ఆహారంలో విషాన్ని ఉత్పత్తి చేసే సూక్ష్మజీవి వల్ల కలిగే వ్యాధి? | Disease caused by the organism that produces toxins in the diet? | Sakshi
Sakshi News home page

ఆహారంలో విషాన్ని ఉత్పత్తి చేసే సూక్ష్మజీవి వల్ల కలిగే వ్యాధి?

Published Thu, Sep 25 2014 3:19 AM | Last Updated on Sat, Sep 2 2017 1:54 PM

ఆహారంలో విషాన్ని ఉత్పత్తి చేసే సూక్ష్మజీవి వల్ల కలిగే వ్యాధి?

ఆహారంలో విషాన్ని ఉత్పత్తి చేసే సూక్ష్మజీవి వల్ల కలిగే వ్యాధి?

వ్యాధులు - కారకాలు: మానవునిలో చాలా రకాలైన వ్యాధులు వైరస్, బ్యాక్టీరియా, ప్రోటోజోవాల వల్ల వస్తాయి. వీటి ద్వారా వచ్చే వ్యాధులు ఎక్కువగా అంటువ్యాధులు. ప్రత్యక్ష సంబంధం, గాలి,  నీరు, లైంగిక సంపర్కం ద్వారా అంటువ్యాధులు ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతాయి.
 
  డీఎస్సీ-2008లో అడిగిన ప్రశ్నలు
 1.    ఒక పిల్లవాడు జిగట విరేచనాలతో బాధపడుతున్నాడు. ఆ వ్యాధికి కారణం?
     1) ప్లాస్మోడియం ఫాల్సిఫారం         2) ఉకరేరియా బ్రాన్‌క్రాఫ్టి
     3) ఎంటమీబా హిస్టాలిటికా         4) అమీబా ప్రొటియాస్
 2.    ఒక బాలుడు విడువని జ్వరం,  పొట్ట భాగంలో నొప్పి, నాలుకపై పూత, తలభారంతో బాధపడుతున్నాడు. ఈ లక్షణాలను బట్టి ఆ వ్యాధి ఏది?
     1) మలేరియా     2) కలరా     
     3) డిఫ్తీరియా     4) టైఫాయిడ్
 3.    ఒక పిల్లవాడు రెండు చెవులకు దిగువన దవడ భాగంలో నొప్పి, చెవినొప్పి, జ్వరంతో బాధపడుతున్నాడు. ఇది ఏ వ్యాధి?
     1) గవదలు    2) ధనుర్వాతం     3) డిఫ్తీరియా     4) మలేరియా
 4.    పోలియో వ్యాధిలో వైరస్ దేన్ని నాశనం చేస్తుంది?
     1) చాలక నాడులు  2) కశేరు నాడులు     
     3) జ్ఞాన నాడులు      4) కపాల నాడులు
 సమాధానాలు
     1) 3    2) 4    3) 1    4) 1
 
 జీవశాస్త్రం - కంటెంట్ (ఎస్.ఎ.)
 ఎస్.పి.డి. పుష్పరాజ్ : సబ్జెక్ట్ నిపుణులు,
 గిద్దలూరు, ప్రకాశం
 
 మాదిరి ప్రశ్నలు
 
 1.    కిందివాటిలో ప్రత్యక్ష సంబంధం వల్ల రాని వ్యాధి?    
     1) మశూచి     2) జలుబు
     3) గవద బిళ్లలు  4) పోలియోైమైలిటిస్
 2.    శరీరం బరువు 10 శాతం లేదా అంతకంటే తగ్గడం, మెదడు కంతులు, రక్తనాళాలు చిట్లిపోవడం, విరేచనాలు, లింఫ్ గ్రంథులు వాయడం, కారణం లేకుండా జ్వరం వంటి లక్షణాలు ఏ వ్యాధికి చెందినవి?
     1) తట్టు     2) అమ్మవారు
     3) ఎయిడ్‌‌స    4) డెంగ్యూ
 3.    టైఫాయిడ్, క్షయ, ప్లేగు వ్యాధుల సంక్ర మణ పద్ధతికి సంబంధించిన సరైన క్రమం?
     1) మట్టిలోని బ్యాక్టీరియా- ప్రత్యక్ష సంబంధం- పెంపుడు జంతువుల ద్వారా
     2) ఈగలు- ప్రత్యక్ష సంబంధం- దోమల ద్వారా
     3) ఈగలు- పత్యక్ష స్పర్శ- ఎలుకల ద్వారా
     4) ఎలుకలు- ఈగలు - ప్రత్యక్ష స్పర్శ
 4.    ఒక వ్యాధిగ్రస్థుడు డాక్టర్ దగ్గరకు వెళ్లి తనకు కండరాలు సంకోచించడం, నరాల తీపులు, గిట్ట కరుచుకోవడం వంటి లక్షణాలున్నాయని  తెలిపాడు.  డాక్టర్  ఏ వ్యాధి అని నిర్ధారిస్తాడు?
     1) క్షయ     2) ధనుర్వాతం
     3) న్యుమోనియా     4) డిఫ్తీరియా
 5.    ఆహారంలో విషాన్ని ఉత్పత్తి చేసే సూక్ష్మజీవి వల్ల కలిగే వ్యాధి?
     1) కుష్టు     2) కలరా     
     3) బొటులిజం     4) గనేరియా
 6.    కిందివాటిలో వైరస్ వల్ల రాని  వ్యాధి?
     1) జలుబు     2) గవద బిళ్లలు    
     3) పోలియో     4) క్షయ
 7.    హెమోఫిల్లస్ పెర్టుసిస్ ఏ వ్యాధిని కలిగిస్తుంది?
     1) కోరింత దగ్గు     2) టైఫాయిడ్
     3) డీసెంట్రీ     4) డిఫ్తీరియా
 8.    కలరా- విబ్రియో కలరా, నిద్రాజాఢ్యం -ట్రిపనో సోమా గాంబియన్‌‌స, ఇన్‌ఫ్లు యెంజా/ఫ్లూ- ఆర్థోమిక్సో కారకాల వల్ల వ్యాధులు కలుగుతాయి. వీటికి సంబంధించి సరైన వరుస క్రమం?
     1) కలరా-ప్రోటోజోవా, నిద్రా
         జాఢ్యం - వైరస్, ఇన్ ఫ్లుయెంజా - బ్యాక్టీరియా
     2) కలరా- బ్యాక్టీరియా, నిద్రాజాఢ్యం - ప్రోటోజోవా, ఇన్‌ఫ్లుయెంజా వైరస్
     3) కలరా-వైరస్, నిద్రాజాఢ్యం- ప్రోటోజోవా, ఇన్‌ఫ్లుయెంజా - బ్యాక్టీరియా
     4) కలరా- బ్యాక్టీరియా, నిద్రాజాఢ్యం- వైరస్, ఇన్‌ఫ్లుయెంజా- బ్యాక్టీరియా
 9.    వైరస్‌ల వల్ల కలిగే వ్యాధికి ఉదాహరణ ఇవ్వాలని ఉపాధ్యాయుడు అడిగిన ప్పుడు, విద్యార్థులు కింది విధంగా వివిధ ఉదాహరణలు ఇచ్చారు. ఏ ఇద్దరు విద్యార్థులు ఇచ్చిన ఉదాహరణలు సరికావు?
     ఎ) మీజిల్స్     బి) టెటానస్
     సి) కోరింత దగ్గు     డి) మంప్స్
     1) ఎ, బి     2) ఎ, సి
     3) బి, డి     4) బి, సి
 10.    ఊపిరితిత్తులపై ప్రభావం చూపడం ఏ వ్యాధికి సంబంధించింది?
     1) సిఫిలిస్     2) టైఫాయిడ్
     3) ట్యుబర్‌క్యులోసిస్
     4) డీసెంట్రీ
 సమాధానాలు
 
     1) 4    2) 3    3) 3    4) 2    5) 3
     6) 4    7) 1    8) 2    9) 4    10) 3
 
 బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు
 
 వ్యాధిపేరు     కారకం     సోకే పద్ధతి      లక్షణాలు
 
 టైఫాయిడ్     సాల్మొనెల్లా టైపి    కలుషిత ఆహారం, నీరు, ఈగల ద్వారా.    జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి, విరేచనాలు.
 కోరింత దగ్గు    హెమోఫిల్లస్ పెర్టుసిస్    తుమ్ము, దగ్గువల్ల వెలువడే     మొదట పొడిదగ్గు, తర్వాత దగ్గు తీవ్రత
         తుంపర్ల ద్వారా.    పెరుగుతుంది.
 క్షయ (టీబీ)    మైకో బ్యాక్టీరియం    స్పర్శ, ఆహారం, పాల ద్వారా.    జ్వరం, అలసట బరువు తగ్గడం, దగ్గు.
     ట్యుబర్‌క్యులోసిస్        
 గొంతు పుండు    స్ట్రిప్టోకోకస్    ముక్కు, నోటి తుంపర్ల ద్వారా.    జ్వరం, దగ్గు, గొంతుపుండు పడటం.
 (సోర్‌త్రోట్)         
 ధనుర్వాతం     క్లాస్ట్రీడియం టెటాని    మట్టిలోని బ్యాక్టీరియా,    కండరాల సంకోచం, నరాల తీపు.
         పుండ్ల ద్వారా.     
 డిఫ్తీరియా     కార్ని బ్యాక్టీరియా    స్పర్శ, శ్వాసనాళాల నుంచి వచ్చే    శ్వాసక్రియ కష్టమవడం, గొంతు
         తుంపర్ల ద్వారా.    పుండు పడటం. గొంతులో బూడిద రంగు
             త్వచం ఏర్పడటం.
 
 కలరా     విబ్రియో కలరా     ఈగలు, ఆహారం, మలం, నీటి ద్వారా.    నీళ్ల విరేచనాలు, వాంతులు, కండరాల
             నొప్పులు, మూత్రం నిలిచిపోవటం
 న్యుమోనియా    డిప్లోకోకస్     బ్యాక్టీరియా శ్వాసనాళం ద్వారా     ఛాతిలో నొప్పి, ఎగశ్వాస, పొత్తికడుపులో
     న్యుమోనియా    ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది.    నొప్పి.
 ప్లేగు     షార్‌‌ట రాడ్     
     మెర్సినియా పెస్టిస్     ఎలుకల ద్వారా.     జ్వరం, వాంతులు, చర్మం పొడిబారడం,
             ఉరఃసంధిలోని శోషరసకణుపులు వాయడం.
 బాసిల్లరి
 డీసెంట్రీ     షిజెల్లా డిసెంట్రియా     ఈగలు, ఆహారం, నీటి ద్వారా.     వాంతులు విరేచనాలు, జ్వరం, కడుపునొప్పి                మలంలో రక్తం పడటం.
 గనేరియా     నీస్పెరియా గనేరియా     లైంగిక సంపర్కం ద్వారా.    మూత్రాశయ నాళం వాయడం,
             ఎరుపెక్కడం, మూత్రాశయ నాళం నుంచి
             చీము కారడం, మూత్ర విసర్జన సమయం
             లో మంట.
 సిఫిలిస్     ట్రిపొనిమాపల్లిడం     లైంగిక సంపర్కం ద్వారా.    జననావయవాల మీద పుండ్లు, చర్మంపై
             బొబ్బలు, కణజాలం నశించడం.
 బొటులిజం    క్లాస్ట్రీడియం     ఆహారంలో విషం    వాంతులు, అతిసారం, అలసట, పక్షవాతం.        బొటులిజం     ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా ద్వారా.    
 కుష్టు (లెప్రసీ)     మైకోబ్యాక్టీరియం    వ్యాధిగ్రస్థులతో ఎక్కువ కాలం    పుండ్లు, వేళ్లు, పాదం వంకరలు, శరీర            లెప్రే    సన్నిహిత సంబంధం ద్వారా.    భాగాలు నశించి పోవడం.
 
 ప్రోటోజోవా వల్ల కలిగే వ్యాధులు
 
 వ్యాధిపేరు     కారకం     సోకే పద్ధతి      లక్షణాలు
 
 నిద్రాజాఢ్యం    ట్రిపనోసోమా     సీసీ ఈగ ద్వారా.     జ్వరం, తీవ్రమైన తలనొప్పి, గ్రంథుల వాపు, కీళ్ల        గాంబియన్‌‌స        నొప్పులు, అతినిద్ర,  కనురెప్పల వాపు, ఛాతిమీద                 గుళ్ల్లలు.
 మలేరియా    ప్లాస్మోడియం    ఆడ ఎనాఫిలస్ దోమ    తలనొప్పి, చలిజ్వరం, వెన్నునొప్పి
         కాటు ద్వారా.         
 అతిసారం     జియర్డియా    కలుషిత నీరు, ఆహారం.     అధిక కొవ్వు, జిగట మలంతో విరేచనాలు, జ్వరం
     ఇంటెస్టెనాలిస్ రక్తహీనత, అలర్జీ
 అమీబియాసిస్     ఎంటమీబా     మలంతో కలుషిత    రక్తవిరేచనాలు, కడుపునొప్పి, కాలేయ, మెదడు,
 హిస్టాలిటికా    మైన నీరు, ఆహారం    ప్లీహంలో పుండ్లు, చర్మం, జననావయవాల్లో పుండ్లు
 బాయిల్స్    లీష్మానియా    అంటువ్యాధి సోకిన     ఈగ కాటు వేసిన చోట పుండవడం, కాళ్లు, చేతులు
 ట్రోఫికా    సాండ్ ఈగ కాటు ద్వారా.    ముఖంపై పుండ్లు ఏర్పడటం.
 
 కాంపిటీటివ్ కౌన్సెలింగ్
 డీఎస్సీ పరీక్షలో బయాలజీ కంటెంట్‌కు సంబంధించిన పాఠ్యాంశాలను ఎలా అధ్యయనం చేయాలి? ‘వ్యాధులు, కారకాలు’  నుంచి ఎన్ని ప్రశ్నలు అడుగుతారు?
 - కె.గీత, విశాఖపట్నం
 డీఎస్సీలో   జీవశాస్త్రానికి సంబంధించి అధ్యాయాలకూ సమ ప్రాధాన్యం ఇవ్వాలి. మార్కుల పరంగా కంటెంట్‌కు ఎక్కువ వెయిటేజీ ఉంది.  కాబట్టి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే 8 నుంచి 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలను అధ్యయనం చేయాలి. చదువుతున్నప్పుడే సిలబస్‌లోని  అంశాలపై సొంతంగా బిట్స్ రాసుకుంటే బాగా గుర్తుంటుంది. తెలుగు అకాడమీ   బిట్స్‌తో కూడిన పుస్తకాలను ప్రత్యేకంగా ప్రచురించింది. ఇవి  ఉపయుక్తంగా ఉంటాయి.
     ‘వ్యాధులు, కారకాలు’ పాఠ్యాంశం నుంచి ప్రతి డీఎస్సీలో 2 నుంచి 3 ప్రశ్నలు అడుగుతున్నారు. వ్యాధిపేరు, కారకం, వ్యాప్తి చెందే పద్ధతి, వ్యాధి లక్షణాలను పట్టిక రూపంలో పొందు పర్చుకుని అధ్యయనం చేయాలి. అదే విధంగా గత ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేస్తే ప్రశ్నల సరళిని అర్థం చేసుకోవచ్చు.
 
 ఉద్యోగాలు
 విజయా బ్యాంక్‌లో సెక్యూరిటీ ఆఫీసర్లు
 బెంగళూరులోని విజయా బ్యాంక్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
  సెక్యూరిటీ ఆఫీసర్: 15
 అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు ఆర్మీ/ నేవీ/ ఎయిర్ ఫోర్స్‌లో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.
 వయసు: 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
 ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.
 చివరి తేది: అక్టోబర్ 3
 వెబ్‌సైట్: www.vijayabank.com
 
 ఎంఆర్‌పీఎల్
 మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎంఆర్‌పీఎల్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
  జనరల్ మేనేజర్ (ఇంటర్నల్ ఆడిట్/ ఫైనాన్స్)
  చీఫ్ మేనేజర్ (షిప్పింగ్)
  సీనియర్ మేనేజర్ (లా)
  సీనియర్ మేనేజర్ (ఫైనాన్స్)
  మేనేజర్ (ఆపరేషన్స్, ఫైర్ అండ్ సేఫ్టీ, లా)
 అర్హతలు తదితర వివరాల కోసం వెబ్‌సైట్ చూడొచ్చు.
 దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 20
 వెబ్‌సైట్: http://www.mrpl.co.in

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement