈ కృత్రిమ మందుతో ఎలుకలపై పరిశోధనలు జరిపినప్పుడు అది సాధారణ బ్యాక్టీరియాతోపాటు సాధారణ మందులను తట్టుకోగల సూపర్‌బగ్‌లనూ సమర్థంగా ఎదుర్కోగలదని తెలిసింది. అంతేకాకుండా ఈ మందు ద్వారా ఇన్ఫెక్షన్ సమస్య కూడా తక్కువగా ఉంటుందని తెలిసింది. టెక్సోబ్యాక్టిన్ కృత్రిమ తయారీ సాధ్యమైన నేపథ్యంలో కొత్తరకం యాంటీబయాటిక్ మందులను అభివృద్ధి చేయడం చాలా సులువు కానుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఈశ్వర్‌సింగ్ తెలిపారు. అయితే అన్ని పరిశోధనలు పూర్తి చేసుకుని టెక్సోబ్యాక్టిన్ మార్కెట్‌లోకి వచ్చేందుకు ఇంకా కొన్నేళ్లు పట్టవచ్చునని ఆయన అంటున్నారు.
కృత్రిమ యాంటీబయాటిక్ సక్సెస్...
Published Tue, Mar 27 2018 12:41 AM | Last Updated on Tue, Mar 27 2018 12:41 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment