అందరికీ ఒకే చికిత్స సరికాదు..  | Mayo clinic scientists research that food is a better result | Sakshi
Sakshi News home page

అందరికీ ఒకే చికిత్స సరికాదు.. 

Published Sat, Feb 16 2019 12:46 AM | Last Updated on Sat, Feb 16 2019 12:46 AM

Mayo clinic scientists research that food is a better result - Sakshi

మధుమేహం చికిత్సకు వ్యక్తులు జన్యువులు ఆధారంగా చేసుకుని సిద్ధం చేసిన ఆహరం మెరుగైన ఫలితాలిస్తుందని మేయో క్లినిక్‌ శాస్త్రవేత్తలు పరిశోధన పూర్వకంగా నిర్ధారించారు. కడుపు/పేవుల్లోని బ్యాక్టీరియాల కారణంగా ఒకే రకమైన ఆహారానికి వ్యక్తులు వేర్వేరుగా స్పందిస్తూంటారని అందువల్ల పోషకాల్లో తేడా వచ్చి వ్యాధికి స్పందన కూడా వేరుగా ఉంటుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త హెలెనా మెండిస్‌ సోరేస్‌ తెలిపారు.

ఆహారానికి రక్తంలని గ్లూకోజు మోతాదులకు మధ్య ఉన్న సంబంధాలను క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకు తాము ప్రయోగాలు మొదలుపెట్టామని వ్యక్తుల వయసు, ఆహారం, వ్యాయామం వంటి అంశాలు మాత్రమే కాకుండా.. తీసుకునే ఆహారానికి స్పందించే లక్షణం ఆధారంగా రక్తంలోని గ్లూకోజు మారుతూంటుందని వివరించారు.  కార్బోహైడ్రేట్లు, కేలరీ లెక్కలేసి ప్రస్తుతం వేస్తున్న అంచనాలు సరికాదని అన్నారు. ఈ కారణంగానే కొంతమంది మధుమేహులుకు కొన్ని రకాల పండ్లు తిన్నా రక్తంలో గ్లూకోజు మోతాదులు పెరగవని తెలిపారు. దాదాపు 327 మందిపై ఆరు రోజుల పాటు పరిశీలన జరిపామని.. తీసుకునే ఆహారానికి రక్తంలోని చక్కెర మోతాదులకు మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసకునే ప్రయత్నం చేశామని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement