పాలపౌడర్‌లో అతి ప్రమాదకరమైన బ్యాక్టీరియా! | France orders international recall of Lactalis baby formula | Sakshi
Sakshi News home page

పాల పౌడర్‌లో అతి ప్రమాదకరమైన బ్యాక్టీరియా!

Published Mon, Dec 11 2017 11:31 AM | Last Updated on Mon, Dec 11 2017 11:39 AM

France orders international recall of Lactalis baby formula - Sakshi

పారిస్‌: ప్రపంచంలోనే అతిపెద్ద డెయిరీ సంస్థ,  ఫ్రెంచ్ కంపెనీ లాక్టాలిస్‌ షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. తాము తయారు చేసిన  బేడీ పౌడర్‌లో అతిప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉందంటూ   గ్లోబల్‌ రీకాల్‌ చేపట్టింది.  మిలుమెల్‌, పికాట్‌, సెలి బ్రాండ్‌కింద  కొన్ని వందల  పాలపొడి  ఉత్పత్తులను  విక్రయిస్తున్న లాక్టాలిస్‌  ​ కొన్ని వేల టన్నుల  ఉత్పత్తులను  మార్కెట్‌నుంచి ఉపసంహరించుకుంటోంది.

ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ అవుతున్న తమ  చిన్న పిల్లల  పాల ఉత్పత్తుల్లో ప్రమాదకరమైన బ్యాక్టీరియా  ‘సాల్మొనెల్లా’  కారణంగా  ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో  తన ఉత్పత్తులను  వెనక్కి  రప్పిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. దాదాపు 7 వేల టన్నుల ఉత్పత్తి కలుషితమైనదని సంస్థ ప్రతినిధి మిచెల్ నాలేట్ స్వయంగా  వెల్లడించారు. కానీ ప్రస్తుతం మార్కెట్లో  లభ్యమవుతున్న  స్టాక్‌లో  ఏ మేరకు దీని  ప్రభానికి గురయ్యాయి అనేది స్పష్టం చేయలేదు. సాల్మొనెల్లా ( జంతువుల లేదా మానవుల మలంతో  కలుషితమైన) బ్యాక్టీరియా కారణంగా చాలామంది పిల్లలు అస్వస్థతకు గురికావడంతోపాటు  ఫ్రాన్స్‌ ఆరోగ్య అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సాల్మొనెల్లా బ్యాక్టీరియా కారణంగా ఆహారం విషతుల్యంగా మారి పిల్లలో డయేరియా, కడుపు తిమ్మిరి,  వాంతులు తదితర లక్షణాలు వ్యాపించాయి. డిసెంబరు ప్రారంభంలో దేశంలో 26 మంది శిశువులు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో  బ్రిటన్, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, సూడాన్‌ సహా పలు దేశాలకు ఎగుమతులపై ప్రభావం చూపనుంది.

కాగా  అతి ముఖ్యమైన బేబీ  పౌడర్‌ లేదా పాల పొడి ఉత్పత్తులు అతి ప్రమాదకరమైన బాక్టీరియా ప్రభావానికి గురికావడం ఇదే మొదటి సారి  కాదు.  చైనాకు చెందిన ఓ కంపెనీ   తయారు చేసిన పాల పౌడర్‌లో   పారిశ్రామిక రసాయనం మెలామైన్‌  కలవడంతో 2008 లో ఆరుగురు పిల్లలు మరణించారు.  సుమారు 3లక్షలమంది  పిల్లలతో సహా ఇతరులు కూడా అనారోగ్యం పాలయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement