DSC-2008
-
DSC 2008: మిగిలిన ఖాళీల్లో భర్తీ చేయండి
సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ–2008లో 30 శాతం పోస్టులను డీఈడీ అభ్యర్థులకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. 2008 నోటిఫికేషన్లో ఇచ్చిన ఖాళీల్లో ఇంకా భర్తీ చేయకుండా మిగిలిన వాటిని మెరిట్ ఆధారంగా బీఈడీ చేసిన అభ్యర్థులతో భర్తీ చేయమని స్పష్టం చేసింది. ఇందులో తెలంగాణలో దాదాపు 1,800 పోస్టులను భర్తీ చేయమని చెప్పింది. 30 శాతం డీఈడీ అభ్యర్థులకు కేటాయించడం సరైనదా.. కాదా.. అనే అంశం జోలికి తాము వెళ్లడం లేదని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ, జస్టిస్ కె.శరత్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 30,558 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. నోటిఫికేషన్ ఇచ్చిన కొద్ది రోజుల తర్వాత మొత్తం పోస్టుల్లో 30 శాతం(10,200) డీఈడీ అభ్యర్థుల కోసమేనని రిజర్వు చేసింది. ఈ మేరకు 2009, జనవరి 1వ తేదీన జీవో నంబర్ 28ని విడుదల చేసింది. దీన్ని సవాల్ చేస్తూ బీఈడీ అభ్యర్థులు పి. ఉమామహేశ్వర్‌రెడ్డితో పాటు 69 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ, జస్టిస్ కె.శరత్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటినర్ల తరఫున న్యాయవాదులు బొబ్బిలి శ్రీనివాస్, ఎల్.రవిచంద్ర, జి.విద్యాసాగర్, బి.రచనారెడ్డి, ప్రతాప్‌నారాయణ్ సంఘి వాదనలు వినిపించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్, ఏపీ ప్రభుత్వం తరఫున గోవింద్‌రెడ్డి వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం.. మొత్తం పోస్టుల్లో 3,500 పోస్టులను భర్తీ చేయలేదని గుర్తించింది. వీటిలో ఏపీ ప్రభుత్వం కాంట్రాక్టు ఉపాధ్యాయులతో భర్తీ చేయగా, తెలంగాణలో ఇంకా ఖాళీలు మిగిలి ఉన్నాయంది. ఇలా మిగిలిన దాదాపు 1800 పోస్టులను 2008 అభ్యర్థుల మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించింది. -
డీఎస్సీ 2008: నేడు నియామక ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: డీఎస్సీ 2008లో క్వాలిఫై అయ్యి ఇటీవల నియామకాలకు వీలుగా సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన అభ్యర్థులకు శనివారం ఆయా జిల్లాల విద్యాశాఖాధికారి కార్యాలయాలు నియామక ఉత్తర్వులివ్వనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
డీఎస్సీ 2008 అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఎస్జీటీ పోస్ట్‌లు
సాక్షి, విశాఖపట్నం: డీఎస్సీ 2008 అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఎస్జీటీ పోస్ట్‌లు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కాగా రేపటి నుంచి అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో 306-1918 ర్యాంక్ వరకు 110 మంది అభ్యర్థులకు రేపు కౌన్సెలింగ్ జరగనుండగా, 1921-8659 ర్యాంక్ వరకు 119 మందికి ఈనెల 26న కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. deovsp.netలో విల్లింగ్ జాబితా, చెక్‌లిస్ట్ అందుబాటులో ఉంచామని డీఈవో లింగేశ్వర్రెడ్డి తెలిపారు. చదవండి: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు -
12 ఏళ్ల కల సాకారం: మరో హామీని నిలబెట్టుకున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: తన పాదయాత్రలో ఇచ్చిన మరో హామీని సీఎం వైఎస్ జగన్ నెరవేర్చారు. డీఎస్సీ–2008 క్వాలిఫైడ్ అభ్యర్థుల కలను సాకారం చేశారు. వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు. గత ముఖ్యమంత్రులెవ్వరూ పట్టించుకోని ఈ సమస్యను.. సీఎం వైఎస్ జగన్ పరిష్కరించారు. 2,193 మందిని సెకండరీ గ్రేడ్ టీచర్లు(ఎస్జీటీలు)గా నియమించారు. సీఎం ఆదేశాల మేరకు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ సోమవారం దీనికి సంబంధించిన జీవో 39 జారీ చేశారు. మానవతా దృక్పథంతో.. డీఎస్సీ–2008లో అర్హత సాధించినప్పటికీ ప్యాట్రన్‌లో మార్పుల వల్ల పలువురు అభ్యర్థులు అప్పట్లో అవకాశాలు కోల్పోయారు. దీంతో గత ప్రభుత్వాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఉన్నతాధికారుల చుట్టూ అభ్యర్థులు కాళ్లరిగేలా తిరిగారు. చివరకు ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టులను కూడా ఆశ్రయించారు. అయినా గత ప్రభుత్వాలు న్యాయం చేయలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు 2014 ఎన్నికలప్పుడు హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చేయి చూపారు. చివరకు అనేక పోరాటాల ద్వారా ఒత్తిడి చేస్తే.. తూతూమంత్రంగా ఓ ఎమ్మెల్సీల కమిటీ వేశారు. వీరికి విద్యా వలంటీర్లుగా కానీ, కాంట్రాక్టు పద్ధతిలో గానీ, అవుట్‌సోర్సింగ్‌లో గానీ ఉద్యోగాలిచ్చి, 60 ఏళ్ల వరకు జాబ్ సెక్యూరిటీ ఉండేలా చూడాలని ఆ ఎమ్మెల్సీల కమిటీ సిఫార్సు చేసింది. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత.. ఎమ్మెల్సీ కమిటీ సిఫార్సులను పరిశీలించేందుకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో మరో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అధ్యయనం చేసి అర్హులైన అభ్యర్థుల్లో మినిమమ్ టైమ్ స్కేల్‌పై కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసేందుకు అంగీకరించే వారిని ఎస్జీటీలుగా నియమించాలని సిఫార్సు చేసింది. మానవతా దృక్పథంతో దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో పాఠశాల విద్యా శాఖ క్వాలిఫైడ్ అభ్యర్థులను గుర్తించే ప్రక్రియ చేపట్టింది. మొత్తం 4,657 మందిలో 2,193 మంది తమ సమ్మతి లేఖలు అందించారు. దీనికి సంబంధించిన ఫైల్‌ను ఇటీవల సీఎం వైఎస్ జగన్‌కు పంపగా.. ఆయన ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రయోజనాలు, నిబంధనలివే.. – వీరి నియామకం కాంట్రాక్టు సిబ్బందికి వర్తించే నిబంధనలు, షరతులతో 60 ఏళ్ల వయసు వచ్చే వరకు ఉంటుంది. – 2008 డీఎస్సీకి సంబంధించిన ఈ క్వాలిఫైడ్ అభ్యర్థులు ఆ తర్వాత వచ్చిన డీఎస్సీలో పేర్కొన్న ఇతర విద్యా, సాంకేతిక అర్హత నిబంధనలను రెండేళ్లలో సాధించాలి. – అలాగే రెండేళ్లలో ఎన్సీటీఈ ఆమోదించిన ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాలి. – ఇతర కాంట్రాక్టు టీచర్లకు అమలయ్యే ప్రయోజనాలు వీరికి కూడా వర్తిస్తాయి. రెగ్యులర్ టీచర్లకు వచ్చే ప్రయోజనాలను క్లెయిమ్ చేయడానికి వీల్లేదు. – మానవతా దృక్పథంతో 2008 డీఎస్సీ అభ్యర్థుల వరకు మాత్రమే ఈ నియామక ప్రక్రియ. తదుపరి ఇది ప్రామాణికం కాదు. – కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ అభ్యర్థులను నియమించిన ఖాళీల సంఖ్య.. భవిష్యత్ ఎస్జీటీ పోస్టులకు ఇచ్చే నియామకాల్లో తగ్గిస్తారు. చదవండి: ఏపీ: ప్రమాణ స్వీకారం చేసిన నలుగురు నూతన ఎమ్మెల్సీలు -
Andhra Pradesh: 2008 డీఎస్సీ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి: 2008 డీఎస్సీ అభ్యర్ధులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2,193 మంది అభ్యర్ధులకు న్యాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మినిమమ్ టైమ్ స్కేల్‌తో ఎస్జీటీలుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మీడియా సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2008 డీఎస్సీ అభ్యర్థులకు సీఎం జగన్ న్యాయం చేశారన్నారు. మానవతా దృక్పథంతో డీఎస్సీ అభ్యర్ధుల సమస్యను పరిష్కరించామని మంత్రి ఆదిమూలపు తెలిపారు. 2018 డీఎస్సీ అభ్యర్ధులకు కూడా న్యాయం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 486 పీఈటీలు, స్కూల్ అసిస్టెంట్ పీఈటీలకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా మీడియా సమావేశంలో టెట్-2021 సిలబస్‌ను మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. గతంలో బీఈడీ అభ్యర్ధులు చాలా అవకాశాలు కోల్పోయారని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. గత ప్రభుత్వం 2008 డీఎస్సీ అభ్యర్ధులను అసలు పట్టించుకోలేదని ఆయన పేర్కొన్నారు. డీఎస్సీ అభ్యర్ధులను కూడా చంద్రబాబు మోసం చేశారని మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు. చదవండి: వర్సిటీలు అక్రిడిటేషన్ పొందాలి -
2008 డీఎస్సీ అభ్యర్థులకు కాంట్రాక్టు టీచర్లుగా అవకాశం
సాక్షి, అమరావతి: 2008 డీఎస్సీలో కామన్ మెరిట్ పాటించకపోవడం వల్ల నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకటరామిరెడ్డి చెప్పారు. వారిని కాంట్రాక్టు పద్ధతిలో టీచర్లుగా నియమిస్తామని చెప్పారని తెలిపారు. ఆయన బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి ఈ విషయాన్ని విన్నవించారు. అనంతరం ఆయన మీడియా పాయింట్లో మాట్లాడారు. దీనివల్ల 2,193 మంది నిరుద్యోగ టీచర్లు ఉద్యోగం పొందనున్నారని చెప్పారు. ఇప్పటికే కొందరు ప్రభుత్వ ఉద్యోగాల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారని తెలిపారు. వీరికి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్లో మినహాయించాలని సీఎంకు విన్నవించినట్లు చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను నియమించి ఈ అక్టోబర్ 2వ తేదీకి రెండేళ్లు పూర్తవుతుందని, ఆ వెంటనే వారందరికీ ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని కోరగా సీఎం సానుకూలంగా స్పందించారని చెప్పారు. రెండేళ్లు నిండగానే శాఖాపరమైన పరీక్షల్లో పాసైన వారందరికీ ప్రొబేషన్ డిక్లేర్ చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను మొదలు పెట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారన్నారు. ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో 2008 డీఎస్సీ అభ్యర్థులు పి.వెలుగుజ్యోతి, సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అంజన్‌రెడ్డి, కార్యదర్శి అంకమరావు తదితరులు పాల్గొన్నారు. చదవండి: అమానుషం: పసికందును డ్రైనేజీలో పడేసిన తల్లి -
2008 డీఎస్సీ అభ్యర్థులకు మరో అవకాశం
సాక్షి, అమరావతి: 2008 డీఎస్సీలో మెరిట్ జాబితాలో ఉండి పోస్టులు పొందలేకపోయిన వారి విన్నపాలు ఎట్టకేలకు ఫలిస్తున్నాయి. కనీసం కాంట్రాక్ట్ టీచర్లుగానైనా నియమించాలన్న విజ్ఞప్తులను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ప్రస్తుతం వారికి అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వారిని కాంట్రాక్ట్ టీచర్లుగా నియమించేందుకు వీలుగా విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. 2008 డీఎస్సీలో మెరిట్ లిస్ట్‌లో ఉండి పోస్టులు పొందలేకపోయిన వారి జాబితాలను ఇప్పటికే జిల్లాల నుంచి తెప్పించింది. వీరిలో 4,579 మంది బీఈడీ అభ్యర్థులు, 78 మంది డీఈడీ అభ్యర్థులు కలిపి మొత్తం 4,657 మంది ఉన్నారు. వీరిలో కొంతమంది తరువాత డీఎస్సీల్లో, ఇతర పోటీ పరీక్షల్లో వేర్వేరు పోస్టులకు ఎంపికయ్యారు. మిగిలిన వారిలో ఎంతమంది కాంట్రాక్ట్ టీచర్లుగా పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారో తెలుసుకోవలసిందిగా విద్యాశాఖ జిల్లా విద్యాధికారులకు ఉత్తర్వులిచ్చింది. ఆయా అభ్యర్థుల అంగీకారాన్ని, జాబితాలను trc.cse@apschooledu.inకు ఈనెల 18లోగా పంపాలని పేర్కొంది. -
ఆహారంలో విషాన్ని ఉత్పత్తి చేసే సూక్ష్మజీవి వల్ల కలిగే వ్యాధి?
వ్యాధులు - కారకాలు: మానవునిలో చాలా రకాలైన వ్యాధులు వైరస్, బ్యాక్టీరియా, ప్రోటోజోవాల వల్ల వస్తాయి. వీటి ద్వారా వచ్చే వ్యాధులు ఎక్కువగా అంటువ్యాధులు. ప్రత్యక్ష సంబంధం, గాలి, నీరు, లైంగిక సంపర్కం ద్వారా అంటువ్యాధులు ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతాయి. డీఎస్సీ-2008లో అడిగిన ప్రశ్నలు 1. ఒక పిల్లవాడు జిగట విరేచనాలతో బాధపడుతున్నాడు. ఆ వ్యాధికి కారణం? 1) ప్లాస్మోడియం ఫాల్సిఫారం 2) ఉకరేరియా బ్రాన్క్రాఫ్టి 3) ఎంటమీబా హిస్టాలిటికా 4) అమీబా ప్రొటియాస్ 2. ఒక బాలుడు విడువని జ్వరం, పొట్ట భాగంలో నొప్పి, నాలుకపై పూత, తలభారంతో బాధపడుతున్నాడు. ఈ లక్షణాలను బట్టి ఆ వ్యాధి ఏది? 1) మలేరియా 2) కలరా 3) డిఫ్తీరియా 4) టైఫాయిడ్ 3. ఒక పిల్లవాడు రెండు చెవులకు దిగువన దవడ భాగంలో నొప్పి, చెవినొప్పి, జ్వరంతో బాధపడుతున్నాడు. ఇది ఏ వ్యాధి? 1) గవదలు 2) ధనుర్వాతం 3) డిఫ్తీరియా 4) మలేరియా 4. పోలియో వ్యాధిలో వైరస్ దేన్ని నాశనం చేస్తుంది? 1) చాలక నాడులు 2) కశేరు నాడులు 3) జ్ఞాన నాడులు 4) కపాల నాడులు సమాధానాలు 1) 3 2) 4 3) 1 4) 1 జీవశాస్త్రం - కంటెంట్ (ఎస్.ఎ.) ఎస్.పి.డి. పుష్పరాజ్ : సబ్జెక్ట్ నిపుణులు, గిద్దలూరు, ప్రకాశం మాదిరి ప్రశ్నలు 1. కిందివాటిలో ప్రత్యక్ష సంబంధం వల్ల రాని వ్యాధి? 1) మశూచి 2) జలుబు 3) గవద బిళ్లలు 4) పోలియోైమైలిటిస్ 2. శరీరం బరువు 10 శాతం లేదా అంతకంటే తగ్గడం, మెదడు కంతులు, రక్తనాళాలు చిట్లిపోవడం, విరేచనాలు, లింఫ్ గ్రంథులు వాయడం, కారణం లేకుండా జ్వరం వంటి లక్షణాలు ఏ వ్యాధికి చెందినవి? 1) తట్టు 2) అమ్మవారు 3) ఎయిడ్స 4) డెంగ్యూ 3. టైఫాయిడ్, క్షయ, ప్లేగు వ్యాధుల సంక్ర మణ పద్ధతికి సంబంధించిన సరైన క్రమం? 1) మట్టిలోని బ్యాక్టీరియా- ప్రత్యక్ష సంబంధం- పెంపుడు జంతువుల ద్వారా 2) ఈగలు- ప్రత్యక్ష సంబంధం- దోమల ద్వారా 3) ఈగలు- పత్యక్ష స్పర్శ- ఎలుకల ద్వారా 4) ఎలుకలు- ఈగలు - ప్రత్యక్ష స్పర్శ 4. ఒక వ్యాధిగ్రస్థుడు డాక్టర్ దగ్గరకు వెళ్లి తనకు కండరాలు సంకోచించడం, నరాల తీపులు, గిట్ట కరుచుకోవడం వంటి లక్షణాలున్నాయని తెలిపాడు. డాక్టర్ ఏ వ్యాధి అని నిర్ధారిస్తాడు? 1) క్షయ 2) ధనుర్వాతం 3) న్యుమోనియా 4) డిఫ్తీరియా 5. ఆహారంలో విషాన్ని ఉత్పత్తి చేసే సూక్ష్మజీవి వల్ల కలిగే వ్యాధి? 1) కుష్టు 2) కలరా 3) బొటులిజం 4) గనేరియా 6. కిందివాటిలో వైరస్ వల్ల రాని వ్యాధి? 1) జలుబు 2) గవద బిళ్లలు 3) పోలియో 4) క్షయ 7. హెమోఫిల్లస్ పెర్టుసిస్ ఏ వ్యాధిని కలిగిస్తుంది? 1) కోరింత దగ్గు 2) టైఫాయిడ్ 3) డీసెంట్రీ 4) డిఫ్తీరియా 8. కలరా- విబ్రియో కలరా, నిద్రాజాఢ్యం -ట్రిపనో సోమా గాంబియన్స, ఇన్ఫ్లు యెంజా/ఫ్లూ- ఆర్థోమిక్సో కారకాల వల్ల వ్యాధులు కలుగుతాయి. వీటికి సంబంధించి సరైన వరుస క్రమం? 1) కలరా-ప్రోటోజోవా, నిద్రా జాఢ్యం - వైరస్, ఇన్ ఫ్లుయెంజా - బ్యాక్టీరియా 2) కలరా- బ్యాక్టీరియా, నిద్రాజాఢ్యం - ప్రోటోజోవా, ఇన్ఫ్లుయెంజా వైరస్ 3) కలరా-వైరస్, నిద్రాజాఢ్యం- ప్రోటోజోవా, ఇన్ఫ్లుయెంజా - బ్యాక్టీరియా 4) కలరా- బ్యాక్టీరియా, నిద్రాజాఢ్యం- వైరస్, ఇన్ఫ్లుయెంజా- బ్యాక్టీరియా 9. వైరస్ల వల్ల కలిగే వ్యాధికి ఉదాహరణ ఇవ్వాలని ఉపాధ్యాయుడు అడిగిన ప్పుడు, విద్యార్థులు కింది విధంగా వివిధ ఉదాహరణలు ఇచ్చారు. ఏ ఇద్దరు విద్యార్థులు ఇచ్చిన ఉదాహరణలు సరికావు? ఎ) మీజిల్స్ బి) టెటానస్ సి) కోరింత దగ్గు డి) మంప్స్ 1) ఎ, బి 2) ఎ, సి 3) బి, డి 4) బి, సి 10. ఊపిరితిత్తులపై ప్రభావం చూపడం ఏ వ్యాధికి సంబంధించింది? 1) సిఫిలిస్ 2) టైఫాయిడ్ 3) ట్యుబర్క్యులోసిస్ 4) డీసెంట్రీ సమాధానాలు 1) 4 2) 3 3) 3 4) 2 5) 3 6) 4 7) 1 8) 2 9) 4 10) 3 బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు వ్యాధిపేరు కారకం సోకే పద్ధతి లక్షణాలు టైఫాయిడ్ సాల్మొనెల్లా టైపి కలుషిత ఆహారం, నీరు, ఈగల ద్వారా. జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి, విరేచనాలు. కోరింత దగ్గు హెమోఫిల్లస్ పెర్టుసిస్ తుమ్ము, దగ్గువల్ల వెలువడే మొదట పొడిదగ్గు, తర్వాత దగ్గు తీవ్రత తుంపర్ల ద్వారా. పెరుగుతుంది. క్షయ (టీబీ) మైకో బ్యాక్టీరియం స్పర్శ, ఆహారం, పాల ద్వారా. జ్వరం, అలసట బరువు తగ్గడం, దగ్గు. ట్యుబర్క్యులోసిస్ గొంతు పుండు స్ట్రిప్టోకోకస్ ముక్కు, నోటి తుంపర్ల ద్వారా. జ్వరం, దగ్గు, గొంతుపుండు పడటం. (సోర్త్రోట్) ధనుర్వాతం క్లాస్ట్రీడియం టెటాని మట్టిలోని బ్యాక్టీరియా, కండరాల సంకోచం, నరాల తీపు. పుండ్ల ద్వారా. డిఫ్తీరియా కార్ని బ్యాక్టీరియా స్పర్శ, శ్వాసనాళాల నుంచి వచ్చే శ్వాసక్రియ కష్టమవడం, గొంతు తుంపర్ల ద్వారా. పుండు పడటం. గొంతులో బూడిద రంగు త్వచం ఏర్పడటం. కలరా విబ్రియో కలరా ఈగలు, ఆహారం, మలం, నీటి ద్వారా. నీళ్ల విరేచనాలు, వాంతులు, కండరాల నొప్పులు, మూత్రం నిలిచిపోవటం న్యుమోనియా డిప్లోకోకస్ బ్యాక్టీరియా శ్వాసనాళం ద్వారా ఛాతిలో నొప్పి, ఎగశ్వాస, పొత్తికడుపులో న్యుమోనియా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. నొప్పి. ప్లేగు షార్ట రాడ్ మెర్సినియా పెస్టిస్ ఎలుకల ద్వారా. జ్వరం, వాంతులు, చర్మం పొడిబారడం, ఉరఃసంధిలోని శోషరసకణుపులు వాయడం. బాసిల్లరి డీసెంట్రీ షిజెల్లా డిసెంట్రియా ఈగలు, ఆహారం, నీటి ద్వారా. వాంతులు విరేచనాలు, జ్వరం, కడుపునొప్పి మలంలో రక్తం పడటం. గనేరియా నీస్పెరియా గనేరియా లైంగిక సంపర్కం ద్వారా. మూత్రాశయ నాళం వాయడం, ఎరుపెక్కడం, మూత్రాశయ నాళం నుంచి చీము కారడం, మూత్ర విసర్జన సమయం లో మంట. సిఫిలిస్ ట్రిపొనిమాపల్లిడం లైంగిక సంపర్కం ద్వారా. జననావయవాల మీద పుండ్లు, చర్మంపై బొబ్బలు, కణజాలం నశించడం. బొటులిజం క్లాస్ట్రీడియం ఆహారంలో విషం వాంతులు, అతిసారం, అలసట, పక్షవాతం. బొటులిజం ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా ద్వారా. కుష్టు (లెప్రసీ) మైకోబ్యాక్టీరియం వ్యాధిగ్రస్థులతో ఎక్కువ కాలం పుండ్లు, వేళ్లు, పాదం వంకరలు, శరీర లెప్రే సన్నిహిత సంబంధం ద్వారా. భాగాలు నశించి పోవడం. ప్రోటోజోవా వల్ల కలిగే వ్యాధులు వ్యాధిపేరు కారకం సోకే పద్ధతి లక్షణాలు నిద్రాజాఢ్యం ట్రిపనోసోమా సీసీ ఈగ ద్వారా. జ్వరం, తీవ్రమైన తలనొప్పి, గ్రంథుల వాపు, కీళ్ల గాంబియన్స నొప్పులు, అతినిద్ర, కనురెప్పల వాపు, ఛాతిమీద గుళ్ల్లలు. మలేరియా ప్లాస్మోడియం ఆడ ఎనాఫిలస్ దోమ తలనొప్పి, చలిజ్వరం, వెన్నునొప్పి కాటు ద్వారా. అతిసారం జియర్డియా కలుషిత నీరు, ఆహారం. అధిక కొవ్వు, జిగట మలంతో విరేచనాలు, జ్వరం ఇంటెస్టెనాలిస్ రక్తహీనత, అలర్జీ అమీబియాసిస్ ఎంటమీబా మలంతో కలుషిత రక్తవిరేచనాలు, కడుపునొప్పి, కాలేయ, మెదడు, హిస్టాలిటికా మైన నీరు, ఆహారం ప్లీహంలో పుండ్లు, చర్మం, జననావయవాల్లో పుండ్లు బాయిల్స్ లీష్మానియా అంటువ్యాధి సోకిన ఈగ కాటు వేసిన చోట పుండవడం, కాళ్లు, చేతులు ట్రోఫికా సాండ్ ఈగ కాటు ద్వారా. ముఖంపై పుండ్లు ఏర్పడటం. కాంపిటీటివ్ కౌన్సెలింగ్ డీఎస్సీ పరీక్షలో బయాలజీ కంటెంట్‌కు సంబంధించిన పాఠ్యాంశాలను ఎలా అధ్యయనం చేయాలి? ‘వ్యాధులు, కారకాలు’ నుంచి ఎన్ని ప్రశ్నలు అడుగుతారు? - కె.గీత, విశాఖపట్నం డీఎస్సీలో జీవశాస్త్రానికి సంబంధించి అధ్యాయాలకూ సమ ప్రాధాన్యం ఇవ్వాలి. మార్కుల పరంగా కంటెంట్‌కు ఎక్కువ వెయిటేజీ ఉంది. కాబట్టి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే 8 నుంచి 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలను అధ్యయనం చేయాలి. చదువుతున్నప్పుడే సిలబస్‌లోని అంశాలపై సొంతంగా బిట్స్ రాసుకుంటే బాగా గుర్తుంటుంది. తెలుగు అకాడమీ బిట్స్‌తో కూడిన పుస్తకాలను ప్రత్యేకంగా ప్రచురించింది. ఇవి ఉపయుక్తంగా ఉంటాయి. ‘వ్యాధులు, కారకాలు’ పాఠ్యాంశం నుంచి ప్రతి డీఎస్సీలో 2 నుంచి 3 ప్రశ్నలు అడుగుతున్నారు. వ్యాధిపేరు, కారకం, వ్యాప్తి చెందే పద్ధతి, వ్యాధి లక్షణాలను పట్టిక రూపంలో పొందు పర్చుకుని అధ్యయనం చేయాలి. అదే విధంగా గత ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేస్తే ప్రశ్నల సరళిని అర్థం చేసుకోవచ్చు. ఉద్యోగాలు విజయా బ్యాంక్‌లో సెక్యూరిటీ ఆఫీసర్లు బెంగళూరులోని విజయా బ్యాంక్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సెక్యూరిటీ ఆఫీసర్: 15 అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు ఆర్మీ/ నేవీ/ ఎయిర్ ఫోర్స్‌లో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా. చివరి తేది: అక్టోబర్ 3 వెబ్సైట్: www.vijayabank.com ఎంఆర్‌పీఎల్ మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎంఆర్‌పీఎల్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జనరల్ మేనేజర్ (ఇంటర్నల్ ఆడిట్/ ఫైనాన్స్) చీఫ్ మేనేజర్ (షిప్పింగ్) సీనియర్ మేనేజర్ (లా) సీనియర్ మేనేజర్ (ఫైనాన్స్) మేనేజర్ (ఆపరేషన్స్, ఫైర్ అండ్ సేఫ్టీ, లా) అర్హతలు తదితర వివరాల కోసం వెబ్సైట్ చూడొచ్చు. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 20 వెబ్సైట్: http://www.mrpl.co.in