ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: 2008 డీఎస్సీలో మెరిట్ జాబితాలో ఉండి పోస్టులు పొందలేకపోయిన వారి విన్నపాలు ఎట్టకేలకు ఫలిస్తున్నాయి. కనీసం కాంట్రాక్ట్ టీచర్లుగానైనా నియమించాలన్న విజ్ఞప్తులను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ప్రస్తుతం వారికి అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వారిని కాంట్రాక్ట్ టీచర్లుగా నియమించేందుకు వీలుగా విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది.
2008 డీఎస్సీలో మెరిట్ లిస్ట్‌లో ఉండి పోస్టులు పొందలేకపోయిన వారి జాబితాలను ఇప్పటికే జిల్లాల నుంచి తెప్పించింది. వీరిలో 4,579 మంది బీఈడీ అభ్యర్థులు, 78 మంది డీఈడీ అభ్యర్థులు కలిపి మొత్తం 4,657 మంది ఉన్నారు. వీరిలో కొంతమంది తరువాత డీఎస్సీల్లో, ఇతర పోటీ పరీక్షల్లో వేర్వేరు పోస్టులకు ఎంపికయ్యారు. మిగిలిన వారిలో ఎంతమంది కాంట్రాక్ట్ టీచర్లుగా పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారో తెలుసుకోవలసిందిగా విద్యాశాఖ జిల్లా విద్యాధికారులకు ఉత్తర్వులిచ్చింది. ఆయా అభ్యర్థుల అంగీకారాన్ని, జాబితాలను trc.cse@apschooledu.inకు ఈనెల 18లోగా పంపాలని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment